మరు మల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా Parody - మల్లె పువ్వు, శోభన్ బాబు, లక్ష్మి, జయసుధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,563; 104 తత్వాలు (Tatvaalu) and views 225,078.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మరు మల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తియ్యనిది Parody - మల్లె పువ్వు, శోభన్ బాబు, లక్ష్మి, జయసుధ

ఇది 1978 లో విడుదలైన ఒక మంచి తెలుగుచిత్రం. గురుదత్ హిందీ చిత్రం ప్యాసా (1957) ఆధారంగా తీయబడింది. ఒక గుర్తింపురాని కవి, విఫల ప్రేమ, అన్నదమ్ముల చీత్కారం, తన రచనల్ని ప్రేమించే వేశ్య, జీవించి ఉండగారాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం, ప్రజల అవకాశవాదం వీటన్నిటి సమాహారం ఈ చిత్రం. చిత్రం చక్కని పాటలతో తెలుగులో కూడా విజయవంతమయ్యింది. ఆరుద్ర, వేటూరి చిత్రంలో కనిపించడం విశేషం.

మల్లె పువ్వు చిత్రములో గాయపడిన ప్రేమికుడి పాట. మరి మనము, గాయపడిన మనసు పేరడీ పాటగా పాడుకుందాము. కోతి మనసు బ్రమల పరుగులే నిజమనుకుని, పరుగులు తీసి తీసి అలిసిపోయి, చివరకు విషమని తలచినా, గడచిన జీవితము వెనక్కి రాదు.

కాబట్టి బుద్ది తో లేదా బుద్ది గల వారితో నిరంతరము మెలుకువ గా ఉండి, మనసు ను నియంత్రణలోకి తెచ్చుకోవాలి అనేదే మన ప్రయత్నం. ఈ ప్రయత్నం, పతనము వద్దు, సంస్కారము గా ఉండాలి అనుకునే, ప్రతి వారికి కావాలి, ముఖ్యముగా 30 ఏళ్ళ వయస్సు లోపు వారికి కూడా.

పండితులకు మనము వేదాలు స్తోత్రాలు పురాణాలతో కధనాలు చెప్పినా, పామరులకోసం మానసిక నియంత్రణ అవసరం ఇలాంటి పాటల ద్వారా చెప్పనిదే వారికి అర్ధము కాదు, ఎక్కదు. కాబట్టి, మా ప్రయత్నాన్ని మన్నించి, సహకరించి, మనసు అదుపులేని వారికి ఈ పాటలు వినిపిస్తారని ఆశిద్దాము.

180 videos 300 songs approx, 300 subscribers 84,867 views from Aug 16, 2022. ఆగస్ట్ 16, 2022 నుండి 300 మంది సభ్యులు 84,867 వీక్షణలు. షుమారు 180 వీడియోలు, 300 పాటలు.

Parody -

మాట వినని మణిపూస మనసు నీవు
క్షణ కాలము కోరికలు ఆపవు
చూసినవన్ని మనకే అని శోకవన్నె రేపుచున్నావు...
ఎంతటి శాపమే మనకు పాపమే

ఓ మనసా
మరు మల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తియ్యనిది 2
మన మనసు అనుకొని మురిసితిమి, అది విషమని చివరకు తెలిసినది
మనసా ఆ ఆ

మేమెన్తటి వంచన చేసాము సిరిసంపదకమ్ముడు పోయాము
విడనాడుట మాకు దుర్లభం
విడనాడుట మాకు దుర్లభం, నిను విడువదులే మా బలహీనహృదయం
ఓ మనసా ||మరు మల్లియ||

తొలి తప్పుకు ఫలితం కన్నీరు, వ్యామోహానికి ఫలితం పతనం 2
మోహం చేసిన గాయం మానదులే ఏ
మోహం చేసిన గాయం మానదులే, చెలరేగే జ్వాల ఆరదులే
ఓ మనసా ||మరు మల్లియ||

Original

చేయి జారిన మణిపూస చెలియ నీవు
తిరిగి కంటికి కనబడితీవు గాని
చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు...
ఎంతటి శాపమే

ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది 2
మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది
సఖియా ఆ ఆ

నీవెంతటి వంచన చేసావు సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం, నిను విడువదులే నా హృదయం
ఓ ప్రియా ||మరు మల్లియ||

తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు 2
చెలి చేసిన గాయం మానదులే ఏ
చెలి చేసిన గాయం మానదులే, చెలరేగే జ్వాల ఆరదులే
ఓ ప్రియా ||మరు మల్లియ||

మల్లె పువ్వు పాటలు - ఓ ప్రియా - శోభన్ బాబు, లక్ష్మి, జయసుధ

Maru malliya kanna tiyyanidi, Movie: Malle Puvvu, Cast: Shobhan Babu, Laxmi,Jayasudha, Music Director: Chakravarthi, 1985.

Maru malliya kanna tiyyanidi Malle Puvvu O Priya Parody Shobhan, Laxmi,Jayasudha  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,563; 104 తత్వాలు (Tatvaalu) and views 225,078
Dt : 01-Oct-2022, Upd Dt : 01-Oct-2022, Category : Songs
Views : 479 ( + More Social Media views ), Id : 1546 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : malliya , tiyyanidi , mallepuvvu , priya , parody , shobhan , laxmi , jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content