పాటతో పరమార్ధం- మానవత్వం పరిమళించే - నేటి భారతం - విజయశాంతి, సుమన్, శివకృష్ణ, శ్రీశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,921,017; 104 తత్వాలు (Tatvaalu) and views 229,545.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Manavatvam Parimalinche - Neti Bharatam - Vijayashanti, Suman, SivaKrishna, SriSri - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

మానవత్వం పరిమళించే మంచి మనసు, మనలో ఎవరికి ఉంది అంటే, అందరూ మాకు, మా తల్లి దండ్రులకు అత్త మామలకు, పిల్లలకు ఉంది అని ముక్త కంఠముతో, ఆత్మ ద్రోహం చేసుకుంటూ, కపట నటన అబద్దాల జవాబు చెపుతారు.

మరి మీలో ఎంత మంది, 1) జీవ హింస లేని శాఖాహారం తింటూ, 2) ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల సజీవ గురువు సేవ చేస్తూ, 3) ఆత్మను అమ్ముకోకుండా, ధన ఆస్తి వీసా పదవి అధికారంకు పొందని, గుణ భాగస్వామి ని పొంది 4) కన్న సంస్కార బిడ్డల దగ్గర ముదుసలి తనములో, దేవతలు గా పూజింపబడతారా 5) అరిషడ్వర్గ అష్టవ్యసనం లేని, దైవ గుణాలను ఆచరణలో చూపగలరా అంటే, ఒక్కరూ నోరు ఎత్తరు.

పోనీ నిస్వార్ధముగా, లింగ/వర్గ/కుల/మత/ధన/పార్టీ/అవసర/అవకాశ బేధము పక్షపాతము లేకుండా, ఇతరుల కష్టాలు కన్నీళ్ళు విని ఊరట కలిగిస్తారా, కేవలం మాటలతో అయినా అంటే, దానికీ జవాబు ఉండదు.

4 చేతులా సంపాదనలో, సొంత పిల్లలనే డేకేర్ లేదా హాస్టల్ లో వదిలే మాకు, తీరిక ఎక్కడండి, స్వయం పతనం లో అంటారు.

కాబట్టి, రజో తమో గుణ అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులకు, మానవత్వం దాదాపుగా ఉండదు. ఈ పాట, సాత్విక గుణములు కలవారికి వర్తిస్తుంది, పైన చెప్పిన సాత్విక లక్షణాలు ఆచరణలో కనపడితే.

మన చుట్టూ, మానవత్వం పరిమళించే, మంచి మనసు గలవారికి, స్వాగతం. వారు మనకు బ్రతుకు అర్ధం తెలియచేస్తారు తాము ఆచరిస్తూ, సజీవ గురువు సేవ చేస్తూ, దైవ లక్షణాలను మాట పాట రాత కరుణ దయ సేవ లలో చూపిస్తూ, అలాంటి మంచి మనిషికి, స్వాగతం, తలవంచి నమస్కారములు.

మంచి తనమే, దైవ గుణము, అంటే, దైవ గుణాలను ఆచరణలో చూపే వారికి మనము తల వంచాలి, వారు దైవ ప్రతిరూపమే కాబట్టి. లేదంటే, మన ఇంట్లో భాగస్వాములు, పిల్లలు కూడా, ఎవరికీ తలవంచరు, అహంకారముతో పతనము అవుతారు.

దైవ గుణాలను ఆచరణలో చూపే వారి తో ప్రతి వారం, పక్షం, మంచి చెడు మాట్లాడాలి. అలా ఏళ్ళు మాట్లాడుతూ ఉంటే, మనలోని రజో తమో కపట నటన 2 నాల్కల గుణాలు నశించి, సాత్వికత పెరుగుతుంది.

మన చుట్టూ కష్టాలు కన్నీళ్ళు లో మునిగి, కారుమబ్బులు ఆవరించిన, కటిక చీకటి జీవితంలో, వారి బాధలను విని, జీవితం పై ఆశలు చిగురింప చేసి, వెలుగులను ప్రసరింపచేసిన, ఆ కాంతిమూర్తులకు స్వాగతం.

అంతు తెలియని వేదనలతో, అలమటించే ఆర్తజనులకు, తమ జీవితములో కొంత సమయం కేటాఇంచి, ఓపికగా సహనం తో వింటూ, ఓదారుస్తూ, మానవ సేవే మాధవ సేవగా చుపుతూ, కొత్త ఊపిరి అందజేసిన, స్నేహశీలి స్వాగతం.

అందరూ ఉండి ఒంటరి అయినా సంపాదన ఆరోగ్యం పోయినా, బంధువులు స్నేహితులు, పుట్టింటివారు మెట్టినింటి వారు కూడా, వీరు పనికిరారని పారవేసిన, నిరాశతో మోడువారిన జీవితాలకు, మంచి మాటలు చెప్పి దైవ బాట చూపి, మీకు మేము ఉన్నాము సాత్విక గుణాలను నేర్చుకుని ఆచరణలో చూపండి అంటూ, చిగురుటాశల దారి చూపిన, మార్గదర్శి స్వాగతం.

ఈ చిత్రం కన్నడలో ఇండినా భారత, హిందీలో హకీకత్ (1985) మరియు తమిళంలో పుతియా తీర్ప్పు (1985)గా పునర్నిర్మించబడింది. ఈ చిత్రం ఆరు నంది అవార్డులను గెలుచుకుంది.

మానవత్వం పరిమళించే, మంచి మనసుకు స్వాగతం (స్వాగతం స్వాగతం)
బ్రతుకు అర్ధం తెలియచేసిన, మంచి మనిషికి, స్వాగతం (స్వాగతం స్వాగతం)
||మానవత్వం ||

1) కా.రుమబ్బులు ఆవరించిన, కటిక చీకటి జీవితంలో..
వెలుగులను ప్రసరింపచేసిన, కాంతిమూర్తి స్వాగతం. ||మానవత్వం ||

2) అంతు తెలియని వేతనలతో, అలమటించే ఆర్తజనులకు
కొత్త ఊ.పిరి అందజేసిన, స్నేహశీ.లి స్వాగతం ||మానవత్వం ||

3) పనికిరారని పారవేసిన, మోడువారిన జీవితాలకు.
చిగురుటా.శల దారి చూపిన, మార్గదర్శి స్వాగతం

మానవత్వం పరిమళించే, మంచి మనసుకు స్వాగతం (స్వాగతం స్వాగతం)
బ్రతుకు అర్ధం తెలియచేసిన, మంచి మనిషికి, స్వాగతం (స్వాగతం స్వాగతం)
||మానవత్వం ||

Sri Sri, Movie - Neti Bharatham, Music Director - Chakravarti, Singer - Janaki

Manavatvam Parimalinche Manchi Manasuku Swagatam; Bratuku Artham Teliyajesina Manchi Manishiki Swagatam (Lyrics: Adrushta Deepak; Music: K. Chakravarthi) 1983

Directed by T. Krishna; Written by T. Krishna (script), M. V. S. Haranatha Rao (Dialogues); Produced by P. Venkateswara Rao

The film was remade in Kannada as Indina Bharatha, Hindi as Haqeeqat (1985) and in Tamil as Puthiya Theerppu (1985). The film won six Nandi Awards.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,921,017; 104 తత్వాలు (Tatvaalu) and views 229,545
Dt : 01-Apr-2024, Upd Dt : 01-Apr-2024, Category : Songs
Views : 102 ( + More Social Media views ), Id : 2074 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Manavatvam Parimalinche , Neti Bharatam , Vijayashanti , Suman , SivaKrishna , SriSri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content