నువ్వు వస్తావని బృందావని, ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా - మల్లె పువ్వు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,393,290; 104 తత్వాలు (Tatvaalu) and views 258,728.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*నువ్వు వస్తావని బృందావని, ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా - మల్లె పువ్వు, శోభన్, లక్ష్మి, జయసుధ*

మల్లెపువ్వు చిత్రము గురించి ముందు కధనములో తెలుసుకున్నాము. ఈ చిత్రములో చాల మంచి పాటలు ఉన్నాయి. ఇది ఆ నల్లనయ్య క్రిష్ణయ్య గీతం. క్రిష్ణయ్య కోసం, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించి, మనస్పూర్తిగా ఎదురు చూసే భక్తులలో ఇలాంటి మాటల పాటలను మనము చూడవచ్చు.

మహిళ పాడినట్లు ఈ దాసి అన్న దగ్గర, ఈ దాసుడు అని చిన్న మార్పులు మాత్రమే, మిగతా పాట మొత్తము అదే. మీరు ఆ దేవ దేవుని, కీర్తిస్తూ పాడే ప్రయత్నము చేసి, మనశ్శాంతి పొందుతారని ఆశిద్దాము.

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా... 2
వేణువు విందామని. నీతో వుందామని.
ఈ దాసుడు వేచేనయ్యా, రావయ్యా...
ఓ.ఓ.ఓ.గిరిధర, మురహర.
రాధా మనోహరా...ఆఆ.ఆఆ.ఆఆ.
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. క్రిష్ణయ్యా... రావయ్యా...

నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా..
మమతల దీపాలు వెలిగించాము.. 2
కుశలము అడగాలని. పదములు కడగాలని.
కన్నీటి కెరటాలు తరలించాము. ఓ.....ఓ.ఓ.
గిరిధర. మురహర. నా హృదయేశ్వరా...
నీ దాసుని గుండెలలో, మోహము చల్లార్చరా 2
కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా.2
గోవింద. గోవింద.గోవింద. గోపాలా...4

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా.
వేణువు విందామని. నీతో వుందామని.
ఈ దాసుడు వేచేనయ్యా రావయ్యా.ఓ.కృష్ణయ్యా.

నీ పద రేణువునైనా, పెదవుల వేణువునైనా.
బ్రతుకే ధన్యమని భావించాము... 2
నిన్నే చేరాలని, నీలో కరగాలని.
మ మనసే హారతి గా వెలిగించాము
ఓ.ఓ.ఓ.ఓ.ఓ.
గిరిధర. మురహర. మ హృదయేశ్వరా
ఒకసారి దయచేసి దాసుని దయచూడరా. 2
కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. 2
గోవింద. గోవింద.గోవింద. గోపాలా...4

Nuvvu Vastavani brundavani krishnayya, Malle Puvvu, shobhan, laxmi, jayasudha

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,393,290; 104 తత్వాలు (Tatvaalu) and views 258,728
Dt : 01-Oct-2022, Upd Dt : 01-Oct-2022, Category : Songs
Views : 568 ( + More Social Media views ), Id : 1547 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Nuvvu , Vastavani , brundavani , krishnayya , mallepuvvu , shobhan , laxmi , jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content