Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి.
పాతకాలపు బామ్మ, నాగరిక మనవరాలు మాటలు వినండి. చిట్టి, కాస్త మొఖానికి పసుపు రాసుకొమ్మా, నీళ్ళతో తడిపి. పో బామ్మ, ఇంకా పాతకాలపు ఇంట్లో పసుపేనా, ఇప్పుడు మా కాలములో ఎన్నో వచ్చాయి, ధనానికి షాపులో ఫేస్ క్రీములు మేకప్పులు.
మరి వాటికి ఖర్చు కదంటే అని బామ్మ. అమ్మా, నాన్న సాయంత్రం దాకా కష్టపడి, మమ్మల్ని పట్టించుకోకుండా, సంపాదించే బాధ్యత నీతి నియమము లేని ధనం ఉండగా, మనకేమి ఇబ్బంది బామ్మా. అంతే గాకా, మనం తింటూ, ఇంకో 10 మందిని బతికించమంటావు కదా? అదే పని చేస్తున్నాము.
మరి మొఖానికి, ఒకసారి మేకప్పులు వేస్తే, అలవాటు అయ్యి, ఇక లేకపోతే చూడనంత చెడిపోతుంది మొఖము, మరలా చర్మవ్యాదులు వస్తాయేమోనే తల్లి. ఏం పర్లేదు మామ్మ, అలవాటు అయ్యింది, ఇప్పుడు మేకప్పు లేకుండా, నాకు నేనే లేదా స్నేహితులు ఇంట్లో వారు, అసలు మొఖము చూసుకోలేము, ఇంక బయట జనానికి మొఖము ఏమి చూపించగలము. ఇక చర్మ వ్యాధులు అంటావా, దానికి స్కిన్ స్పెషలిస్ట్ లు ఉన్నారు, వారూ బతకాలి కదా.
సరే కాస్త వాకిలి చిమ్మి, ముగ్గెయ్యండి, పొద్దున్నే 5 కి లెగిచి, ఆరోగ్యం అంది బామ్మ. ఊరుకో బామ్మ, నీకు మతిమరుపు, మనము ఉంది, అపార్ట్మెంట్ లో అసలు వంగి ఊడవటం, బకెట్ తో నీళ్ళు తెచ్చి చల్లటం, కూర్చుని చలిలో ముగ్గు అనేది ఎప్పుడో మరచాము.
మరి, లావు ఎక్కరా? అనారోగ్యము కాదా? అవును బామ్మా, అందుకే మేము లావెక్కి, నడకలు రన్నింగ్ లు, డాక్టర్ విసిట్ లు అబ్బో ఎన్నో పనులు, అదే మరి నాగరికత అంటే. ఇవన్నీ నీకు తెలియదు లే. ఇంట్లో నేలకు రంగు ముగ్గు వేస్తాము.
మీ పిచ్చి మీకు ఆనందమే పిల్లా, ముగ్గు అంటే, బియ్యపు పిండితో వేస్తే, 4 జీవులు తింటాయి అని. పేడకళ్ళు జల్లితే, పురుగులు దోమలు కీటకాలు రావు. ఇలా కరోనా బారినా పడము, లక్షలు వదిలించము, ఇంట్లో దాక్కోము.
సరే తులసమ్మ చెట్టుకు దీపం పెట్టి, గోవు కు దండం పెట్టిరా. ఓ మా మంచి బామ్మ, నువ్వుల నూనె దీపాలు ఆరొగ్యానికి మంచిదని, మేము వెలిగించడం ఎప్పుడో మానేసాము, ఇప్పుడు అంతా మైనపు దీపాలే. గోవు లు మనకు లేవు, గోశాలకు మేము వెళ్ళము, పండగ ఉంటే తప్ప. అందుకే గోవు బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము అంది మనవరాలు.
ఓరి నాయనో, ఏమి నాగరికతనో, నేలవిడిచి సాము చేయడం అంటే ఇదే, వాస్తవం విడిచి బ్రమలలో బతకడం అంటే ఇదే. వేపాకు బొగ్గు ఉప్పు ను వదిలి, ఎన్నో పేస్టులకు వచ్చాము, ఇప్పుడు వారు అవే మంచిది అని, పేస్టులలో కలుపుతున్నారు. కుంకుడుకాయలు వదిలి, షాంపులకు వచ్చాము, ఒత్తు జుత్తు పోయి, బట్టనెత్తి లేదా సగం జుట్టు మిగిలింది, ఇదే ఆరోగ్యం పతనమవుతున్న గొప్ప నాగరికత అంటూ, బామ్మ నిట్టూర్పు విడిచింది.
మరి, గతములో ఉన్న ఉత్తమ లక్షణాలను ఈ పాటలో విందామా?
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ - 2 సార్లు మొత్తము
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ||ముత్యమంతా ||
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు - 2 సార్లు మొత్తము
తీరైన సంపద ఎవరింటనుండు 2
దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు ||ముత్యమంతా ||
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు - 2 సార్లు మొత్తము
గోవు మా లక్ష్మీకి కోటి దండాలు 2
కోరినంత పాడి నిండు కడవళ్ళు .ఆ.ఆ... అఆ ||ముత్యమంతా ||
మగడు మెచ్చిన చాన కాపురం లోన
మొగలి పూల గాలి ముత్యాల వాన - 2 సార్లు మొత్తము
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం 2
ఇంటిల్లిపాదికి అంతవైభోగం ||ముత్యమంతా ||
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Actor : Sreedhar / శ్రీధర్, Actress : Sangeetha (Mutyala muggu) / సంగీత (ముత్యాల ముగ్గు), Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్, Lyrics Writer : Arudra / ఆరుద్ర, Singer : P.Suseela / పి. సుశీల, Song Category : Inspiring & Motivational Songs
Mutyala muggu - Mutyamantha Pasupu Mukhamentho Chaya - Sreedhar, Sangeetha
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,964; 104 తత్వాలు (Tatvaalu) and views 221,564 Dt : 27-Oct-2022, Upd Dt : 27-Oct-2022, Category : Songs
Views : 464
( + More Social Media views ), Id : 1600 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mutyala ,
muggu ,
mutyamantha ,
pasupu ,
mukhamentho ,
chaya ,
sreedhar ,
sangeetha ,
raogopalarao Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments