వివేకం సినిమా చూసారా? బాబాయి గుండె పోటు కధనం బాగా చూపారు, అభిమానులు, తమ నలుపు మరచి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,490; 104 తత్వాలు (Tatvaalu) and views 226,608.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Response* - Have you seen the movie Vivekam? Babai gunDepoaTu story well shown, yellow fans, forget their Guruvinda black.

*స్పందన* - వివేకం సినిమా చూసారా? బాబాయి గుండె పోటు కధనం బాగా చూపారు, పసుపు అభిమానులు, తమ గురువింద నలుపు మరచి.

మరి బులుగు అభిమానుల, లక్ష్మీస్ ఎంటీయార్, వ్యూహం సినిమాలు కూడా, మంచి మనసుతో ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలి. పాము, నక్క, పులి లలో ఏది మంచి దో ప్రజలే నిర్ణయించాలి.

మీ కధనములో నే రాశారు, పాము తోనే కష్టం, ఏ రాత్రి ఏ కంత లో నుంచి వచ్చి, ఏ నిద్రలో కాటువేసినా, ఎవరికీ అర్ధం కాదు అని. అలాగే జిత్తుల మారి నక్కతో కూడా కష్టమే. శకుని లా, తోడు ఉన్నవారి పతనమునే కోరుతుంది.

Snake-Tiger-Cow-example

తడిగుడ్డతో గొంతు కోసే, పాలు పోసిన చేతినే కాటు వేసే, పాము/ నక్క ను నమ్మగలమా? 3 పంటలు పండే పొలాలను, ఎవడైనా డబ్బు ఆశ చూపి, డబ్బులు తిందురు అన్నం బదులు అంటారా? తన దురాశతో ఎంత మంది కన్నీళ్ళు పెట్టించారు? కాబట్టే ప్రజలు నమ్మలేము అని 23 స్తానాలు ఇచ్చారు.

పాము, నక్క, పులి లలో ఏదైనా పతనమే అని ప్రజలకు తెలుసు. కానీ ఉచితాలకు అలవాటు పడ్డారు కాబట్టే, పులి బెస్ట్ అని 150 స్థానాలు ఇచ్చారు. మోదీ కూడా, మీ ఇద్దరే తేల్చుకోండి అని గమ్ముగా చూస్తున్నారు.

ఆవును ఎటూ, మన ప్రజలు ఎన్నుకోరు, కనీసం నీతి గా నోటా కు వేయడం ఇంకా నేర్వలేదు లేదా అమ్ముడుపోతారు కాబట్టి, పులి ఉత్తమం కాదా, నక్క/ పాము కన్నా?

కానీ మామ వెన్నుపోటు, స్తాయి కి లోతు కి అంటే, ఒక సినిమా రాముడు యుగపురుషుడు పతనానికీ, సొంత బిడ్డలనే పావులుగా వాడుకున్న విధానం కు, వారినే పెళ్ళి బంధం తో తన గుప్పెట్లో పెట్టుకున్న కపట నైపుణ్యం కు, ఈ బాబాయి గుండెపోటు కు అసలు పోలికే లేదు కదా?

నక్క కు నాగలోకానికి ఉన్న తేడా. అక్కడే చంద్రన్నే నేరుగా వెన్నుపోటు దారుడు. నేరుగా రామన్నే వీరి చేతిలో బలిపశువు. ఏనుగు కుంభస్తలాన్నే కొట్టారు చంద్రన్న. అంత ఘనుడు ఎక్కడ, అంత కపటం నాటకం ద్రోహం ఎక్కడ, సొంత పిల్లల తండ్రి చేటు ఎక్కడ, వివేకం సినిమాలో?

పాము/ నక్క చేతిలో బాధితులు - మాధవరావు, హరిక్రిష్ణయ్య, జూ ఎంటీయారయ్య, లక్షమ్మ, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో, ఇంకా ఎన్నో తెలియనివి, బయటకు రానివి. కరోనా వైద్యం కు హైదరాబాద్ పోతు జనాలు పడ్డ కష్టాలు, పోయిన ప్రాణాల బాధ్యత ఎవరిది? ఇదేనా అభివ్రుద్ది? జనం మరువరు. చంద్రన్న సినిమా షూటింగ్ లో, పుష్కరాల ప్రాణాలు ఎవరివి? తాత్కాలిక రాజధాని కట్టడాల పాపం ఎవరిది?

తప్పు ఎవరిదైనా తప్పే, శిక్ష పడాలి, బులుగు అయినా పచ్చ అయినా. మామ వెన్నుపోటు, రాష్ట్ర ముఖ్యమంత్రి కి చెందినది, కష్టపడి చెమటోడ్చి పెట్టుకున్న ఒక పార్టీది, అంటే తెలుగు ప్రజలు అందరిది. ఆనాడు గెలిపించారు అని వెన్నుపోటు కరెక్ట్ అవ్వదు, మరి నేడు 23 తో ప్రజలు శిక్షించారు.

ఇంతవరకు, మీరు నచ్చ చెప్పినా 2019 నుంచి, చంద్రన్న బహిరంగ క్షమాపణలు చెప్పలేదు, తన సొంత మామకు, కన్నీళ్ళతో. పిల్లలు కూడా తండ్రికి చెప్పలేదు. తన భాగస్వామిని అన్నారు, తాను పోషించి పెద్ద చేసిన, గత అనుచరుడు, కరుడు గట్టిన ఎంటీయార్ అభిమాని నాని, అని కన్నీళ్ళు పెట్టారు.

బాబాయి గుండెపోటు ఓ అస్సెంబ్లీ/ పార్లమెంట్ స్థానానిది. ఫాక్షనిజం, ఆస్తులు, కుటుంబ, ఎమ్మెల్యే ఎంపీ పదవి, కలహాలు ఇక్కడ. సమర్ధన చెయ్యడం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతున్నది.

ఎమ్మెల్యే వంగవీటి రంగా ను, ఏ విధముగా తెల్లవారు ఝామున, అయ్యప్ప దుస్తులలో వచ్చి, దొంగ చాటుగా అధికార బలముతో, పతనము చేసింది కన్నా ఎక్కువనా? సూపర్ స్టార్ క్రిష్ణా కూడా సినిమా తీసారు - మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం, గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి. వీడియో లోపల చూడండి.

మానసిక రోగి సర్టిఫికేట్ తో, బావను నాటకీయముగా బయటకు తెచ్చి, కోర్టులను ప్రజలను న్యాయాన్ని ధర్మాన్ని పిచ్చివారిని చేసి, ఎన్నికలలో నిలబెట్టడం కన్న ఇది ఎక్కువనా? ఎవరైనా కోర్టుకు వెళ్ళి, పిచ్చి లేదు, ఆ సర్టిఫికేట్ తప్పు, ఎన్నికలలో అర్హత పొంది, గెలిచారు, ప్రజలు పిచ్చి అంటే నమ్మడం లేదు అంటే, బాలయ్య ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మీరంతా బావకు అండగా ఉండి, ఇక్కడ తమ్ముడికి అండగా ఉంటే తప్పునా? మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే?

మీరు మధ్యస్తముగా, ఇద్దరినీ విమర్శిస్తారు, కుటుంబ వారసత్వ బానిసత్వ పాలన, పధకాలకు నిస్సిగ్గుగా కుటుంబ పేర్లు పెట్టుకున్నారు అని. అందుకే మేము ఎప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అనలేదు, అధికారం లో ఉండి, మా మరియు వారి నాయకులను నేరుగా పంపినా, కూడా.

ఎందుకంటే మీ మాటల్లో, సమానత్వం ఉంది. మేము ఎప్పుడు పచ్చ మీడియా తోనే పొటీ పడతాము. చిన్న మీడియాల జోలికి వెళ్ళము. మీ మంచి మాటలు జనాలకు ఎక్కవు అని మాకు తెలుసు, కాబట్టి ఇబ్బంది లేదు. లేకపోతే, వారు ఆవునే లేదా నోటానే ఎన్నుకుంటారు గత 15 ఏళ్ళుగా.

*జవాబు* - సినిమా చూసాము, బాగానే తీసారు. ముందు గా మీ బాధనంతా మంచి పదాలలో తెలియ చేసారు. మన విమర్శలు ఎప్పుడూ గౌరవముగా మర్యాదతో నిజాలు ఉండాలి.

చిన్నమ్మ, చంద్రన్న, జగనన్న, పవనన్న, మన 4 పిల్లలు. అందరూ మనకు ఒకటే, పక్షపాతం లేదు. వారి క్షేమం కోసమే మనము మంచి చెబుతున్నాము. కేవలం వారి గుణం మారాలి, వారు ఆరోగ్యం గా, క్షేమం గా కలకాలం ఉండాలి. వ్యక్తిగత విమర్శలు వద్దు, కేవలం గుణ పరమైన సద్విమర్శలు మాత్రమే.

ఎందుకంటే వారు భవిష్యత్ లో పతనము చెందకూడదు. నాయకులది ఎప్పుడు తప్పు కాదు, ఓటర్లదే మొదటి తప్పు అని మనం ఎన్నో సార్లు చెప్పాము.

పంచభూతాలు వదలవు. రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

కధనాలు నేరుగా మీ మరియు వారి పాలిట్ బ్యూరో సభ్యులకే గతములో పంపింది మీకు తెలుసు.

జగనన్న కూడా, ఎన్నో మాటలు మడమలు తిప్పారు, అవీ మార్చుకోవాలి, లేకపోతే మీకు చంద్రన్న పరిస్తితి తప్పదు. జగనన్న కూడా, తన పై ఉన్న ఆరోపణలు తొందరగా తెల్చుకోవాలి. సునీతమ్మ కు న్యాయం చెయాలి.

చంద్రన్న చాల కష్టపడుతున్నారు అంత ఎండలో కూడా, లోకన్న కు ఒక మార్గం చెయ్యాలి అని. మరి భగవంతుని ఆశీసులు ఎటో చూద్దాము. మరి ప్రజల ఆశీస్సులు కూడా, నక్క పులి పాము ల లో, ఎవరికో త్వరలో తెలుస్తుంది.

పవన్ ఏమి చేస్తున్నారో తనకే తెలియడం లేదు. మోదీ ప్రేక్షక పాత్ర, ఎందుకంటే, తెలుగు వారి ని గౌరవించి, వారి ఎన్నిక సంస్కారం వారికే వదిలేశారు. ఎందుకంటే గెలిచేది చంద్రన్న అయినా జగనన్న అయినా, వారి పాదాల దగ్గర కేసుల దాసులే. రామన్న చెప్పిన తెలుగు వారి ఆత్మాభిమానం, చంద్రన్నతో ఎప్పుడో మంట గలసి పోయింది.

పచ్చ మరియు బులుగు మీడియా లాగా అభూత కల్పనలు ఉండకూడదు. అంతా మీరే చెప్పారు. మేము చెప్పేది ఏమీలేదు. తమ నాయకుల పతనానికి, అవే కారకాలు అవుతున్నాయి.

మామకు అలాగే బాబాయికీ అన్యాయం జరిగింది. బాబాయి కొన్ని గంటలు నరకయాతన పడితే, మామ కొన్ని రోజులు/ నెలలు గుండె కోత అనుభవించారు, సొంత పిల్లలు అల్లుడు చేసిన ద్రోహానికి/ అవమానానికి.

సునీతమ్మ పోరాటం ఫలించాలి. కిరాతకానికి శిక్ష పడాలి, పడుతుంది పంచభూతాలతో అయినా. చిత్రం ఏమిటి అంటే, బాబాయి కి అన్యాయం జరిగింది, అని కూతురు ఒంటరి పోరాటం చేస్తున్నది, న్యాయం కోసం. షర్మిలమ్మ కూడా కలిసింది, కాకపోతే కాంగ్రెస్స్ అభ్యర్ధిగా.

కానీ మామకు అన్యాయం జరిగింది అని, వారి పిల్లలు ఒక్కరు కూడా, ఈ రోజుకు కూడా, తమను తాము తెలుసుకుని, కన్నీరు పెట్టడం లేదు, పశ్చాత్తాపం చెందడం లేదు, తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పడం లేదు. ఇది పెద్ద విచిత్రం. అందుకే మనం ప్రతి శని వారం గుర్తు చేసేది, మనల్ని మనం తెలుసుకుందాం. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదులుదాం అని.

రేపు ఇవే వెన్నుపోటు, గుండెపోటు మన ఇంట్లో లేకుండా, నీతి నియమాలతో ఉందాము, సాధన చేద్దము. ముదుసలి తల్లి దండ్రి అత్త మామ ల సేవ చేద్దాము. మన ముదుసలి తనములో, మన పిల్లల దగ్గర దేవతలుగా పూజింపబడదాము. బంధం పార్టీ నాయకుల కన్నా, ధర్మం న్యాయం గొప్పది, మరువద్దు.

ఇకేదైనా మరిస్తే, లింక్ కు కలుపుతాము, వారం లోపు లేదా తర్వాత చూడగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,490; 104 తత్వాలు (Tatvaalu) and views 226,608
Dt : 05-Apr-2024, Upd Dt : 05-Apr-2024, Category : General
Views : 97 ( + More Social Media views ), Id : 2077 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : movie , Vivekam , Babai , gunDepoaTu , story , shown , yellow , fans , forget , Guruvinda , black
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content