APLatestNews.com top Banner
         
పశ్చిమ దేశాల ప్రజలకు ఏకైక గురుదేవులు, ప్రభువు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
క్రైస్తవ సోదరులు కు శుభాకాంక్షలు.

పశ్చిమ దేశాల ప్రజలకు ఏకైక గురుదేవులు, ప్రభువు పండగ వచ్చింది మరలా. మనలాగా నే వారిలో, మరలా చాలా రకాల చర్చిలు , వేరు భావనలు ఉన్నాయి, మనకు వద్దు అవి.

ఆయన ను ఆరోజుల్లో ఎన్నో కష్టాలు, హింసకు గురి చేశారు. అన్నిటిని భరించి, ఆయన చెప్పన మాట అంత బాధ లో కూడా , నా తండ్రి రాజ్యములో మీకు ఇంకా చోటున్నది , ఇప్పుడు అయినా మారుడి. అంతే గాక మరలా పునర్జీవుడై వచ్చెను.

బెత్లహమ్ గ్రామ నమూనా ను, అంటే అప్పుడు ఉన్న అంగడి , శిస్తు , నాట్యం, నక్షత్రం, ఏసు జన్మించడం , సైనికులు, అలా . . . తయారు చేశారు మా ఊరికి దగ్గర లో. ప్రభువు కూడా నా గురువే అల్లా తో పాటు. హైందవ సంస్కృతి గొప్పతనం అది. చాలా మంది , హిందూ మతం అంటారు, కాదు హిందూ ధర్మం, అదే మానవ ధర్మం.

మన తండ్రిని గౌరవించడం మనకు తెలిస్తే, చిన తండ్రిని, పెద తండ్రిని, ఇరుగు పొరుగు ను , గౌరవించడం కూడా సహజంగా నే వస్తుంది.

అమ్మ తో కలసి వెళ్ళా , బాల ఏసును చూపిద్దాము అని. మంచి ఎక్కడ ఉన్నా, మనం పొగడాలి. ఆఖరికి షటిల్ బండి డ్రైవర్ కూడా దిగి వచ్చి అమ్మ ను కూర్చో బెట్టారు. 60 ఏళ్ళ పెద్ద ఆవిడ కూడా లెగిచి అమ్మ కు ముందు సీటు ఇచ్చింది, మీ అమ్మ నా కన్నా సీనియర్ అని. పెద్ద వాళ్ళ కు అంత మర్యాద ఇస్తారు అమెరికా వాసులు. అదే మనం, ఇంట్లో కూర్చుని గమ్ముగా ఉండక , ఎందుకు రావాలి అంటాం.


Dt : 25-Dec-2018, Upd Dt : 15-Mar-2019 , Category : Devotional, Views : 46 ( id : 19 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments