ఇంతకుబూని వచ్చి, వచియింపక పోదునే - లవకుశ సినిమా పద్యాలు - Songs - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 987 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

మర్యాద, కష్టము సుఖాలను సమముగా చూడటము, ఇవన్నీ రామాయణము లో చెప్పబడినవి. లవకుశ సినిమాలో బాగా చిత్రీకరించారు అవి.

వచన పద్య రూపములో తేలికగా అర్ధము అవుతాయి. లక్ష్మణుడు అడవిలో సీతమ్మను వదిలేటప్పుడు చెప్పిన మాటాలు, వాటికి జవాబు గా సీతమ్మ చెప్పిన మాటలు, చివరగా వెళ్ళేటప్పుడు లక్ష్మణయ్య సీతమ్మ పాదాలకు నమస్కరిన్చే విధముగా చెప్పు మాటలను చూడండి. ప్రతి మాటలో ఎంతో ఓర్పు మర్యాద, అంత బాధా లో కూడా.

అడవిలో ఉన్న సీతమ్మ ను, వాల్మీకి ఆశ్రమం లోకి వచ్చి ఉండమని ఆహ్వానించడం ఈ పద్యం - ఇదె మన ఆశ్రమంబు. మీరూ ప్రయత్నం చేస్తారు కదూ.

ఇక దేవుని పద్యాలు పాటలు ప్రయత్నం చేయడం మంచిది. రాగం స్వర మాధుర్యం మనకు లేకపోయినా పర్లేదు, కానీ శ్వాస ఆపడం ప్రాణాయామం గొంతు జీర పోకుండా అంటే పీలగా రాకుండా ఉంటే, అందరికీ మంచిది.

గొంతు బాగా రాని వారు కూడా, ప్రయత్నం చేసిన మార్పు వస్తుంది. మనం మాట్లాడుతూ ఉన్న గొంతు వేరు, మన అసలు గొంతు వేరు. సాధనతో బయటకు తేవచ్చు ఆ మీ మంచి గొంతు ను. శ్వాస నియంత్రణ, ఆరోగ్యం కూడా.

నాయకులు, అధికారులు, చివరకు మనమైనా మన మాట స్పష్టంగా గట్టిగా ఉండాలి.

ఇంతకు బూని వచ్చి వచియింపక, పోదునె? విన్ము తల్లి!
దుశ్చింతులు దైత్యు చేబడిన, సీతను గ్రమ్మఱ నేలుచున్నవాడు
ఎంతటి విమోహి రాముడని, యెగ్గులు పల్కిన నాలకించి,
భూకాంతుడు నిందజెంది (2)
నిను కానలలోపల దిన్చి రమ్మనెన్ (2)

అపవాద ధూషితయైన కాంతను బాసి, పతికీర్తి బొందుట భావ్యమనుము
కౌసల్యాదిగాగల్గు అత్తల కేను, కడుభక్తితో మ్రొక్కులిడితి ననుము
తోడి కోడండ్రు నాతోడి నేస్తము నెంచి, కడసారి సేమంబు నడిగె ననుము
చెలికత్తియలు నన్ను పలుమారు దలపోసి, యమ్ములింప నిరుపయోగమనుము

ప్రజలనికమీద మోదంబు బడయుడనుము, పతిని ఎడబాసి పతిని ఎడబాసి
ఇక సీత బ్రతుక దనుము, జన్మజన్మంబులకు రామసార్వభౌము 2
పరమ పావన భర్తగా బడతు ననుము

ప్రతిదిన మేను తొల్దొలుత పాదములంటి నమస్కరించి,
నీ యతులితమైన దీవనల నంది చరింతు,
తదీయ భాగ్య మీ గతి యెడమాయె,
ఇంకెపుడు గాంతు భవత్పద పద్మముల్,
నమశ్శతములు సేతునమ్మా,
కడసారి గ్రహింపుము, జానకీ సతీ ... జానకీ సతీ

ఇదె మన ఆశ్రమంబు, ఇచటనీవు వసింపుము లోకపావనీ
సదమలవృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ, తపస్వినుల్
ముదముగ రామ నామము 2, తపోవనమెల్ల ప్రతిధ్వనించూ . .
నీ పదములు సోకి, మాయునికి పావనమై చెలువొందు, నమ్మరో

ఇంతకు బూని వచ్చి

ఇదె మన ఆశ్రమంబు

Lava Kusa Movie, Lakshmana Leave Sita in Forest Sentiment Scene,
NTR, Anjali Devi, kanta rao

http://www.ghantasala.info/newlyrics/lyric_00411.html  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1015 General Articles, 46 Tatvaalu
Dt : 24-Jan-2021, Upd Dt : 24-Jan-2021, Category : Songs
Views : 155 ( + More Social Media views ), Id : 939 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : intakubuni vachi , apavada bhushitayaina , pratidina menu , ide mana aaSramamu , lavakusa , movie , poems , ntr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content