APLatestNews.com top Banner

Social Media links
వీసా బాలాజీ కి 108 ప్రదక్షణాలు, ఓం నమో నారాయణ అనుకుంటూ - భాగం 2 - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మరలా 108 ప్రదక్షిణలు ఈరోజు కూడా ఆదివారం ఉదయం 9 లోపు పరగడుపుతో. మరలా ఎందుకు అంటారా? కరెంట్ బిల్లు లేటుగా కడితే, ఫైన్ ఉంటుంది కదా, అందుకు ఇంకోసారి. ఈరోజు కూడా అంతే సమయం పట్టింది. ఇదేం గొప్ప కాదు, మీరు ఇంకా తేలికగా, తక్కువ టైం లో తిరుగ గలరు.

కొంత మంది గుడి 2 గంటల దూరం ఉంది అంటారు. మనసులో సంకల్పము ఉంటే అది పెద్ద విషయము కాదు - దేహ మే దేవాలయం, గ్రుహ మే దేవాలయం - ఇంట్లో చిన్న బొమ్మ పెట్టుకొని పెద్ద గది లో చుట్టూ తిరగవచ్చు, మన ఇంటి చుట్టూ తిరగవచ్చు కదా అనుకూలంగా ఉంటే. ఇంకేదైనా ఇలాంటి మార్గము ఆలోచన చేయవచ్చు ప్రమాదాలు లేకుండా.

కానీ నిజమైన అనూభూతి ఆ ప్రదక్షిణలు వలన, మీకు కలగాలని ఈ చిన్ని ప్రయత్నం. మనము కోరికలు కోరకూడదు, కైవల్యం తప్ప. కోతి లాంటి మనసు ను, అదుపులోకి తేవాలి, అదే మన లక్ష్యం.

మనసు తలవాలి, గొంతు మాట మంత్రం పలకాలి, దేహం పెద్దాయన చుట్టూ తిరగాలి. మూడిటికి ఒకటే లక్షం, భగవంతుడు.

దేవుడు అనాలి ఇలా, అన్నీ ఇచ్చాను కదా, పోయి హాయిగా విషయవాసనలలో మునిగి తేలక, ఎందుకు రా నా వెంట పడతావు, అని విసుక్కోవాలి. ఆయనను కేంద్రం గా ఆధారం చేసుకుని, ఆయన చుట్టూ గానుగ ఎద్దు మాదిరిగా తిరగాలి. ఇంట్లో అయినా అంతే. మనమూ అనాలి, అయ్యా కొన్ని నేను వదులుకున్నాను, మిగతావి నీవు తొలిగించు, కొత్తవాటిలో నన్ను పడవేయకు అని. నా మనసుని ఎల్లప్పుడు నీవైపు మరలేటట్టు శక్తిని ఇవ్వు అని.

మహా మాయ, మనలను ఆపాలని, వేరు చేయాలని చూస్తుంటుంది, రంగుల అవకాశాలతో ఆకర్షణ ల తో మన మనసు మార్చటానికి. వినొద్దు మాయ మాట, మాయలో పడొద్దు, అన్ని పొందినట్టే ఉంటుంది. చివరకు ఏమీ ఉండదు. మనలను మోసం చేసి, ఆయనకు అందనంత దూరంగా, ఈడ్చుకు వెళుతుంది. తర్వాత ఎవరూ కాపాడలేరు. లొంగామా, మన చేష్టలకు మనమే ప్రతిఫలం బాధపడుతూ అనుభవిస్తాము.

ఎన్ని అవమానాలు , బాధలు , కష్టాలు అయినా ఇప్పుడే అయిపోవాలి. ఆనందంగా అనుభవించాలి కష్టాలు ను. బాకీ వద్దు, మరుజన్మకు. మన మనసు మారకుండా, బాబా ల తో , పూజల తో ఫలం లేదు.

అన్యధా శరణం నాస్తి అని, మన మనసు తో, చేతలలో చూపించు, మాటలు నటనలూ మాని. మెచ్చాలసింది ఆయన, జనం కాదు, మరువకు.

July 27 update -

6 వ వారం వరుస గా చిన్న గుడి 108 ప్రదక్షిణలు, ఇంకా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను, మన అందరినీ ఉత్తేజ పరచడం కోసం.

హయి గా, ఆరోగ్యం గా, మనశ్శాంతి గా ఉంది. ఇది దేవుని కోసం కాదు, మన ఆరోగ్యం కోసం. చాలా పాత పద్ధతి, తాత లు చేశారు.

ట్రెడ్ మిల్ లేదా రోడ్డు నడక కన్నా ఉత్తమం, సేఫ్టీ, ఆరోగ్యం, ఎక్కువ మేలు. సవ్య దిశలో చుట్టు ప్రదక్షిణ ఉదయం 10 లోపు, సాక్స్ లేకుండా. ఆ టైం లోపు, దేవుడు ఖాళీగా ఉంటారు. పుణ్యం పురుషార్ధం అంటే ఇదే మరి.

దయచేసి మీరు కానీ, మీ కుటుంబం లేదా స్నేహితులు లో ఒకరిని గాని, ప్రయత్నం చేయడానికి ప్రోత్సహిస్తారా? కనీసం ఒక్కసారి చేసినా చాలు.

కనీసం ఒక రోజు అయినా, మనం చేసే వేరే వ్యాయామం బదులు ఇది చేద్దామా? ఉత్తమ చిన్న ప్రయత్నం మిత్రమా, డాక్టర్ కు రోగం కు దూరంగా, పొదుపు కు దగ్గర గా.

మన కుటుంబ మంచి కోసం, ఉచిత తేలిక ఆరోగ్య మార్గం, స్వీకరిస్తావా కనీసం చెబుతావా అందరికి మరి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 577 General Articles, 46 Tatvaalu
Dt : 30-Jun-2019, Upd Dt : 27-Jul-2019, Category : Devotional
Views : 448 ( + More Social Media views ), Id : 127 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : visa balaji , Chilkoor Balaji Temple , Himayat Nagar , Hyderabad , 108 pradakshin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content