APLatestNews.com top Banner
అప్పు లేదా? మనశ్శాంతి లేని ఎదుగుదల కావాలా? మోహం లో, ఆకాశం అంటుదామా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
గోపీ రాముతో చెపుతున్నాడు, ఒకరు అడిగారు నన్ను, మీకు అప్పు లేదా అని. ఇలా చెప్పాను వారితో.

దేవుని దయ వలన అక్కడ కానీ ఇక్కడ కానీ, రూపాయి అప్పు లేదు, మనకు రావాల్సినవి తప్ప. దాని ఫలితము, దాని వలన లాభం, నిండైన మనశ్శాంతి.

ఒకసారి మా బాంక్ కి ఫోన్ చేసి, క్రెడిట్ కార్డ్ రేటు ఎందుకు పెంచారు అని ఆవేశంగా అడిగా. రేటు పెంచాము అందరికీ, ఒక్కసారి మీ అక్కౌంట్ చూస్తాను అన్నారు. పదేళ్ల లో నయా పైసా వడ్డీ కట్టావా, మా బాంక్ కి? నెల ముందే వెనక్కి ఇచ్చారు అని అన్నారు, అంతే ఆవేశంగా. రేటు పెరిగినా, మా కొచ్చేదీ లేదు, మీకు పోయింది లేదు అని నవ్వారు. అలా ఉంటుంది మన చెల్లింపులు ఎప్పటికి అప్పుడు.

కానీ నాణానికి 2 వ వైపు చూస్తే, ఎక్కడ అయినా, అప్పు లేకుండా, ఆర్థికంగా ఎదగలేము, ఇల్లు కొనలేము, ఇది నష్టం మనకు లేదా చాలా మందికి. కానీ, మనశ్శాంతి లేని ఎదుగుదల కావాలా? మోహం లో, ఆకాశం అంటుదామా? అయితే, పడక తప్పదు ఏమో.

బతకడానికి, నా కూతురు(అమ్మ) ను చూసుకోడానికి, దేవుడు తగినంత శక్తిని అవకాశము ఇస్తే చాలు. ఎక్కువ ధనము లేదా అప్పులు వద్దు, మనకు నిద్ర పట్టదు.

అప్పు లేదు అని, కోటీశ్వరుడు అనుకోవద్దు. అమెరికాలో, తెల్ల కార్డుకు సమానం. కానీ బ్రహ్మ ఆనందం లో మాత్రం, తెల్లకార్డు కాదు.

అన్ని లాగేసినా, దేవుని మాత్రము వదలకూడదు. అర్జునుడు, దేవుడు ఒక్కరు చాలు తన వైపు అన్నాడు. అన్ని వస్తున్నవి పోతున్నవి, వారు తామరాకు లాగ హయిగా ఉన్నారు.

కానీ దుర్యోధనుడు, దేవుడు తప్ప, అన్ని కావాలి అన్నారు. అలాగే అద్రుష్టము రాజ్యము సంపద అనుభవించాడు. చివరకు అన్ని దూరము అయిపోయాయి. ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు సుమా.
 

Dt : 25-Oct-2019, Upd Dt : 25-Oct-2019 , Category : General
Views : 33 ( + More Social Media views ) ( id : 197 )
Tags : credit , peace of mind , enough wealth

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content