పాటతో పరమార్ధం -త్రిభువన జననీ(వీర శివాజీ) -చంద్రహాస్ -హరనాథ్ పొలిచెర్ల, అస్త సింగల్, కృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2267 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2302 General Articles and views 3,119,537; 104 తత్వాలు (Tatvaalu) and views 339,958.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Song Spirit - Tribhuvana Janani(Veera Shivaji) - Chandrahas - Haranath Policherla, Astha Singal, Krishna*

There is no one who does not know about the brave Shivaji who fought for the freedom of the motherland. We can see how his mother shaped him in this song. We can teach our children about self-respect.

దేశమాత స్వేచ్చకై పోరాడిన వీర శివాజీ గురించి తెలియని వారు ఉండరు. వారి తల్లి అతనిని ఎలా తీర్చిదిద్దిందో ఈ పాటలో చూడవచ్చు. మన పిల్లలకు ఆత్మాభిమానం గురించి నేర్పవచ్చు.

My mother told me that this motherland is better than me, and that if we sacrifice our lives for such a motherland, that birth will be blessed. My mother, in the cradle, taught me with her warm milk to fight for this motherland, which is being trampled under the yoke of tyranny, says Veera Shivaji.

జన్మ ఇచ్చిన తల్లి తనకన్నా, ఈ జన్మభూమియే మిన్న అని, అటువంటి జన్మభూమికై మన ప్రాణములిస్తే, ఆ జన్మధన్యం అవుతుందని అమ్మ చెప్పింది. పరపాలనలో మగ్గుతున్న, ఈ నేల తల్లి కొరకు పోరాడమని, ఉగ్గుపాలతో ఊయలలోనే, ఉపదేశించెను మా అమ్మ అంటున్నారు వీర శివాజీ.

O Mother Bhavani, I am fighting for the independence of my homeland. If you bless me with your blessings, I will achieve eternal liberation from slavery in the motherland. If that is not possible, I will fight until my last breath and die," the hero said.

తల్లి భవానీ, జన్మభూమి స్వాతంత్ర సిద్దికై, సమరం సాగిస్తున్నాను, మీ ఆశ్శీసులు అనుగ్రహిస్తే, దేశమాత చిరదాస్య ముక్తి సాధిస్తా. ఒకవేళ అది కుదరకపోతే, అంతిమ శ్వాస వరకు పోరాడి నేను మరణిస్తా అని తెగేసి చెప్పిన వీరుడు.

Five-hundred years ago, a Mysore queen gifted Chatrapati Sivaji (Krishna) a sword called Chandrahas. At present day, Sivaji (Harinath Policherla), a fifteen generation descendant of Sivaji and an archeologist, finds the sword but gets himself in trouble with his Muslim family friends and terrorists.

ఐదు వందల సంవత్సరాల క్రితం, మైసూర్ రాణి ఛత్రపతి శివాజీ (కృష్ణ) కి చంద్రహాస్ అనే కత్తిని బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం, శివాజీ పదిహేను తరాల వారసుడు మరియు పురావస్తు శాస్త్రవేత్త అయిన శివాజీ (హరినాథ్ పోలిచెర్ల) ఆ కత్తిని కనుగొంటాడు. కానీ తన ముస్లిం కుటుంబ స్నేహితులు మరియు ఉగ్రవాదులతో ఇబ్బందుల్లో పడతాడు.

త్రిభువన జననీ.. త్రిభువనా. వనీ.. 2 తులజా.పురి భవా.నీ..
ఆపద్భాంధవి, అభయదాయని, మాపై మీ దయరానీ.. ||త్రిభువన జననీ||

జన్మనొసంగిన తనకన్నా, ఈ జన్మభూమియే మిన్న అని
జన్మభూమికై ప్రాణములిస్తే, జన్మధన్యం అవుతుందని
పరపాలనలో మగ్గుతున్న, ఈ తల్లి కొరకు పోరాడమని
ఉగ్గుపాలతో ఊయలలోనే, ( ఉపదేశించెను మా జననీ) 2

అక్షరాల ఆ మాత్రుగీతలో లక్ష్యమేర్పరచుకున్నా.
జన్మభూమి స్వాతంత్ర సిద్దికై, సమరం సాగిస్తున్నా.
నువ్వు అనుగ్రహిస్తే.. 2 దేశమాత చిరదాస్య ముక్తి సాధిస్తా.
లేదా అంతిమ శ్వాస వరకు, పోరాడి నేను మరణిస్తా ||త్రిభువన జననీ||

Chandrahas is a 2007 Indian Telugu-language social drama film directed by Siva Shakthi Datta. చంద్రహాస్ శివ శక్తి దత్తా దర్శకత్వం వహించిన 2007 భారతీయ తెలుగు భాషా సాంఘిక నాటక చిత్రం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,119,537; 104 తత్వాలు (Tatvaalu) and views 339,958
Dt : 10-Jul-2025, Upd Dt : 10-Jul-2025, Category : Songs
Views : 1189 ( + More Social Media views ), Id : 2264 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Tribhuvana Janani , Chandrahas , Haranath Policherla , Astha Singal , Krishna , Chhatrapati , Shivaji , Sivaji
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content