APLatestNews.com top Banner
మన మంచి మాట గొప్పదా? మించిన ఐశ్వర్యం గొప్పదా? ఇంట్లో వాళ్ళకు లేదా ఎవరికైనా? - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మన మంచి మాట గొప్పదా? మించిన ఐశ్వర్యం గొప్పదా? మన ఇంట్లో వాళ్ళకు లేదా బయటవారికి, ఎవరికైనా?

మన మంచి మాటలను, ఉచితం గా అందరికీ పంచవచ్చు. దాని వలన మన మనసు, ఆలోచనా శక్తి, మాటల మీద పట్టు పెరుగుతుంది. మనసు ప్రశాంతము గా లేనిదే, మాటలు ఉప్పొంగవు. అయితే, వాటిని పాటిస్తూ మాత్రమే చెప్పాలి.

కొంత మందికి అవే మాటలు, తలనొప్పి కావొచ్చు, సమయానికి సంజీవీనీ కావొచ్చు, ఆనందం ఇవ్వవచ్చు, ఈర్ష కూడా కలిగించ వచ్చు. వారి వారి, మనసు సంస్కారం ను బట్టి ఉంటుంది. మంచి మాటలను, దొంగ కూడా, మన నుంచి దొంగ తనము చేయలేడు. చెప్పేకొద్ది పెరుగుతాయి, కాని తరగవు. ఒక గంట చెపితే, ఎవరైనా చాలు అంటారు త్రుప్తి గా లేదా తలనొప్పితో.

ఆ జ్ఞానం తో, చెత్త బూతు సాహిత్యం కూడా రాయవచ్చు, లక్షల మంది లైకు లు చప్పట్లు పొందవచ్చు, తదనుగుణంగా పాపము శిక్ష పతనం పొందవచ్చు. కానీ నీతి వీడరాదు , అటు వైపు పోరాదు.

మంచి వాడు ఒక్క నవ్వు నవ్వితే చాలు లేదా మనసు ప్రశాంత పడితే చాలు, ఆ మంచి మాటలకు, మనకు ఎంతో పుణ్యము. చెత్త సాహిత్యం కు, లక్షల మంది జేజేలు కొట్టవచ్చు. నిష్ప్రయోజనం సుమా.

అలాగే, మన దగ్గర సంపద ఉండి కోటీశ్వరులము అయితే, ఇలా ఉచితం గా పంచడం చేయగలమా? దొంగ నుంచి రక్షణ పొంద గలమా? అహంకారముతో, అధికారముతో ఎన్నో తప్పులు చేస్తాము, మోస్తాము. కాలం ఎదురు తిరిగితే, రోడ్ నో ఫానో నదో, మన దోవ తెలీదు.

డబ్బు తో ఒకరు నైనా తృప్తి పరచగలమా? ఈ రోజు ఉచితముగా కోటి ఇచ్చినా, రేపు లేవు అంటే, పొగిడిన వారే మరలా తిడతారు.

కనీసం, మనం మనశ్శాంతి గా ఉండగలమా? డబ్బు తప్ప , అన్ని దూరం అవుతాయి. డబ్బు అవసరం అయిన వరకు ఉండవచ్చు, కానీ లెక్క కు మించితే, అధోగతే. మోహం, ప్రమాదకరం.
 
Dt : 04-Oct-2019, Upd Dt : 04-Oct-2019 , Category : General, Views : 43 ( id : 181 )
Tags : good words value , Billionaires money use

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =