APLatestNews.com top Banner
శనీశ్వరుడి దశ తీవ్రత - దెబ్బ తగిలించి, తక్కువ లో గండం దాటించారు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
నిన్న 24 వ వారం, గుడి లో 108 ప్రదిక్షణలు పూర్తి అయింది కదా. అంత కష్టం పడుతున్నా కూడా, పాత పాపాలు పోవాలి కదా, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. శనీశ్వరుడి దశ తీవ్రత ప్రభావం గండం లు ఉంటాయి. ప్రమాదం కు దారి వెన్నంటి ఉంటుంది, అప్రమత్తం గా లేకపోతే ఏమైనా జరగవచ్చు. కారు , ఇల్లు, ఉద్యోగం, నడక , కుటుంబం , . . . ఎక్కడైనా ఏదైనా. సరే కొంతమంది నమ్మరు, జాగ్రత్తతో తప్పులేదు కదా.

బాత్రూం నీళ్ళ టబ్ లో జారకుండా పట్టవేస్తాం అందరం. గట్టిగా అంటుకుని ఉంటుంది అది సాధారణంగా, కదలదు. టబ్బు బయట నుంచి, నిన్న సబ్బు తీయడానికి, ఒక కాలు పట్ట మీద పెట్టా, రెండవ కాలు బయటే ఉంది, తీయబోతున్నా, అంతే.

జర్రున టబ్ లోని పట్ట జారింది దాంతో పాటు ఆ కాలు కూడా. రెండవ కాలు, టబ్ బయట గట్టిగా కొట్టుకొని నొప్పి తో వాచింది. దేవుడి దయవలన రెండు చేతులు, రెండు గోడలను పట్టుకోవడం వలన, నిలబడగలిగాను ఆపుకోగలిగాను. అదే గోడ అందకుండా ఉండి ఉంటే లేదా పట్టు దొరకకపోతే, పడితే మొఖం పగిలేది, నడుము లు కదిలేయి. ఇంకా పెద్ద నష్టం జరిగేది. మరి నా మీద ఆధారపడ్డ అమ్మ?

తేరుకున్నాక, మరలా కాలు వేసి చూసా జాగ్రత్తగా. ఇప్పుడు జారలేదు, కొంచెం కదిలింది అంతే. మాయ కదూ? ఎందుకు అలా ముందు జరిగింది? అదే నా బదులు అదే టైం కి, అమ్మ వచ్చి ఉంటే? ఇప్పుడు ఎవరు కాపాడారు? దేవుడు కాదా?

అదే 74 ఏళ్ల అమ్మకు కాలు జారితే? అంతే సంగతులు కదా. దేవుడు కాపాడారా లేదా? ఆమె అక్కడ పనులు పొద్దున్న అన్ని చేసింది, కానీ జారలేదు.

అందుకే, మన ఖర్మ ఫలితం తప్పించలేము, కానీ వాయడం , నొప్పి తప్పలేదు. అమ్మను కాపాడి, నాకు దెబ్బ తగిలించి, తక్కువ లో గండం దాటించాడు. జాగ్రత్త ఉండాలి, అనవసరమైన తప్పులు చేయకుండా, అవి తిరిగి మన దగ్గరకు వస్తాయి.
 

Dt : 01-Dec-2019, Upd Dt : 01-Dec-2019 , Category : General
Views : 26 ( + More Social Media views ) ( id : 238 )
Tags : shani maha dasa , bath tub incident

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content