పాటలు భజనలు, దేవుని కోసము కాదు, మన కోసమే, మన మాట బాగా వస్తుంది - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గుడి కి చాలా కాలంగా ఉత్తర భారతం తల్లి కూతురు వస్తారు. పిల్ల కు పదేళ్ల లోపు, బుద్దిగా హారతి దగ్గర నిలుచుంటుంది. వాళ్ళ అమ్మ పాడుతుంటే, పిల్ల చూస్తూ ఉంటుంది హారతి. ఆ పిల్ల ను కూడా పుస్తకము చూసి పాడమని చెపుదాం అంటే, హిందీ పంజాబీ మనకు రాదని గమ్ముగా ఉన్నా.

ఈరోజు అవకాశం వచ్చింది, ఏ పిల్లా నోరు ఎత్తి పాడవు, గమ్ముగా నిలుచుంటావు బొమ్మలా అన్నా ఇంగ్లీషు లో. పిల్ల సిగ్గు పడుతూ, పరుగులు తీయబోయింది. వాళ్ళ అమ్మ, చేయి పట్టుకుని ఆపి, ఆయనేం చెబుతున్నారో విను, మంచి మాటలు అంది.

చూడు పెద్ద వాడిని, పాడలేక బొంగురు గొంతు తో కష్టం గా పాడుతూ ఉంటే, కనీసం పుస్తకం చూసి, పాడే ప్రయత్నం చేయాలి. ఈ వయసు లో, నీ గొంతు నరాలు స్వరాలు, తేలికగా చక్కగా పాటకు, సాగుతూ వస్తాయి. పాటలు భజనలు, దేవుని కోసము కాదు, మన కోసమే.

మన గొంతు మాట బాగా వస్తుంది, గొంతు బాగుంటే, రేపు నీ పిల్లలు మీ ఆయన కూడా, మా ఇంట్లో లతామంగేష్కర్ ఉంది, అని సంతోష పడతారు కదా అన్నా నవ్వుతూ. ఆ పిల్ల కు ఇంగ్లీషు వచ్చు, తల్లి కి సగం అర్థం అవుతుంది. ఇద్దరూ ఫక్కున నవ్వారు. కరక్టే గదా, ప్రయత్నము చేయవచ్చు అంది వాళ్ళమ్మ.

గుడి అంటే, ఎదో పిక్నిక్ కి, అలా వచ్చి, ఇలా ప్రసాదం తినడం వెళ్ళడము కాదు. బడిలో కూడా పంతులు కు దండం పెట్టి వస్తే సరిపోతుందా, పాస్ అవుతామా అన్నా? లేదా కష్టపడి చదివి, గుర్తు పెట్టుకోవాలి అంది.

కరెక్ట్, అదే మెడిటేషన్ ధ్యానం, మననం చేయడం, అలాగే కష్టపడి చదవడం ఫిజికల్ యాక్టివిటీ. అలాగే గుడి లో కూడా ఫిజికల్ గా దీపం పెట్టాలి, మంచిగా పాడాలి, ప్రదక్షిణలు చేయాలి, నామ స్మరణ మననం చేయాలి. అప్పుడే దేవుని ఫలితం మనకు అందేది.

చూడు అమ్మమ్మ ఈ వయస్సు లో కూడా, పొద్దున్నే లెగిచి ఉదయం 4 కు, 84 (పొరపాటున అన్నా) ఏళ్ళు ఉండి కూడా, ఆలయముకు వచ్చి తిరుగుతూ ఉంది అన్నా ఇంగ్లీషు లో.

అమ్మకు ఇంగ్లీషు అర్థం అయి, ఏంది యైటీ అంటావు అంది. వామ్మో అని, పొరపాటు జరిగింది, 74 అని మరలా చెప్పా. వాళ్ళూ ఆడవాళ్ళే గదా, వయస్సు ఎక్కువ చెపితే ఊరుకోరు కదా ఎవరూ, ఫక్కున నవ్వారు.

అలా ఆ పిల్లకు, ఓ రెండు నిమిషాల బుల్లి పాఠం అయింది, కరోనా చెల్లి దెబ్బకి, జనం లేక.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 14-Mar-2020, Upd Dt : 14-Mar-2020, Category : General
Views : 412 ( + More Social Media views ), Id : 408 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : temple , chanting singing bhajans , kid voice
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content