నా కూతురు కు బాల నెరుపు తో, అప్పుడే నెత్తిన తెల్ల జుట్టు వచ్చింది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,425,825; 104 తత్వాలు (Tatvaalu) and views 261,701.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

6 ఏళ్ల అప్పుడు ఆడపిల్లల కు, కన్న తల్లి జుట్టు ను, పాయలు పాయలు గా లాగి జడవేస్తుంది.

మరి ఆ పిల్లలు పెరిగి న తర్వాత, 60 ఏళ్ల కన్న తల్లి కి, మరి పాయలు లాగి జడలు లేదా రంగు వేస్తారా? అన్ని అవసరాలు తీరాక, అంత తీరిక, ప్రేమ, ఆప్యాయత ఉంటుందా? మరి అబ్బాయిలు, అసలు పట్టించుకుంటారా?

నా కూతురు(అమ్మ 74 వయసు) కు బాల నెరుపు తో, అప్పుడే నెత్తిన తెల్ల జుట్టు వచ్చింది. పదిమందిలో తిరిగేటప్పుడు, నా బిడ్డా బాగా కనపడాలి కదా, తక్కువ వయసు దానిలాగా.

తన మనసులో, ధృడంగా స్థిమితంగా ఉంచాలి, ఆరోగ్యం మెరుగు పరిచే ధైర్యం ఇవ్వాలి పెంచాలి అంటే, కొన్ని పనులు మనము చెయ్యాలి.

నా కూతురికి రెండు నెలల కొకసారి, గత ఐదు ఏళ్లుగా ఎదురుగా కూర్చోబెట్టుకుని, దువ్వెనతో జుట్టు ను, పాయలుగా పాయలుగా లాగి, నల్ల రంగు వేస్తున్నాను. కనీసము అరగంట పడుతుంది, బుద్దిగా కదలకుండా కూర్చోని, ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది.

మనము మాత్రం రంగు వాడము జుట్టు కు వయసు పైబడుతున్నా, జుట్టు నలుపు తెలుపే సహజం కాబట్టి దాన్ని అలాగె ఉంచాలి అని.

తల్లి కి కృతజ్ఞతలు ఆప్యాయత ప్రేమ చూపించడానికి ఇదొక మార్గం. డబ్బు తో బయట చేపించవచ్చు, కానీ సొంత బిడ్డలు చేస్తే కొన్ని అయినా, వారికి బతకాలి అన్న ఆశ ఉంటుంది పెరుగుతుంది.

మనస్తత్వ శాస్త్రం తెలిసిన వారికే లేదా సైక్రియాటిస్ట్ డాక్టర్ కే, అది అర్థం అవుతుంది. మానసికముగా ఆ వయసువారిని మార్చడము ఎలాగో.

మరి మాకెందుకు చెపుతున్నావు అంటారా? గుర్తు చేస్తున్నా మన పాత మాట, 6 ఏళ్ల పిల్లకు 60 ఏళ్ల తల్లి కి కావలసింది ధనం కాదు, మన ప్రేమ. ఆలోచన చేసి, మీ తల్లి దండ్రులు కు ఆ భాగ్యం కలిగించండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,425,825; 104 తత్వాలు (Tatvaalu) and views 261,701
Dt : 30-Dec-2019, Upd Dt : 30-Dec-2019, Category : General
Views : 1514 ( + More Social Media views ), Id : 271 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : అమ్మ తెల్ల జుట్టు , నల్ల రంగు
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content