కన్నడ కలర్స్ సంగీత ప్రోగ్రాం - మంజునాథ సినిమా పాట పాడిన వ్యక్తి, ప్రేక్షకుల స్పందన అద్భుతం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2134 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2169 General Articles and views 2,200,448; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పూజ చేయండి, మంత్రాలు నోటితో చదవండి, మనసు కు మనశ్శాంతి, మానసిక బలం ఇస్తాయి, నాద యోగం, శ్వాస యోగం, మాట యోగం అంటే, అబ్బో మాకు సమయం లేదు లేదా నోరు తిరగదు, అబ్బా అనే వందలాది మిత్రులు, మన పల్లెటూరు నుంచి, హైదరాబాద్ బెంగులూర్ నోయిడా మీదుగా, విదేశాల్లో మనసు రాయిగా చేసి, లక్షలు సాధించే, సాఫ్ట్వేర్ ఉద్యోగుల దాకా ఉన్నారు. ఉద్యోగం పోతుంది అంటే, తెల్లారి కొత్త కంప్యూటర్ భాష నేర్చుకుంటారు. కానీ, తాతల కాలం నాటి మంత్రాలు వద్దు, పలకవు.

వారి లెక్క లో పూజ అంటే, ఫోనో లాప్ టాపో పెట్టి, సినిమాలో డబ్బింగ్ నటులు లాగా, పెదాలు చేతులు కదిలిస్తూ ఇతరులతో మాట్లాడుతూ నటిస్తున్న, పూజ అయిపోయినట్టే సుమా. శివా, శివా, పాపం శమించు గాక.

పంచ భక్ష పరమాన్నాల నైవేద్యం మాత్రం, మనకే. మనమే తినాలి, పొట్ట లో అంగుళం ఖాళీ లేకుండా, ఉదరం బాన సాగినంత వరకు సుమా. అది కూడా లాప్ టాప్ నే ఫోన్ నే తినమని, లేదా బయట పేదలకు ఇచ్చిన కూడా, పుణ్యం వస్తుంది కదా. మంత్రాలు చదివేది ఫోన్, లాప్ టాపో అనే యంత్రాలు, విందులు ఆరగించేది మాత్రం మనం మనుషులం.

అందుకే దేవుడు కూడా యంత్రాలను మెచ్చి, కంప్యూటర్ కు ఫోన్ లకూ వరాలు ఇస్తున్నారు. ఐ7, ఐ9, 500 జీబీ ఎస్ ఎస్ డీ, ఐఫోన్ 15 అని, 50 వేలు తక్కువ లేవు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ తో. వాటికున్న విలువ మనిషి కి లేకుండా పోయే. అవి పెరుగుతున్న మెమొరీతో ఉంటే, మనం మతిమరుపుతో తరుగుతున్నాం.

ఆ మంత్రాలు విన్న ఆస్వాదించిన, వైరస్లు ఇతర యంత్రాలు జీవాలు, ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్నాయి, తమ బుల్లి ఆకారం, అమితమైన పరాక్రమ శక్తి తో.

భయంతో హహ కారాలు చేస్తున్నామే కానీ, సిగ్గు తెచ్చుకుని శివ శివా అని మాత్రం, నోటితో అనడం లేదు. ఈ పాట ఎవరి గొంతులో నుంచి వచ్చిందో వినైనా, మనకు బుద్ధి రావాలి, మారాలి. ఇప్పుడు అయినా కుటుంబం మొత్తం మంత్రాలు, నోటితో చదవాలి పాటలు పాడాలి.

మనం ఎంత బద్దకస్తులం అయిపోయాము అంటే, ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజాలు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ లు, తెలుగు విభాగాలు పెడుతున్నాయి, తెలుగు లో విషయాలు చెపుతున్నాయి.

కానీ మనకు, మన పిల్లల కు మరియు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కు, మాత్రం సోషల్ మీడియా లో, తెలుగు రాయడం అంటే, నిప్పులు మీద నడచినట్టే. రాయమంటే, పాణాలు పోయినంత ఇబ్బందే. ఏదో సామెత ఉంది కదా, తల్లి పాలు తాగి ... , ఇంకోటి ఏరు దాటాక తెప్ప . . .

ఈ వీడియో, కన్నడ కలర్స్ టీవీలో ఓ సంగీత ప్రోగ్రాం. మంజునాథ చిరంజీవి అర్జున్ సినిమాలోని, పాట పాడిన వ్యక్తి, ఒక ముస్లిం సోదరుడు. పేరు ఖాసిం.

అసలు ఆ గొంతు, ఆ మంత్రాల ప్రవాహం, ఆ ఏకాగ్రత, అంతసేపు ఊపిరి పట్టడం, స్వచ్ఛమైన ఉచ్చారణ , . . . వామ్మో, నాకే ఒక నిమిషం లో ఆయాసం వస్తుంది పూర్తిగా అనలేక. వింటుంటే, కళ్లు వెంట ధారలు గా కన్నీళ్ళు, గుండె దడ దడా కొట్టుకుంది, ఆ పాట లో, ఆ మంత్రాలలో, ఆ సంగీతం లో, ఏదో ఏదో అద్బుత శక్తి ఉంది. హర హర మహాదేవ శివ శంభో శంకర మహాదేవ, ఓం నమశ్శివాయా అంటూ ఊగిపోతాము, ఊగుతునారు కూడా అక్కడ ఉన్న ప్రేక్షకులు.

ఆయన, ఈ పాట పాడుతున్న సమయంలో అతని తల్లి దండ్రుల హావభావాలను కూడా, మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ తండ్రి మరియు ప్రేక్షకుల ఈలలు చూడండి. అతని పాటకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన అద్భుతం.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అన్నారు వెనకటి పెద్దలు. శిశువులు, పశువులు, పాములు సైతం సంగీతంతో, తన్మయత్వానికి లోనవుతాయనేది, దీని చూసిన మనకు అర్థం అవుతుంది.

కాదంటారా, మనసు ఉంటే విని చూడండి, ఒక్క క్షణం మనసు పులకరించిందా, మీరు దైవ మార్గం లో ఉన్నట్లు. లేదా పర్లేదు కృషితో, కరోనా లేదా ఇలియానా మనల్ని పట్టుకొనే లోపే, పరమాత్మ ను తెలికగా ప్రయత్నముతో పట్టుకోవచ్చు. ఓం నమశ్శివాయా, ఓ చరణం ప్రయత్నం చేయండి ఇలా,

చిత్రం : శ్రీ మంజునాథ, సంగీతం : హంసలేఖ, సాహిత్యం : శ్రీ వేదవ్యాస, గానం : శంకర్ మహదేవన్

ఓం మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాద్రి నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం

ఓం..ఓం..ఓం...
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్థ నారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతురదధి సంగమం
పంచ భూతాత్మకం షట్ శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం అష్ట సిద్ధీశ్వరమ్
నవరసమనోహారం దశ దిశా సువిమలం
ఏకాదశోజ్వలం ఏకనాధేశ్వరం
ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణిభవతారకం ప్రకృతిహిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం 
నటేశం గౌరీశం గణేశం భూతేశం

మహామాధుర పంచాక్షరీ మంత్ర మార్చ్యం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం నమో హరాయచ సర్వ హరాయచ
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ
ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

ఢం ఢం ఢ, ఢం ఢం ఢ, ఢం ఢం ఢ, ఢం ఢం ఢ

ఢంకా నినాధ నవ తాండవాడంబరం
తధిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమి ధిమ్మి 
సంగీత సాహిత్య సుమకమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార 
మంత్రబీజాక్షరం మంజునాధేశ్వరం
ఋగ్వేదమాజ్యం ఎదుర్వేదవేద్యం
సామప్రతీతం మధర్మప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్యం విశుద్ధం
ప్రపంచైకసూత్రమ్ విరుద్ధం సుసిద్ధం

నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం

మహాకాలకాలం మహానీల కంఠం
మహానందనందం మహాట్టాట్టహాసం
జటాజూట రంగైక గంగా సుచిత్రం
జ్వలత్ఉగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశభాసుం మహాభానులింగం
మహావర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్రసుందరం సౌమనాధేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం
అమరలింగేశ్వరం భామలింగేశ్వరం
కాశివిశ్వేశ్వరం పరంక్రిష్మేశ్వరం
త్ర్యంబాకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ... కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం

అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం..
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర పరపరంజ్యోతిం - 3

ఓం నమః సోమయచ సౌమ్యాయచ
భావ్యాయచ భాగ్యాయచ శాంతాయచ
శౌర్యాయచ యోగాయచ భోగాయచ
కాలాయచ కాంతాయచ రమ్యాయచ
గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయచ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2169 General Articles and views 2,200,448; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914
Dt : 31-Aug-2020, Upd Dt : 31-Aug-2020, Category : Songs
Views : 1156 ( + More Social Media views ), Id : 670 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kannada , colors music program , manjunatha , muslim person , movie , response , audience , amazing
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content