Sri Bramarambika Ashtakam శ్రీ భ్రమరాంబిక అష్టకం श्रीशैल मल्लिकार्जुन ब्रमराम्बिका अष्टकम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1769 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1804 General Articles and views 1,395,944; 94 తత్వాలు (Tatvaalu) and views 184,895.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శ్రీ భ్రమరాంబిక అష్టకం Srisaila Mallikarjuna Bramarambika Ashtakam श्रीशैल मल्लिकार्जुन ब्रमराम्बिका अष्टकम्

Bramarambika Ashtakam is an 8 verse stotram in praise of Goddess Bramarambika Devi or Bramaramba, who is the consort of Lord Mallikarjuna (Shiva) of Srisailam. She is a form of goddess Parvathi. Bhramarambika devi temple in Srisailam is one of the 18 Sakthi peetas. Bramarambika Ashtakam was composed by Sri Adi Shankaracharya during his visit to Srisailam.

భ్రమరాంబిక అష్టకం అనేది శ్రీశైలంలోని మల్లికార్జున (శివుడు) యొక్క భార్య అయిన భ్రమరాంబికా దేవి లేదా భ్రమరాంబ ను స్తుతిస్తూ 8 శ్లోకాల స్తోత్రం. ఆమె పార్వతీ దేవి రూపం. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి ఆలయం 18 శక్తి పీఠాలలో ఒకటి. భ్రమరాంబిక అష్టకం శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీశైలం సందర్శన సమయంలో రచించారు.

రవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి
ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి
శివుని పట్టపురాణి గుణమణి శ్రీ గిరి భ్రమరాంబికా || 1 ||

Ravi sudhaakara vahni lochana ratna kundala bhooshini
pravimalambuga mammunelina bhaktha jana chintamaNi
avani janulaku kongu bangaaraina daiva shikhaamaNi
shivuni pattapuraNi guNamaNi Sri giri Bhramarambika

కలియుగంబున మానవులను కల్పతరువై యుండవా
వెలయు శ్రీ గిరి శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్త వరులకు అష్ట సంపద లీయావా
జిలుగు కుంకుమ కాంతిరేకుల శ్రీ గిరి భ్రమరాంబిక || 2 ||

అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్‌
పొంగుచును వరహాల కొంకణ భూములయందునన్
రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్
శృంఖలా దేశముల వెలసిన శ్రీ గిరి భ్రమరాంబిక || 3 ||

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివి
శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరి భ్రమరాంబిక || 4 ||

ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణి
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి
శీఘ్రమేకని వరము లిత్తువు శ్రీ గిరి భ్రమరాంబికా || 5 ||

నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీ గిరి భ్రమరాంబికా || 6 ||

సోమశేఖర పల్లవారధి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీ గిరి భ్రమరాంబికా || 7 ||

భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివి
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీ గిరి భ్రమారాంబికా || 8 ||

ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీ గిరి భ్రమరాంబికా || 9 ||

తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబిక || 10 ||

ఇతి శ్రీ భ్రమరాంబిక అష్టకం సంపూర్ణం ||

Srisaila Mallikarjuna Bramarambika Ashtakam telugu  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1804 General Articles and views 1,395,944; 94 తత్వాలు (Tatvaalu) and views 184,895
Dt : 30-Sep-2022, Upd Dt : 30-Sep-2022, Category : Songs
Views : 386 ( + More Social Media views ), Id : 1544 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Srisailam , Mallikarjuna , Bramarambika , Ashtakam , Shiva , Parvathi , Shankaracharya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content