పాటతో పరమార్ధం- నీకు నీవారు లేరు (భక్తి పేరడీ) - బాలరాజు - ANR, అంజలి, వరలక్ష్మి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,942,362; 104 తత్వాలు (Tatvaalu) and views 230,698.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Neeku Nevaru Leru (Bhakti Parody) - Balaraju - ANR, Anjali, Varalakshmi - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం

బాలరాజు 1948లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా రికార్డ్ చేయబడింది మరియు ఇది మొదటి తెలుగు సిల్వర్ జూబ్లీ చిత్రం. ఘంటసాల బలరామయ్య 1944 పౌరాణిక చిత్రం శ్రీ సీతారామ జననంలో అక్కినేని నాగేశ్వరరావు తన మొదటి ప్రధాన పాత్రను అందించినందుకు ప్రసిద్ధి చెందారు.

ప్రాపంచిక అవసర అవకాశ మోహ బంధాల లో మునిగి తేలే, ఒంటరి వాళ్ళు, లేదా పెళ్ళై/ సహజీవనం చేసి, గొడవలు పడి దూరంగా ఉన్నవారు, ఇలా పాడుకుంటూ ఉంటారేమో - మీకు మీవారు లేరు, మాకూ మా వారు లేరు, గాలిలో.న, తేలిపోదామ్, మీకు మాకు, జోడు కలసెను, గదలే.

నటులు, నాయకులు, మోహులు అవే పాటలు సుమీ.

మరి మంచి వారు, మానసిక బలవంతులు, దైవ గుణ సంపన్నులు కూడా, అలాగే పాడతారేమో, ఆధ్యాత్మికముగా. ఎందుకంటే చుట్టూ, అందరూ అరిషడ్వర్గ అష్టవ్యసన మోహాలలో పరుగులు తీస్తూ పతనము అవుతుంటే, వారికి నచ్చ చెప్పలేక, వారి పతనాన్ని ఆపలేక, సతమతమౌతూ ఉంటే, తమకు తమ లాంటి గుణవంతులు సాధకులు దైవ వర అద్రుష్టవశాత్తు దొరికితే, ఇద్దరు భక్తి భావముతో ఇలా పాడుకుంటారు.

మీకు గుణవారు లేరు, మాకూ గుణవారు లేరు, ధ్యానం లోన, తేలిపోదామ్ పదరే, దైవ చింతన, నిత్యం చేద్దాం పదరే, ఓ సాధకులారా, మీకు మాకూ, గుణం కలసెను, జీవా.

జీవితములో, ఏదో ఒక సమయములో, అందరినీ పోగొట్టుకున్నాక బ్రమలు అన్నీ పోయినాక అయినా, తమ తప్పులు తెలుసుకుని, చెంపలు వేసుకుని, కనీసం దేవుని జత గా చేసుకుని అయినా, ఈ పాట పాడతారు సుమీ.

చూడండి సినిమా రామన్నను చూడటానికి, జనాలు మద్రాసు తండోపతండాలుగా వెళ్ళారు. కానీ కర్మ కాలాక, రామన్న నే హోటల్ దగ్గరకు వెళ్ళి, రోడ్ మీద బండి పై నిలబడి, తమ్ముళ్ళు రాండి, మాకు అండగా ఉండండి, మీకు నేను నాకు మీరు అన్నారు. కానీ ఎవరూ రాలేదు, పాపం. కనీసం సొంత బిడ్డలు కూడా, ఈ రోజుకి అది తప్పు అనుకోవడం లేదు.

నాడు చంద్రన్న, మోదీ/ పవన్ ను దుమ్మెత్తి పోసారు, మీకు ఏముంది, కుటుంబమా, పిల్లలా, అందరి అకౌంట్ల లో ఊరక వచ్చిన ధనమా, పధకాలకు కుటుంబ పేర్లా అని. సీబీఐ ని రానివ్వను అని. ఇప్పుడు నాకు నా వారు లేరు, మీరే నా వారు అంటున్నారు. మా బుద్దవతారానికి ఓ దోవ చూపండి అంటున్నారు.

మొన్నటి దాకా, జగనన్న పరదాలు కట్టుకుని రోడ్డు కు అటూ ఇటూ, చాటుగా దూరముగా తిరిగారు. ఇప్పుడు నడి ఎండలో, అమ్మా అయ్యా అంటూ, బుగ్గలు చేతులు పట్టుకుంటున్నారు, మీరే మా వాళ్ళు మీరు లేక మేము లేము, ఒంటరిని బీదను అండలేని వాడిని, మీరే నాకు అండ అంటున్నారు.

మొన్నటి దాకా కేసీయార్ ఫాం హౌస్ లో మత్తు నిద్ర, పనుంటే ఇక్కడకు రాండి, తొక్క లో సచివాలయం కి వద్దు. ఇప్పుడు, మాకు మీరే కావాలి అంటూ, జనం చుట్టూ పొలాల చుట్టూ డాం ల చుట్టూ, ఎన్నికలు అయ్యిందాకా, ప్రదక్షిణలు. ఆ తర్వాత, మరలా ఫాం హౌస్ లో మత్తు నిద్ర.

Parody

మీకు గుణవారు లేరు, మాకూ గుణవారు లేరు 2
ధ్యానంలో.న, తేలిపోదామ్ పదరే, ఓ. సాధకులారా 2
మీకు మాకూ, గుణం కలసెను, జీవా ||మీకు గుణవారు లేరు||

మీకు గుణవారు లేరు, మాకూ గుణవారు లేరు 2
దైవ చింతన, నిత్యం చేద్దాం పదరే, ఓ. సాధకులారా 2
మీకు మాకూ, గుణం కలసెను, జీవా ||మీకు గుణవారు లేరు||

మంచి పూల తోట లో.న, మల్లె పూలు కోసి నాక
దైవం పూజ చేసి వస్తిమి, కదరే ఓ. సాధకులారా
మీకు మాకూ, గుణం కలసెను, జీవా ||మీకు గుణవారు లేరు||

మల్లెపూలా తెప్పగట్టీ, దేవ దేవుని జోడి చేసి 2
తెప్పమీద తేలిపోదము పదరే, ఓ. సాధకులారా 2

అదిరా మనసు నిండా, మధురా పున్నమి రేయి
దైవసేవకు రమ్మంటిమి కదరా, ఓ. సాధకులారా
మీకు మాకూ, గుణం కలసెను, జీవా

Original

నీకు నీవారు లేరు, నాకూ నా వారు లేరు 2
గాలిలో.న, తేలిపోదామ్ పదరా, నా. పా.లిరాజా 2
నీకు నాకు, జోడు కలసెను, గదరా ||నీకు నీవారులేరు||

నీకు నీవారు లేరు, నాకూ నా వారు లేరు 2
ఏటి ఒ.డ్డున, ఇల్లు కడదాము పదరా, నా పాలిరాజా 2
నీకు నాకు, జోడు కలసెను, గదరా ||నీకు నీవారులేరు||

మల్లె తోట లో.న, మంచి నీళ్ళ బావి కాడ
ఉంగరాలు మరచి వస్తిని, కదరా నా పాలిరాజా
నీకు నాకు, జోడు కలసెను, గదరా ||నీకు నీవారులేరు||

మల్లెపూలా తెప్పగట్టీ, నీకు నాకు జోడు అయితే 2
తెప్పమీద తేలిపోదము పదరా, నా పాలిరాజా 2

అదిరా నీగుండె లదరా, మధురా వెన్నెల రేయి
నిదరాకు రమ్మంటిని కదరా, నా పాలిరాజా
నీకు నాకు జోడుకలసెను గదరా

Balaraju is a 1948 Telugu film. The film was recorded as an Industry Hit at the box office and was the first Telugu Silver Jubilee film. Ghantasala Balaramayya is known for providing Akkineni Nageswara Rao his first lead role in the 1944 mythological film Sri Seetarama Jananam.

Singer: S. Varalakshmi. గాయని: S. వరలక్ష్మి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,942,362; 104 తత్వాలు (Tatvaalu) and views 230,698
Dt : 10-Apr-2024, Upd Dt : 10-Apr-2024, Category : Songs
Views : 112 ( + More Social Media views ), Id : 2082 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : neeku neevaaru learu , Neeku Nevaru Leru , Balaraju , ANR , Anjali , Varalakshmi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content