బెస్ట్ సిఎం జగనన్న నాయకత్వం, మీ వంటి అనుభవజ్ఞుల అండలో పూర్తి చేసాము, అన్న కీర్తి వద్దా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,882; 104 తత్వాలు (Tatvaalu) and views 225,624.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తూ, ప్రజలు శ్రమతో కట్టిన పన్నులు తో, మన సౌకర్యాలు జీతాలు వస్తున్నాయి, అన్న సృహ కృతజ్ఞతలు మానవత్వం బాధ్యత ఉన్న, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ నమస్కరించి వ్రాయునది.

అయ్యా, మీకు చెప్పేంత స్ధాయి హోదా కానీ లేదు, కానీ మనది కాని, పాప భారం నెత్తిన వేసుకోవద్దు అని గుర్తు చేయడం మాత్రమే, తప్పు అయితే మన్నించాలి.

ప్రభుత్వాలు 5 ఏళ్ళ కన్నా తక్కువ, మనము 30 ఏళ్ళు పైనే ఉంటాము. కేంద్రం అయినా రాష్ట్రం అయినా, మేము ఈ ఎన్నికల లేదా ఇంకో పని చేయము, అని ధిక్కారం చేసే అధికారం మనకు లేదు, అదీ పబ్లిక్ గా మీడియా ముందు, అదీ ఎన్నికల విషయం లో. రాజీనామా ఇచ్చి, బయటకు వచ్చి, నిరసనలు చేయవచ్చు, ధర్మ సమ్మతమే.

ఉద్యోగం లో, మనకు ఇబ్బందులు ఉంటే, లోపల చాటుగా మన పై అధికారులు కు చెప్పకోవచ్చు, తప్పు లేదు.

ఏది తప్పో ఒప్పో తేల్చడానికి, సీనియర్ మంత్రులు, నాయకులు, రాష్ట్ర ప్రధాన సెక్రటరీ ఐఏఎస్ ఉన్నారు. వారు కోర్టు కు వెళతారు ఎన్నికల కమిషన్ మీద అవసరం అయితే, స్టే తెస్తారు. అప్పుడు హాయిగా, గమ్ముగా ఉందాం, ఇబ్బంది లేదు. కనీసం అదిత తేలేంత వరకైనా, ప్రశాంతంగా గమ్ముగా ఉందాం, బయట మీడియా ముందు గర్జనలు శపధాలు శాపనార్థాలు లేకుండా.

మనం, రాజకీయ పార్టీల పరంగా విడిపోయి, విడి విడిగా, శాఖల పరంగా, సంఘ నాయకులు పరంగా, మీడియాలో ఆవేశంగా ప్రకటన లు ఎందుకు? వ్యవస్థ ల మధ్యలో, లెక్కలేకుండా అమర్యాదగా ఉండవచ్చు నా? ఐయేయెస్ లే మీటింగ్ లకు రాకుండా ఉంటే, రేపు మన కింద పని చేసే వారూ అదే పని చేస్తే? వారూ సంఘాలు గా, వార్నిగు లు ఇచ్చి, కోర్ట్ లకు వెళితే? మనము దోవ చూపినట్లే గదా?

ప్రజలు మరియు పిల్లలు గమనిస్తూ ఉన్నారు, ఆవేశంగా మనం చెప్పే మాటలకు, వాస్తవం గా సంవత్సరం గా జరుగుతున్న సన్నివేశాలు కు పొంతన లేదని, నవ్వుతూ ఉన్నారు.

మిగతా రాష్ట్రాలు ధైర్యంగా ఎన్నికలు జరిపాయి. మన హైదరాబాద్ ఎన్నికలు కూడా చూశాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ప్రజలకు, అధికారులు కు ఉన్న, ధైర్యం సాహసం అనుభవం ఓర్పు నేర్పు జాగ్రత్తలు, మనకు లేవా, మనకు చేతకావా?

మన అధికారులు కూడా, భారతదేశంలో ఇలాంటి పరిస్థితి, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. మరి యువనేత బెస్ట్ సిఎం అవార్డు గ్రహీత జగనన్న నాయకత్వం లో, మీ వంటి అనుభవజ్ఞుల అండలో పూర్తి చేసాము, అన్న కీర్తి మనకు వద్దా? భయపడి, ఆగిపోయారు, అని పిరికి వారిగా మిగిలిపోదామా?

* లక్షల కరోనా కేసులతో, బెడ్ లే దొరకని, పరిస్థితి చూసాము, దానిని ఎదర్కొని బయట పడ్డాము. ఇప్పుడు కేసులు చాలా తగ్గినాయి అని మన ఆరోగ్య శాఖ రిపోర్టు.

ఒకవేళ తగ్గలేదు అనుకున్నా కొత్త గా వస్తుంది అనుకున్నా, జాగ్రత్తలు తీసుకుందాం, మిగతా రాష్ట్రాల అనుభవాల నుంచి. ఆ ఓర్పు నేర్పు అనుభవం మనకు ఉంది.

* పంచాయతీ అధికారులు ను 3 ఏళ్లుగా, ఆన్లైన్ పన్నులు కావాలని వేడుకుంటున్నాం. మంత్రి గారికి, రాష్ట్ర అధికారులు కు విన్నపాలు పంపాం.

ప్రజల కుటుంబాలను, పంచాయతీ అధికారుల కుటుంబాలకు అండగా, కరోనా నుంచి కాపాడుకోవడానికి, సాఫ్ట్వేర్ సిద్ధం చేశామా?

అధికారులు, సిబ్బంది ధర్నా లు చేశారా? లేదు, కనీసం జవాబు కూడా లేదు. అంటే, వారికి కరోనా భయం లేదు.

* స్ధలాలు, సరుకులు పంచుతూ ఉంటే, రెవిన్యూ అధికారులు అందరూ పాల్గొన్నారు, నాయకులు తో వందల ప్రజల మధ్య. భయపడలేదు కదా? ధర్నా చేశారా?

* మద్యం అమ్మకాలు లో, మైలు దూరం జనం క్యూలో నిల్చుని ఉన్నా, మన పోలీసు సోదరులు సహకరించారు కదా. పోలీసు ధర్నాలు లేవు. రావద్దు అన్నా, బయటకు వచ్చిన ప్రజలను దండించిన పరిస్థితి చూశాం, అంటే ఎవరూ ఏ పని ఆపుకోవడం లేదు.

* సీఎం జగన్, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్, పీఎం మోదీ చెప్పారు, తప్పదు కరోనా తో కలసి నడవాలని, జనం, నాయకులు, అధికారులు అదే పని చేస్తున్నారు సంవత్సరం గా.

* నాయకులు మీటింగ్ లు, పుట్టిన రోజులు, వేడుకలు, నడకలు, అన్ని కార్యక్రమాలు వందల జనం తో సాగుతూ ఉన్నాయి, గత జనవరి నుంచి కూడా. నాయకులు ఫేస్బుక్ పేజీలు లో సాక్ష్యం ఉంది.

* ప్రజలు పెళ్లి, పేరంటాలు , తిరగడం ఎక్కడ కూడా తగ్గలేదు. అందరూ అలవాటు పడిపోయారు.

* ఒక్క సారి వాలంటీర్ కుటుంబం ల గురించి ఆలోచన చేయండి, వారు కూడా, మేము ఇక తిరగము అంటే వ్యవస్థ నిలిచిపోదా? వారివి కుటుంబాలు కాదా? పంచాయతీ సిబ్బంది శ్రమ వారు తగ్గించలేదా?

4 దశల్లో పంచాయితీ ఎన్నిక జరుగుతుంది, కాబట్టి అందరి మీదా ఒకేసారి వత్తిడి లేదు.

వాక్సిన్ వేసుకున్నా కూడా, రెండు మూడు డోసుల పంపిణీ తర్వాత అయినా, కరోనా జాగ్రత్తలు సంవత్సరం దాకా తప్పవని, విదేశాల లోనే చెపుతున్నారు. మన దగ్గర కూడా అంతే కదా.

మనం ఎన్నికల కు అనుకూలం కాదు, ప్రతికూలం కాదు. జరపాలో లేదో, పెద్దలు తెలుస్తారు.

ఎన్నికల కమిషన్ మరియు సీనియర్ మంత్రులు నాయకులు తేల్చుకుంటారు, ఏం చేయమంటే అప్పుడు అదే చేద్దాం. ఆవేదన ఆవేశం, మీడియా ముందు దయచేసి వద్దు, మన పరువు నిజాయితీ నిబద్ధత దేశసేవ ఆత్మాభిమానం, మనమే తీసుకోవద్దని తక్కువ చేయవద్దు అని మనవి.

ఇన్ని విధాలుగా, ధనము సరకులు స్ధలాలు, ఎన్నో కోట్లు అప్పులు తెచ్చి, ఇంతమంది కి పంచుతూ ఉంటే, ప్రభుత్వం కు అనుకూలంగా నే ప్రజలు ఉండాలి, ఉంటారు కదా.

సీఎం జగనన్న తోనే ప్రజలు ఉన్నారు అని ఇంకో నెలలో తేలిపోతుంది కదా.

ధన్యవాదాలు. మీలాంటి ఓ చిరుద్యోగి ఆవేదన.

Update on 25th, Jan: మనం మొన్న ప్రభుత్వ ఉద్యోగులు కు ఉత్తరం రాశాము అందులో అనుకున్న మాటలే , సుప్రీంకోర్టు ఈరోజు పంచాయతీ ఎన్నికల విషయంలో చెప్పింది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,882; 104 తత్వాలు (Tatvaalu) and views 225,624
Dt : 23-Jan-2021, Upd Dt : 25-Jan-2021, Category : Politics
Views : 869 ( + More Social Media views ), Id : 936 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : best cm , andhra , jagan , govt employee , veterans , completed , elections , corona , reputation , panchayat , police
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content