పాటతో పరమార్ధం- ఎవ్వరోయ్ పెద్దోళ్లు - పల్లెటూరి మొనగాడు - చిరంజీవి, రాధిక, రాజేష్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,392; 104 తత్వాలు (Tatvaalu) and views 226,601.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Evvaroi Peddhollu - Palletoori Monagadu - Chiranjeevi, Raadhika, Rajesh - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం

మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

పెద్దతనము అనే గౌరవము వయసుతో రాదు, బుద్ది జ్ఞానము మంచి ఆచరణతో వస్తుంది. వామనుడు, ప్రహ్లాదుడు చిన్న వారు, అయినా వారికి నమస్కరిస్తాము. బాల రాముడుకి, క్రిష్ణుడికి పూజ చేస్తున్నాము. నీతి నియమాలు పద్దతులు వారు వీడరు.

కాబట్టి మంచి గుణమును బట్టి పెద్దతనము వస్తుంది కానీ వయసు, పదవి, అధికారం, ఆస్తులను బట్టి రాదు, దైవం అలాగే పంచభూతాల ద్రుష్టిలో. గుణము విలువ మనకు పెద్దలు సజీవ సాక్ష్యాలతో చూపించారు.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

మనందరిలో, ఎవ్వరోయ్ గుణం లో పెద్దోళ్ళు, ఎవ్వరోయ్ మంచి గుణం ఉన్నోళ్ళు, ముందుకు రావచ్చు పెంపక సంస్కార నీతుంటే, తడి ఉన్న గుండెలో దయ ఉంటే, అంటే ఒక్కరూ ముందుకు వస్తారా?

నమస్కారానికి ప్రతి నమస్కారం, పండుగ శుభాకాంక్షలకు ప్రతి శుభాకాంక్షలు చేయడం/ చెప్పడం, వారి తల్లి దండ్రులు నేర్పలేదు. కన్నతల్లి పై ప్రేమతో, తెలుగు రాయలేరు. కనీసం రీడ్ రిసీప్ట్ ఉంచే ధైర్యం లేదు. తమ ముదుసలి అమ్మ నాన్న అత్త మామ సజీవ గురువు సేవ చేయలేరు. పోనీ తమ సంస్కార బిడ్డల దగ్గర, ముదుసలి తనములో, దేవతలుగా గౌరవింపబడరు. ఇంకెక్కడి పెద్దరికం? ఇంకెక్కడి ఉన్నోళ్ళు?

అసలు పాటలో, రండిరా చావుంటే, గుండెలో దమ్ముంటే అని ఉంది. అది మనము అనకూడదు, పాడకూడదు. అది రజో గుణ, పతన లక్షణం. కాబట్టి దానిని మనము, రావచ్చు నీతుంటే గుండెలో దయ ఉంటే, అని సాత్వికముగా మార్చుకున్నాము.

స్రుష్టిలో తీయనిది ప్రేమరా, మనిషికి ఉన్న ఆస్తి మంచిరా, అంటే మీరు కాదంటారా? నేటి కుర్రకారు మారింది, దూసుకెళ్ళి పోతుంది, మత్తు మందులో పతనానికి. కానీ మన మంచి, ఆగని విల్లు ఇదీ, రాముడు బాణమిదీ అన్నట్లు, స్తిరముగా ఉండాలి. ఏనాటికైనా, పైవాళ్ళు రావాలి ఇక కిందకి, నీళ్ళెపుడు పారాలి పల్లానికి. అంతేనా?

మాటంటే జరిపించే తీరుతా, మంచంటే తలవంచి మొక్కుతా, అని ప్రతి ఒక్క మంచి గుణం కలవారు, స్తిర సంకల్పం చేయాలి, రోజూ పనులలో సాక్ష్యం చుపాలి. అప్పుడు దేవుడికి దడవను, న్యాయాన్ని విడువను అని అనవచ్చు. ప్రేమకు రుజువుగా, రేపటి నిజముగా, ముద్దుగా ఈ లోక కల్యాణం/ పెళ్ళి జరిగింది రా. అది చూడలేక, కపట నటన 2 నాల్కల ధోరణి పెద్దరికం, కుళ్ళి కుళ్ళి ఏడ్చిందిరా, అని భావించవచ్చు మిత్రమా.

ఎవ్వరోయ్ పెద్దోళ్ళు, ఎవ్వరోయ్ ఉన్నోళ్ళు
[రండిరా చావుంటే.., గుండెలో దమ్ముంటే.. 2]
రావచ్చు నీతుంటే.., గుండెలో దయ ఉంటే.. 2
నెగ్గెరా మామాట, కట్టెరా మీఆట
ముచ్చటైన ఈ జంట, పచ్చ గుండాలంట
రండి దీవించండో.య్.. ||ఎవ్వరోయ్ పెద్దోళ్ళు||

స్రుష్టిలో తీయనిది ప్రేమరా, మనిషికి ఉన్న ఆస్తి మంచిరా 2
కుర్రకారు మారింది, దూసుకెళ్ళి పోతుంది
ఆగని విల్లు ఇదీ.., రాముడు బాణమిదీ..
పైవాళ్ళు రావాలి ఇక కిందకి, నీళ్ళెపుడు పారాలి పల్లా.నికి ||ఎవ్వరోయ్ పెద్దోళ్ళు||

మాటంటే జరిపించే తీరుతా, మంచంటే తలవంచి మొక్కుతా 2
దేవుడికి దడవను, న్యాయాన్ని విడువను
ప్రేమకు రుజువుగా.., రేపటి నిజముగా..
ముద్దుగా ఈ పెళ్ళి జరిగింది రా..
పెద్దరికం కుళ్ళి కుళ్ళి ఏడ్చిందిరా.
||ఎవ్వరోయ్ పెద్దోళ్ళు||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,392; 104 తత్వాలు (Tatvaalu) and views 226,601
Dt : 09-Apr-2024, Upd Dt : 09-Apr-2024, Category : Songs
Views : 59 ( + More Social Media views ), Id : 2081 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Evvaroi Peddhollu , Evvaroi Peddollu , Palletoori Monagadu , Chiranjeevi , Raadhika , Rajesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content