APLatestNews.com top Banner

Social Media links
అధిక ధనం లేదా అధికారము పెరిగేకొద్దీ మనశ్శాంతి కరవు, భద్రత కరవు, నిద్ర కరవు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఎంత ఐశ్వర్యం లేదా అధికారము ఉన్నా కూడా, మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు అసంతృప్తి, అశాంతి తో, మనశ్శాంతి లేకుండా.

చాలా మంది ధనం ఉంటే చాలు అన్ని వస్తాయి అనుకుంటారు, ధనము లేక ముందు.

అధిక ధనం లేదా అధికారము పెరిగేకొద్దీ మనశ్శాంతి కరవు, భద్రత కరవు, నిద్ర కరవు. వీటిని ధనం తో కొనలేము కదా ఏ షాప్ లో కూడా.

మనము అనుకుంటాము, అధిక ధనం ఉంటే కాపలా వారిని పెట్టకోవచ్చు. కోట లాంటి ఇంట్లో ఉండవచ్చు. పనివారికి, భద్రత కు ఇబ్బంది ఏమిటి కోటీశ్వరులుకు?

మనశ్శాంతి, నిద్ర ఉండదు అని ఒప్పకున్నందుకు ధన్యవాదాలు. సినిమాలో హీరోయిన్, హీరో కల్లే చూపు కాకుండా, కధ వైపు చూస్తే కొంత విషయము దీని గురించి తెలుస్తోంది.
మనకు తెలిసిన వారి గురించి చెపితే, వారికి కోపాలు వస్తాయి కదా. సినిమా పోలికే ఉత్తమము. సమస్యలు ఎక్కువగా ఇంట్లో వారి నుంచే వస్తాయి.

1. కాపలా వారు లేదా దగ్గర పని చేసేవారే మోసం చేసిన ఉదాహరణలు ఎన్నో కదా. ప్రధాని ఇందిరా గాంధి గారి దగ్గర చూసాము. ఫాక్షన్ సినిమాలో, ప్రత్యర్ధులు ఎదురు పక్షము పని లేదా కాపలా వాళ్ళనే వినియోగించుకుంతారు.

2. కొడుకు కోడలు(లేదా కూతురు అల్లుడు) వ్యాపారం లేదా అవసరం కోసం డబ్బు అడిగి, తల్లి తండ్రి నమ్మకం లేక ఇవ్వను అంటే, ఇంక తల్లి దండ్రుల పాట్లు చాలా సినిమాలలో చూసాము?

3. భాగస్తులు లేదా జీవిత భాగస్వామి, చుట్టూ పక్కన వాళ్ళు, బంధువులు అందరూ రాబందులు లాగా యజమాని పతనం కోసం పని చేస్తున్నారు. లేదా అహంకారం మదం అధికారంతో యజమాని, తనే తన పతనం కోరితే.

4. మన జగనన్న, చంద్రన్నలో ఒకరైనా మనశ్శాంతి భద్రత గా నిద్ర పోతున్నారా? ఎప్పుడు ఏమి జరుగుద్దో ఇద్దరుకూ భయమే, బయటకు నవ్వులే నవ్వులు. ఎంత కాపలా ఉన్నా నిజము దేవునికి ఎరుక.

అధికారంలో ఉండి హయిగా నిద్ర పోయేది, కేవలం మన తెలంగాణ చంద్రన్న మాత్రమే. అదృష్టవంతుడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 584 General Articles, 46 Tatvaalu
Dt : 30-Dec-2019, Upd Dt : 30-Dec-2019, Category : General
Views : 146 ( + More Social Media views ), Id : 270 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : అధిక ధనం లేదా అధికారము , మనశ్శాంతి కరవు , భద్రత కరవు , నిద్ర కరవు
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content