APLatestNews.com top Banner
         
స్నేహితుని చెడు అలవాటు మానిపించడానికి ఇంకో స్నేహితుని ప్రయత్నం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఇప్పుడే తెలిసింది, మామూలు గానే ఉంది నీ ఆరోగ్యం అని. మిత్రమా, ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి వచ్చావు. ఆరోగ్యం దెబ్బ తింటే వెనక్కు తాలేము. ముందు జాగ్రత్తలు మంచిది.

ఇది దేవుడు ఇచ్చిన వార్నింగ్ అనుకొని జాగ్రత్తలు పడదాము ఏ చెడ్డ అలవాటు ఉన్నా, మజ్జిగ(మందు), పొగ , జూదం , చిన్న ఇల్లు, బయట తిండి, . . .

నా పరిస్తితి చూడు ఒక్కసారి. మాంసం తినగలిగి ఉండి మానేసాను. పరువు మంచం ఉండి , కింద పడుకుంటున్నా. ఇంకా ఇలాంటి వి ఎన్నో, చెపితే నీకు కళ్ళు తిరుగుతాయి. 20 ఏళ్ళు దాటింది, ఏ మాత్రం బాధ వ్యధ లేదు.

నా ఎదురుగా కోక్, పిజ్జా, బర్గర్, మందు , మగువ , స్వీట్లు, క్లబ్బు, జూదం, సినిమా, ఇలా క్షణం లో సర్వ నాశనం అవడానికి, కావలసిన అన్ని సదుపాయాలు, ఎదురు గా అందుబాటులో ఉన్నాయి. చేతిలో డబ్బు ఉంది, ఆపే వారు లేరు.

క్షణం చాలు పాడవడానికి, ఒక్క ఫోన్ చాలు, అన్ని ఇంటి కి వస్తాయి. కానీ, తప్పు, మాధవుడుకి దూరం అవుతాము. మనం లేకపోతే మన వాళ్లు ఏమౌతారు, అన్న ఒక్క ఆలోచన 20 ఏళ్లుగా, ముళ్ళ కంచె గా అడ్డు ఉంది, ఇంకా ఉంటుంది కూడా.

మీ అంత కష్టం నేను చేయలేను, నా కన్నా మీరే గొప్పవారు. నా కన్నా కష్ట జీవులు మీరు, లోకం చదివిన వారు, ఎదురు దెబ్బలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన వారు, మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది అని తెలిసి, మీకున్న చెడు అలవాటు ఎంత కష్టమైనా మానుకోలేరా?

కనీసం నన్ను చూసి ప్రయత్నం చేయండి. ఆఫ్టరాల్ మన లాగ కష్టం కి క్షణం పనికిరాని వాడు, మనకన్నా బలహీనుడు చేయగలిగినది, నేను చేయలేనా అని?

ఒక్క క్షణం, మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబం ని, మా లాంటి అనాధలను గుర్తు కు తెచ్చుకోండి. మీ చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.

శరీరం తో చేయగలిగిన మంచి పనులు, శరీరం వీడినాక లేక శరీర భాగాలు పనిచేయని తర్వాత ఏమి చేయలేము. మాధవుడు మాత్రమే దోవ చూపగలడు చీకటి లో.

మీ పొగడ్త కాదు కావాలసింది. గుండె ల మీద చెయ్యి వేసుకొని, ఆఫ్ట్రాల్ నీ లాంటి బలహీనుడే చెయ్యంగ లేనిది, మా కుటుంబం కోసం నేను ఈరోజు, ఈ చెడ్డ అలవాటు మానేస్తున్నాను, సంపూర్ణంగా అనండి. మీ కుటుంబం కి మంచి చేయండి.

ఇక్కడ తోటి మిత్రులు అందరూ ఎగతాళి చేశారు, 20 ఏళ్లుగా. ఒక కోక్ తాగవు , సినిమా చూడవు , క్లబ్ కు రావు, గాలికి తిరగడానికి రావు. ఎందుకు ఈ బ్రతుకు, ఈ సంపాదన అని? ఉండి ఉపయోగ మేముంది, భూమి కి భారం తప్ప అంటే, నవ్వుతూ గమ్ముగా ఉన్నా.

ఇప్పుడు వారికి, కాలమే జవాబు ఇచ్చింది. నేను ఇప్పటి కి గమ్ముగా నే ఉంటా. వారి మాటలకు.

ఒకవేళ రేపొద్దున నేను డబ్బు లేక వెనక్కి వచ్చినా, ఇన్నాళ్లు దుబారా లేకుండా అదుపులో ఉన్నందుకు, గొప్ప జవాబు ఏమిటో తెలుసా.

నాకు జన్మనిచ్చిన తల్లి కి, 5 ఏళ్లుగా ప్రపంచంలో అత్యుత్తమ వైద్యం అందించా, దేవుని దయవలన, ఈదేశ చలవ వలన. మన ముఖ్యమంత్రు లు , ప్రధానమంత్రు లు కూడా రెండు నెలలే ఉంటారు, ఇక్కడ వైద్యం కోసం వచ్చి.

బీపీ, షుగర్ లాంటి వాటి బారి నుంచి, 74 ఏళ్ల ముదుసలి తల్లి ని 5 ఏళ్లుగా నిలబెట్టుకో గలిగా. ఎంతమంది కి అది, మనస్పూర్తిగా సాధ్యమౌతుంది?

ఎన్నో కుటుంబాల కు, గంటలు గంటలు మంచి చెడు చెప్పే భాగ్యం దక్కింది. విని ఆచరించిన వారు సంతోషం గా ఉన్నారు. వినని వారు లేదా విని ఆచరించని వారు, తాము స్రుష్టించుకున్న సమస్య ల తో తామే అల్లాడుతున్నారు.

మిత్రమా మారు, నీ కుటుంబ సంతోషం కోసము. అల్పుడిని, బలహీనుడిని, నేను మనసును అదుపులో పెట్టుకున్నప్పుడు, నువ్వు అదుపులో ఉంచలేవా? ఉంచ గలవు, ఆలోచన చెయ్యి, ప్రయత్నం చెయ్యి. నా కన్నా, నీకే ఎక్కువ శక్తి ఉంది.
 
Dt : 05-Aug-2019, Upd Dt : 05-Aug-2019 , Category : General, Views : 145 ( id : 147 )
Tags : friendship day , true friendship , leave bad habits

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content