Sri Shani Stotram (Dasaratha Krutha) శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) श्री शनि स्तोत्रम् (दशरथ कृतं) - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,872,961; 104 తత్వాలు (Tatvaalu) and views 225,550.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వచ్చే జనవరి నుంచి శని దేవుడు, రాశి మారుతున్నారు. దాదాపు అన్ని రాశులకు ఏదో విధముగా, ప్రభావం ఉంటుంది. కనీసం 5 రాశులకు గట్టి ప్రభావం ఉంటుంది.

Lord Shani changing Raasi from next January. Almost all zodiac signs have an influence, in some way. At least 5 zodiac signs have strong influence.

ఏలినాటి శని 7 న్నర ఏళ్ళలో, తగిన విధముగా బుద్ది చెప్పి, మనల్ని మంచి మార్గములో నడిపించే ఏకైక మంచి గురువు. మంచి వారిని ఏమీ చేయరు, తక్కువ శిక్షతో వదలవచ్చు. కానీ అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలను మాత్రం వదలరు.

Shani Sade Sati, 7 and a half years is the only good teacher who gives proper wisdom and guides us in the right path. No issue for good folks, and can be let off with less punishment. But the slaves of the Ashtavyasanas and Arishadvargas are not spared.

ఇప్పటి వరకు మన మెత్తటి మాటలను చూసారు, నవ్వు కున్నారు. ఇంక తర్వాత పని గట్టిగా, ఆయన చూసుకుంటారు.

Until now they have seen our soft words and laughed. And then the work is hard, he will take care of it.

అలాగే ఏలిన నాటి, అర్ధాష్టమ, అష్టమ శని లేని వారికి మొదలు అవుతుంది, వచ్చే జనవరి నుంచి. ఈ 2 న్నర ఏళ్ళలో జరిగే పాపాలు తప్పులే, తర్వాత 2 న్నర ఏళ్ళలో శిక్షకు పాత్రత వస్తుంది, మనకు గుర్తు వస్తాయి వెంటనే. కాబట్టి, తప్పులు పాపాలు చేయకుండా, శని గురువు చేతులో పడకుండా, జాగ్రత్తలు గా ఉండాలి.

Also, for those who don't have Shani, Shani Sade Sati, Ardhaashtama and Ashtama starts from next January. The mistakes made in these 2 and a half years will be punished in the next 2 and a half years, we will recognize them immediately. So, care should be taken not to make mistakes/ sins and not fall into the hands of Shani Guru.

పూజలు పునస్కారాలు కొంత ఉపశాంతిని మాత్రమే ఇస్తాయి. కానీ శిక్షను తప్పించవు. కాబట్టి, ముదుసలి తల్లి దండ్రులు ను దగ్గర పెట్టుకున్నా, కొంత ఉపశాంతి, సజీవ గురుసేవ గా. గురు గ్రహము అండ, కేవలము 1 ఏడాది మాత్రమే సుమా, మరువద్దు. పాపాలు తప్పుల నుంచి, ఎవరు కాపాడలేరు.

Pujas and Punaskaras only give some relief. But do not escape punishment. So, even if the old mother and father are close, there is some peace as living guru seva. And planet Jupiter, only 1 year support, don't forget. No one can save from sins.

కాబట్టి మన భక్తి శ్రద్దలు సాధన మాత్రమే, మనల్ని కాపాడతాయి. 5 ఏళ్ళకు పైగా, మనము అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలకు ఎలా దూరం గా ఉండాలో నేర్చుకున్నాము. అది పాటిస్తే, శని మనల్ని అంతగా బాధించరు. వ్రుధా ఖర్చు ప్రయాణం ఉండదు.

So our bhakti sraddhas sadhana are only save us. For more than 5 years, we have learned how to stay away from Ashtavyasanas and Arishadvargas. If we follow that, Shani will not bother us so much. So there will be no unneceassary travel and expenses.

ప్రతి 27 ఏళ్ళ కు ఒక్క సారైనా, పట్టకుండా, శని వదలరు, కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు.
At least once in every 27 years, Saturn does not leave without catching, so no one can escape.

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || 1 ||

namaḥ kr̥ṣṇāya nīlāya śikhikhaṇḍanibhāya ca |
namō nīlamadhūkāya nīlōtpalanibhāya ca || 1 ||

नमः कृष्णाय नीलाय शिखिखण्डनिभाय च ।
नमो नीलमधूकाय नीलोत्पलनिभाय च ॥

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || 2 ||

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || 3 ||

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే || 4 ||

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే || 5 ||

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే || 6 ||

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ || 7 ||

జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ || 8 ||

దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః |
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే || 9 ||

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః || 10 ||

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః |
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః || 11 ||

Sri Shani Stotram (Dasaratha Krutha) namah krsnaya nilaya  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,872,961; 104 తత్వాలు (Tatvaalu) and views 225,550
Dt : 17-Dec-2022, Upd Dt : 17-Dec-2022, Category : Songs
Views : 942 ( + More Social Media views ), Id : 1652 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : shani , stotram , dasaratha , krutha , namah , krsnaya , nilaya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content