Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. *కాశీ విశ్వనాధాష్టకమ్- గంగా తరంగ, काशी विश्वनाथाष्टकम्- गंगा तरंग, Kasi Vishwanathashtakam- ganga taranga*
కాశీకి అందరము వెళతాము, అక్కడ నుంచి రామేశ్వరానికి, మరలా ఇంకో చోటికి, చివరికి ఇంటికి. అన్ని వదిలేశావా? మొత్తము వదిలేసాను. ఏమిటి డబ్బులా, లేక నోటి మాటలా వదిలింది? అందుకే చేదు దోసకాయను ఎంత తిప్పినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్దాలలో ముంచినా, ఆ చేదు పోదు.
అలాగే మన మనసు లో ఉన్న దుమ్ము ధూళి చెడు వాసనలు పోవు. ఇంటికి రాగానే ఇంట్లో వారు, పక్కన ఇల్లు వారు, అత్త లేదా కోడలి తో తగవు.
అందుకే కాశీ పుణ్యం రావాలి అంటే, ముందు మనము మారాలి, మనసును అర్పణము చేసుకోవాలి, అరిషడ్వర్గాలను జయించాలి, అష్ట వ్యసనాలను విడవాలి, అప్పుడే ఆ పుణ్యానికి, అర్హత మనకు వస్తుంది.
కాశీకి వెళ్ళినా వస్తుంది, మనది నిర్మలమైన శుద్ద మనసు అయితే. కానీ మనకు చిత్తశుద్ది లేదు కదా? ఎక్కడకు పోయినా, మన మాటలు చేష్టలు ఆలోచనలు మారవు. కాబట్టి మార్చుకునే ప్రయత్నమే, నోటితో వాక్సుద్ది కొరకు, మంచి మాటలు, మంచి పాటలు, మంచి ఆలోచనలు. మీరు పాడి అందరికీ వినిపిస్తారు కదూ?
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||
gaṅgā taraṅga ramaṇīya jaṭā kalāpaṃ
gaurī nirantara vibhūṣita vāma bhāgaṃ
nārāyaṇa priyamanaṅga madāpahāraṃ
vārāṇasī purapatiṃ bhaja viśvanādham ॥ 1 ॥
गंगा तरंग रमणीय जटा कलापं
गौरी निरंतर विभूषित वाम भागं
नारायण प्रियमनंग मदापहारं
वाराणसी पुरपतिं भज विश्वनाधम् ॥ 1 ॥
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||
సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||
వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,961; 90 తత్వాలు (Tatvaalu) and views 175,310 Dt : 15-Sep-2022, Upd Dt : 15-Sep-2022, Category : Songs
Views : 166
( + More Social Media views ), Id : 1520 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
kasi ,
vishwanathashtakam ,
ganga ,
taranga ,
shiva Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments