APLatestNews.com top Banner

Social Media links
దీపావళి - కన్న తల్లి పాదాలకు నువ్వుల నూనె పూసినప్పుడే, నీ పూజ అయిపోయింది - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

దీపావళి శుభకాంక్షలు, క్రిష్ణ స్నేహితుడు రాముతో తన దీపావళి పండగ గురించి చెపుతున్నారు ఇలా -

ఇక్కడ గురువు లు దీపావళి ని ఆనందంగా జరుపుతున్నారు, భారత గురువు లు జరిపారు. ఫోటో లు కూడా పంపారు, ధన్యవాదాలు. మీ(వారి) అంత చేయలేకపోయినా, ఏదో కొంచెం ఇలా ప్రయత్నము చేసాను.

ఉదయం 5 యోగా, ఆకు కూర రసం , చెంబు నీళ్ళు, . . . మిగతా మామూలే.

పొద్దున్నే 74 ఏళ్ళ అమ్మ చేతులకు, కాళ్ళ కు, మోఖానికీ నువ్వు ల నూనె పూసి, నిజమైన సజీవ లక్ష్మీ పూజ చేసాను. నేనూ ఒళ్ళంతా. నువ్వుల నూనె, చర్మ కణాలకు వేడిని ఇచ్చి, ఆరోగ్యం కలిగిస్తుంది. పేరెంట్స్ లేని వారు, భార్యకు భర్త కు, అలా చేసినా పుణ్యమే.

సున్నుపిండి కి కుదరక, బియ్యం పిండి తో వళ్ళు తోమితే, ఆహా ఆ శుభ్రత. సబ్బు పైన రాస్తాం, ఉపయోగము లేదు, కానీ పిండి బరకగా గీకుతుంది, మంచిగా మట్టిని వదిలిస్తుంది. ఆ శుభ్రం, ఆ కళ, ఆ ఆహ్లదం , మీరూ చూడాలి ప్రయత్నం చేసి.

ఈ విధంగా కనీసం పర్వదినాల్లోనైనా, అభ్యంగన స్నానాలు చేయడం వల్ల, శరీరంలో ఉండే అన్ని నాడులు ఉత్తేజితమై, వ్యక్తి చురుకుగా తయారవుతాడు.

దీపావళి అమావాస్య కు, దివిలోని పితృ దేవుళ్ళ కూడా దీప నైవేద్యం పెట్టాను. మహాలయ అమావాస్య తరువాత, ఇదే ఉత్తమము.

తులసి తల్లి కి కార్తీక దీపం. తర్వాత తల్లి ఆది లక్ష్మీ దేవిని, పద్మాసనంలో కూర్చుని, శ్రీ సూక్తం తో, అష్టోత్తరం తో, సువర్ణ మంత్రపుష్పంతో అర్చిస్తూ, పదాలను ఉచ్చారణ చేస్తూ ఉంటే, ఒంటిలో ప్రకంపనాలు వస్తాయి. కన్నీళ్లు ఆగవు. అలా అరగంట, గంట ఉచ్చరిస్తూ ఉంటే, మన నరాలలో చలనము పుట్టి, రక్తము గడ్డ కట్టకుండా పరుగులు తీస్తుంది. ఆరోగ్యముగా ఉంటుంది.

ఆ ఆనందం ఆ సంతోషం, ఎవరికి వారు అనుభవించాలి. బ్రహ్మానందము అంటే అనంతమైన ఆనందం, మన లోనే ఉంది, బయట లేదు. ఎన్నటికీ వీడదు, తరగదు, రెండవ మనిషి తో పనిలేదు. ఆహా, సర్వేశ్వరా, ఎంత బాగా జగన్నాటకం ఆడిస్తూ ఉన్నారు స్వామి? లోనకి తప్ప, అందరూ అశాశ్వతమైన ఆనందము కోసము బయటకు చూస్తారు వెతుకుతారు.

ఇంకా మంత్రాలు చదవబోతున్న ఆవేశంగా, తల్లి ఆది లక్ష్మీదేవి ఆపి, ఒరే నాయనా ఇక చాలు రా, కన్న తల్లి పాదాలకు నువ్వుల నూనె పూసినప్పుడే, నీ పూజ అయిపోయింది. కానీ శ్రీ సూక్తం వినాలని వచ్చా. బిడ్డ తప్పు ఒప్పులతో చదువుతుంటే, ఏ తల్లికి ఆనందము గా ఉండదు. మిగతావారివి కూడా వినాలి కదా.

పర్లేదు, నవగ్రహలను, నారాయణుడును, శివయ్య ను ఎవరినీ వదల లేదు. అలాగే చెయ్యి కొనసాగించు, కష్టాలు ఎదుర్కొంటూ ఉండు. వినేవారిని, మోహం నుంచి తప్పించే ప్రయత్నము చేయి, ఫలితము ఆశించకు, క్రిష్ణార్పణము అనుకో. ఉంటాను మరి అని ఇంకో ఆత్మ దగ్గరకు వెళ్ళారు. దయగల తల్లి దండ్రులు మన దేవతలు, అడగకుండానే అన్ని ఇస్తున్నారు.

మనము మొదట కృతజ్ఞతలు చూపాల్సింది మన తల్లి దండ్రులు, మన ఇంట్లో వాళ్ళ కు, మన మంచి కోరే వారిని. అది లేని నాడు, ఏ పూజా ఫలితము శూన్యము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 574 General Articles, 46 Tatvaalu
Dt : 27-Oct-2019, Upd Dt : 27-Oct-2019, Category : Devotional
Views : 186 ( + More Social Media views ), Id : 202 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : Lakshmi puja , Mother puja , abhyangana snanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content