శంకరాభరణము - ఆధ్యాత్మిక నాదం - ఓంకార నాదాను, బ్రోచే వారెవరూ రా, సామజ వర గమనా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,402; 104 తత్వాలు (Tatvaalu) and views 225,064.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sankarabharanam Telugu/ Tamil/ Malayalam/ Kannada movie, Ragam Tanam Pallavi, Shankaraa Nada Sarirapara, Dorakuna ituvanti seva - devotional songs. Please try to sing and teach to kids for good vaksuddi.

ఓం కేశవాయా ఓం నమశ్శివాయా అంటూ మన అన్ని మంత్రాలు, ఓం కారము తో నే మొదలు అవుతాయి. ఓం కారముతో నే హైందవ శ్రుతులు క్రుతులు ముడిపడి ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరూ, తప్పక ప్రయత్నము చేయవలసిన, తేలిక పాటి తారక మంత్రము.

ఓం . . ఓం . . అని మనమూ దీర్ఘముగా అంటూ, నిత్యమూ 15 నిమిషాలు సాధన చేయగలిగితే, ఆ శబ్ధము మన నాభినుంచి పెల్లుబికుతుంది. వాక్సుద్ది వస్తుంది, వాక్సుద్ది అంటే మంచి గొంతు అనే కాదు, మన పలుకు కు శక్తి కూడా వస్తుంది. అవి గొంతు పై మాటలు కాదు, హ్రుదయపు మాటలు లా.

అయితే పాటగాళ్ళు అందరూ ఆధ్యాత్మిక వాదులు అవ్వాలని ఎక్కడాలేదు, అవకాశం ఎక్కువ ఉంది అంతవరకే. అందుకే పెద్దలు అన్నారు, త్రికరణశుద్ది - మనసా వాచా కర్మణ అని, అంటే మాటలు ఆలోచనలు పనులు అన్ని కలవాలి సుమీ.

చూడండి ముత్యాల లాంటి మాటలు తో ఈ పాటను - ఓంకార నాదాను, సంధానమౌ గానమే, శంకరాభరణము. శంకర గళ నిగళము, శ్రీహరి పద కమలము. ఇదే సంగీతముతో పరమాత్మను కొలవడము అంటే. రాసే మాటలు, దానిని పలికే మానసిక తన్మయత్వ గొంతు అన్ని కలిస్తే, ఆ దేవ దేవుని, మనసారా తన్మయత్వముతో సంగీత గానం తో పూజించడమే కదా? ఇది సంగీత గాన సేవ కాదా? అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, తరించింది ఇలా కాదా?

శారద వీణా, రాగ చంద్రికా, పులకిత శారద రాత్రము. నారద, నీరద, మహతీ నినాద, గమకిత శ్రావణ గీతము. సంగీత రసికుల కనురాగమై, రస గంగలో మునిగి తెలుతున్నట్లు ఉంది కదూ? సాత్విక సంగీత ప్రియులకే కాకుండా, పామరులను కూడా ఈ పాటలు అలరించాయి.

సినిమాను ఇతర భాషలలోకి తర్జుమా చేసినా కూడా, పాటలు తెలుగు లోనే ఉంచారని విన్నాము. ఎందుకంటే అందరికీ తెలిసిన పదాలే ఇవి.

అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి, గానమె సోపానము - త్రికరణ శుద్దితో చేసే ఈ పని, దేవుని పొందడానికే, ఇంక ద్వైతము ఎక్కడ ఉంది? అంతా ఒక్కటే, అందరిలో నూ దేవుడు ఉన్నారు. సత్వ సాధనకు, సత్య శోధనకు, సంగీతమే ప్రాణము - అవును ఇదే ఒక ఉత్తమ దోవనే, భగవంతుని చేరడానికి.

ఇంకో పాటలో శ్రీ రామ చంద్రుని వేడుకోవడము పాదాలు పట్టుకుని, నన్ను కాపాడే వారు ఇంకొకరు లేరు అని - బ్రోచే వారెవరూ రా, నిను వినా రఘువరా నను బ్రోచే వారెవరూ రా, నీ చరణాం బుజములునే, విడజాల కరుణాల వాల.

ఇంకో మధురమైన పాట - సామని గమజ సుధా మయ, గాన విచక్షణ, గుణశీల దయాల వాల, మాం పాలయ, సామజ వరగమనా.

ఈ ఆధ్యాత్మిక సంగీత పాటలు వింటే, నోరు మనసు కదలని వారు, బహుశా ఎవరు ఉండరు.

చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని, ఎప్పుడూ వింటూ ఉంటే, చెవిటి వారము అవుతాము. పాటలు వింటూ మన నోరు కూడా కదిలించి, వాక్సుద్ది సాధన కూడా చేయాలి. తర్వాత వినడము ఆపి, మనమే పాడే ప్రయత్నం చేయాలి. జీవితాంతము వింటూ చదువుతూ ఉంటే, సాధన ఎప్పుడు?

60 ఏళ్ళు దాకా పూజలు పునస్కారాలు తీర్ధ యాత్రలు, మరి ఇక సజీవ గురు సేవ్, నరుని సేవ, మానసిక ధ్యాన సాధన ఎప్పుడు? అది లేకుండా, ఉత్త జపము తపము తో ప్రయోజనం? ఉత్త బియ్యము, నీళ్ళు, నిప్పు తో ప్రయోజనం లేదు. అవి ఉపయోగించి, అన్నము వండితెనే ప్రయోజనము.

అందుకే ప్రశాంతముగా ఖాళీగా ఉన్నప్పుడే పాటలు వినాలి. అంతే గాని రోడ్ న నడిచేటప్పుడు, ఆఫీస్ లో పని చేసేటప్పుడు లేదా ఇంకో విషయములో, అరిషడ్వర్గాల బానిసలు తప్ప, ఎవరూ చెవులు మూసి వినరు. దాని వలన ప్రమాదాలు, పనిలో తప్పులు జరగడం ఎన్నో సార్లు చూసాము.

ఏ పని చేసినా, ఏకాగ్రత ఉండాలి, దానికే అంకితమవాలి సుమీ. మన నోటికి ఆ స్తోత్రము, పద్యము, పాట స్పష్టముగా రాగయుక్తముగా రావాలి, 6 నెలలుగా వాటిని వింటున్నాము అంటే.

1) ప: ఓం ఓం ఓంకార నాదాను, సంధానమౌ గానమే . . , శంకరాభరణము. . . 2
శంకర గళ నిగళము, శ్రీహరి పద కమలము 2
రాగ రత్న, మాలికా తరళము, శంకరాభరణము . . .

చ: శారద వీణా..... ఆ ఆ ఆ, రాగ చంద్రికా, పులకిత శారద రా..త్రము 2
నారద, నీరద, మహతీ నినాద, గమకిత శ్రావణ గీతము.. 2
రసికుల కనురాగమై . ., రస గంగలో తానమై ... ఈ ఈ 2
పల్లవించు, సా.మ వే.ద, మంత్రము, శంకరా.భరణము శంకరా.భరణము

చ:అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి, గానమె సోపానము...మూ.2
సత్వ సాధనకు, సత్య శోధనకు, సంగీతమే ప్రాణము .. 2
త్యాగ రాజ హృదయమై . ., రాగ రాజ నిలయమై . . 2
ముక్తి నొసగు, భక్తి యోగ మార్గము, మృతియె లేని సుధాలాప స్వర్గము, శంకరా.భరణము
ఓంకార నాదాను సంధానమౌ గానమే.., శంకరా..భరణము
పాదాని శంకరా..భరణము

పమగరి, గమపదని శంకరాభరణము
సరిసా, నిదప, నిసరి, దపమ, గరిగ, పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము
అహా
దపా, దమా, మాపాదపా
మాపాదపా
దపా, దమా, మదపామగా
మాదపామగా
గమమదదనినిరి, మదదనినిరిరిగ

నిరీరిగగమమద, సరిరిససనినిదదప శంకరాభరణము

రీ ససస రిరిసస రిసస సని సరి సని సరి

సనిరి సనిద ని ని ని

ధ ధ ని ని ధధ ని ని ధాధానిని

ధనిస ధనిస ధని ధగరిసనిధప ధ ధ ధ

గరిగ మమగ గరిగ మమగ

గరి గమప గ మపధ మధపమగరిసని

సరిగా సరి గారి మగ పమ ధప మగ పమ

ధప నిధ పమ ధపనిధ శని ధప నిధ

సని రిస గ రి స గరిసనిధ రి స రిసనిధప స

గరిసనిద రిసనిధప సనిధపమ రిసాని

రిసనిదప నిధ సనిధపమప

రిసనిదప సనిధపమ ధపమగరి

గ మ ధ నిధని పధ మప రిసనిధపని

దపమగరి రిసనిధప మగరిసని
(శంకరాభరణము శంకరాభరణము)
Om kaara naadanalu , Singers: SP. Balasubramaniam, Janaki, Lyrics: Veturi

2) బ్రోచే. వా..రెవరూ రా, నిను వినా.. రఘువరా నను
నీ చరణాం.బుజములునే.., విడజా.ల కరుణా.ల వా.ల - బ్రోచే. వా..రెవరూ రా

ఓ చతురా..ననా.ది. వందిత, నీకు పరా.కే.ల నయ్యా.. 2
నీ చరితము పొగడలేని నా.., చింత దీర్చి, వరములిచ్చి, వేగమె 2

ఆ సనిదపద నిసా నినిదదపమ
పాదమ గా మా పాదాని సానీదపమ నీదాపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నీనీసదా దదనిపాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సానీదపమ గామపదని - బ్రోచే. వా..రెవరూ రా

సీతాపతే.., నా పై ., నీ కభిమా.నము లేదా..ఆ 2
వాతాత్మ జార్చిత పాద, నా మొరలను వినరాదా ..
భాసురముగ, కరి రా.జుని బ్రోచిన, వా.సు దేవుడవు నీవు కదా..3
నా పా.తక మెల్ల, పోగొట్టి. గట్టిగ, నా. చేయి పట్టి, విడువక

సా సనిదపద నిసా నినిదదపమ
పాదమ గా మా పాదాని సానీదపమ నీదాపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నీనీసదా దదనిపాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సానీదపమ గామపదని - బ్రోచే. వా..రెవరూ రా

Broche varevarura, Singers: SP. Balasubramaniam, Vani Jayaram,

3) సా.మజ వర గమనా ..2, సాధు హృత్, సార సాబ్జ పాల కాలా.తీత, విఖ్యాత,
సామజ వర గమనా -2 ఆ ఆ

సామని గమజ సుధా... ఆ ఆ 2, మయ, గాన విచక్షణ
గుణశీల దయాల వాల, మాం పాలయ 2 సామజ వరగమనా

ఆమని, కో.యిలా, ఇలా; నా జీవన వేణువు లూ..దగా..2
మధుర లా.లసల, మధు పలా.ల నల 2
పెదవిలోని మధువులాను, వ్రతముపూని జతకు చేరగా..

నిసా దనీ మదా గమా సమమగ గదదమ
మనినిద సనిదమ దనిసా దనిసా
గదదమ మనినిద దససని గసనిద నిసగ నిసగ
సమగమ గససని నిగసగ సనినిద దనినిద
మదదని గమదని సనిదమగస ||సామజవరగమనా||

వేసవి, రేయిలా, ఇలా; నా ఎదలో మల్లెలు చ.ల్లగా ...2
మదిని కో.రికలు, మదన గీ.తికలు 2
పరువమంత విరుల పాన్పు, పరచి నిన్ను పలుకరించగా ..

గమా గమదమగమా గమనిదమదా మదనిసదనీని నీని
మదనీనినీని గమదా దదదదానీ మదనీని నీదమగసా
సాసా సానీ సదా సగమద గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా ఆ ఆ ఆ

Samaja varagamana, Singers: SP. Balasubramaniam, Janaki, Lyrics: Thyagaraja, Veturi

Music: KV. Mahadevan

Sankarabharam - Om kaara naadanu Broche varevarura Samaja varagamana spiritual song  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,402; 104 తత్వాలు (Tatvaalu) and views 225,064
Dt : 28-Jul-2022, Upd Dt : 28-Jul-2022, Category : Songs
Views : 647 ( + More Social Media views ), Id : 1478 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sankarabharam , Omkara , nadanu , Broche , varevarura , Samaja , varagamana , spiritual , song , vishwanath , somayajulu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content