APLatestNews.com top Banner
         
ప్రజల కనీస అవసరాలు, నాయకుల డప్పుల అప్పుల వరాలు, ప్రయోజనం ఉందా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఇది పార్టీల గురించి నాయకుల గురించి వాదన కాదు, మన ఊరు అభివ్రుద్ది గురించి ఆవేదన. ఏ నాయకులు వచ్చినా మన బతుకులు మారవు, ఎందుకంటే మన బానిసత్వం మార్చుకోము కాబట్టి.

మనలో ఒక్కరు అయినా ఇవి అడిగారా మన నాయకుల ను

1. బియ్యం, కూరలు, పప్పులు దినుసులు లేదా అన్ని వస్తువుల రేట్లు నేల మీదకి ఎప్పుడు వస్తాయి. హోటల్ ఇడ్లీ, అట్టు , భోజనం, గది రేట్లు అందుబాటులో ఉంటాయా?

2. కరెంట్, బస్సు, రైలు, ఇంటి, కేబుల్, టీవీ, ఫోన్, వస్త్రాలు ,పెట్రోల్, బండి ఖర్చులు పన్నులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి?

3. ఉచిత నాణ్యమైన ప్రభుత్వ విద్య ఎల్ కేజీ టు పీజీ , వైద్యం కోరుకొండ స్కూల్ లాగా, గీతం కాలేజ్ లాగ, నిమ్స్ లాగా ప్రతి మండల కేంద్రంలో ఎందుకు లేవు?

ఎంత మంది మన సొంతవాళ్ళు స్నేహితులు బంధువులు చనిపొయారో గుర్తుందా, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే దోవలోనే, గుంటూరో, హైదరాబాద్, చెన్నై చేరే లోపు.

4. సినిమా హాలు అంత లైబ్రరీ , ఏసీ తో , కంప్యూటర్ ల తో‌, ఉచిత విజ్ఞాన పోటీ పరీక్షల పుస్తకాలతో, వార్తా పేపర్ల తో వార పత్రికలతో, ఎందుకు లేవు మండల కేంద్రంలో, ఒక మోస్తరు పట్టణాలలో లేదా ప్రతి 15 కిలోమీటర్లకు.

5. నిరంతరం అంటే 24 గంటలూ మంచి నీరు, తక్కువ ధర కరెంట్, 5 ఎకరాల పబ్లిక్ పార్క్ పిల్లల ప్లేగ్రౌండ్ తో , పబ్లిక్ మరుగుదొడ్లు, ప్రతి గ్రామంలో లేదా పట్టణం లో ఎందుకు లేవు?

అసలు నీళ్ళు దొరకని, ఫ్లోరైడ్ నీళ్ళతో బాధపడే, రోజూ అరగంట మాత్రమే మంచి నీరు వచ్చే, ఊళ్ళు మీకు తెలుసా?

6. ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు జవాబు తనం ఎందుకు లేదు ప్రతి ఊరు లో మరియు గ్రామంలో. మామూలు వ్యక్తి ని ఎప్పుడు లెక్క చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగుల, నాయకుల జీత వివరాలు పబ్లిక్ గ్రామ, పట్టణ కార్యాలయాలు మరియు ఇంటర్నెట్ లో ఎందుకు లేవు?

మహిళా బిల్లు ఎప్పుడు? లోక్పాల్ ప్రతి రాష్ట్రానికి, వీలైతే జిల్లాకి ఎప్పుడు? లంచం, అవినీతి, రౌడీ ఇజం లేని రాజ్యం ఎప్పుడు?

7. నాయకులు గెలవడానికి ఇచ్చే వరాలకు చేసే అప్పులు ఎలా తీరుస్తారు ? ప్రభుత్వ ఆస్తులు, గ్రామం, పట్టణం , జిల్లా, రాష్ట్రం, దేశం అమ్మా? ఆదాయం చూపకుండా ఎలా ఇస్తారు?

మా ఉద్యొగాలకు అర్హత కావాల్సినపుడు, మీ పదవులకు ఎందుకు కనీసం ఇంటర్, డిగ్రీ, పీజీ ఉండదు పదవి స్థాయిని బట్టి? పోటీ అభ్యర్దులు అందరు ఎదురు ఎదురు కూర్చోని, పబ్లిక్ గ టీవీ లలో లేదా పెద్ద నగరాలలో జనం ముందు, ఎందుకు డిబేట్ చెయ్యరు? ప్రతి పార్టీలో సొంత అభ్యర్దిని, జనం చూసే విధంగా ఎందుకు ఎన్నుకోరు? పార్టీ మారితే వెంటనే ఎందుకు స్పీకర్ రాజీనామా అడగరు అంగీకరించరు? ప్రజల కోసం మీ వేతనాలు, అలవెన్సులు, పించను, సౌకర్యాలు ఎందుకు వదులు కోరు మీ ఆదాయాన్ని బట్టి.

. . . ఇంకా కనీస అవసరాలు ఎన్నో

ఇవన్నీ చాలా వరకు కనీస అవసరాలు. ఇవన్ని, ఇందిరమ్మ, రాజీవన్న, రామన్న, రాజన్న , చంద్రన్న లే చేయలేనప్పుడు వారసులు చేస్తారా? కొత్త వారితో చేపించ గలమా మనము?

ఇవన్నీ లేకుండా, మాయా ముష్టి పధకాలు, ఐదేలు పదేలు చిల్లర డబ్బులు తో, మన బిడ్డలు మనవళ్లు బాగుపడతారా?

సంపద డబ్బు శక్తి లేదు అంటారా, మరి కాంట్రాక్టర్లు బినామీలు నాయకుల ఆస్తులు ఎలా పెరుగుతున్నవి ప్రతి రోజూ వారం నెలా? ఎలెక్షన్ అప్పుడు కోట్లు ఎలా పట్టుబడుతున్నాయి? సిబియై, ఈడీ దాడులు, ఎందుకు జరుగుతున్నాయి అవినీతి పరుల మీద? రాజకీయ నాయకులు ఎలా పెట్టుబడులతో పరిశ్రమలు పెడుతున్నారు వేరే రాష్ట్రాలలో లేదా దేశాలలో?

అంటే కావలసినంత సంపద డబ్బు ఉంది, కానీ ప్రజలకు మంచి సౌకర్యాలు వద్దు. ప్రతి నెలా దేహీ అని, చేతులు చాపి, తలవంచి, దేబిరించాలి.

ఓటరు అన్నా నీ కుటుంబం , ప్రాంతం , గ్రామం , ఊరు అభివృద్ధి నీ చేతిలో ఉంది. నీ ఇష్టం, తెలివిగా వాడతావో బానిస లా తాకట్టు పెడతావో , ఫలితం మనకే.

పై వాటిని బాండ్ పేపర్లో రాయించి రిజిస్టర్ చేయించి, వాళ్ళ ఆస్తుల సెక్యురిటి డిపాజిట్ తో , ముందుచూపు జాగ్రత్త తో బాగు పడు పడదామా? లేదు కనీసం అడుగుదామా, నిలదీద్దామా? లేక ఎప్పటిలా ఎన్నటికి పరిష్కారం కాని పనులు సమస్యలు రాబోయే వారసులకు మనవళ్ళకు వదిలేద్దామా?

కింది వాటిలో ఎదో ఒకటి జవాబు చెప్పుకుందామా?

1. మండల పౌరులు గా ఛాలెంజ్ చేస్తునాము, ఆ 6 పాయింట్లు, మా మండలం లో ఎప్పుడో ఉన్నాయి. ఇందిరమ్మ, రాజీవన్న, మోదీ, రామన్న, రాజన్న, చంద్రన్న చేసేసారు ఎప్పుడో. కావాలంటే ఫోటోలు, వీడియో లు పంపుతా , లేదా నెట్ లో చూడు. అనో

2. మా నిజాయితీ నాయకులు చెప్పారు, పధకాల వరాల అప్పు భారం గురించి బాధ పడద్దు. మా ఎడుపలపాయ, లోటస్ కాండ్, హెరిటేగ్ , విదేశీ సింగపూర్ అమెరికా లో ఆస్తులు, స్విస్ బాంకు ఖాతాలను అమ్మి మా సొంత డబ్బు తో మేము తీరుస్తాము. మీ బిడ్డలు, మనుమల మీద భారం పడనీయం. మడమతిప్పక. ప్రభుత్వ భూములు అమ్మటము లేదా ప్రపంచ బాంక్ లో తాకట్టు పెట్టము . అనో

3. పైన చెప్పనవి అబద్ధాలు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, బినామీలు, చెంచాలు, అధికారులు , అందరూ సొంత ఆస్తులు కూడా అమ్ముకొని రోడ్డు న బడ్డారు జనం బాగు సౌకర్యాలు కోసం అనో

4. పోనీ ఇదన్నా చెప్పండి. మే తెలివిగలవాళ్ళం , పై ఆరు పాయింట్లు, మా ముని మనవళ్ల కు , మా ప్రియతమ నాయకుల వారసుల ముని మనవళ్లు చేస్తారని, పక్కన పెట్టాం. ఇప్పుడు ఆ అభివ్రుద్ది మాకు వద్దు. ఎదురు చూస్తాం తరాలు , మాటతప్పరు, మడమ తిప్పరు, విశ్వసనీయత ఉంది మా నాయకుల మీద. అనో.

ఓట్లు అప్పుడు కులానికి వర్గానికి డబ్బుకి బానిసలమై లొంగిపోతే, తర్వాత అవినీతి లంచం పనులకు బాధితులము అవుతాము.

Dt : 07-Apr-2019, Upd Dt : 11-Apr-2019 , Category : Politics, Views : 179 ( id : 80 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments