27+ నిత్య శ్లోకములు దైవ శక్తి/ మనశ్శాంతి Nitya Shlokas Divine strength/ peace of mind - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,884; 104 తత్వాలు (Tatvaalu) and views 225,110.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*27+ నిత్య శ్లోకములు దైవ శక్తి మరియు మనశ్శాంతి కోసము Nitya Shlokas for Divine strength and peace of mind दिव्य शक्ति और मन की शांति के लिए नित्य श्लोक*

ఉదయం లెగిచినప్పుడు నుంచి రాత్రి పడుకునే దాకా, అందరికీ ఉపయోగ పడే చిన్న చిన్న దైవ శ్లోకాలను ఇప్పుడు విందాము, నేర్చుకుందాము, పలుకుదాము. ఉదయం నుంచి రాత్రి దాకా

Let us now listen, learn and recite simple divine hymns that are useful for everyone, from the time we get up in the morning to the time we go to bed at night.

आइए अब हम उन सरल दिव्य भजनों को सुनें, सीखें और पढ़ें जो सभी के लिए उपयोगी हैं, सुबह उठने से लेकर रात को सोने तक।

కొన్ని తప్పులు ఉండవచ్చు, దయచేసి, సరి చేసి తెలిపితే, ఇంకో వీడియో చేద్దాము. There may be some mistakes, please correct them and inform, we can make another video.

వీడియోలో, పార్ట్ 1 - 1 నుండి 13 వరకు, పార్ట్ 2 - 14 నుండి 23 వరకు, పార్ట్ 3 - 24 నుండి 27+ వరకు
Part 1 - 1 to 13, Part 2 - 14 to 23, Part 3 - 24 to 27+

01 కర దర్శన శ్లోకం - ప్రభాత శ్లోకం Kara Darshan Shlokam - Prabhata Shlokam
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి
కరమూలేతుస్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం

02 భూదేవి శ్లోకం Bhudevi Shlokam
సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

03 సుప్రభాతం Suprabhātaṁ
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్

04 స్నానం చేయునపుడు పఠించవలసిన శ్లోకం While taking bath
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

05 సూర్య నమస్కారం Surya namaskar
ఆది దేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోన్నమః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

06 తిలక/భస్మ ధారణ శ్లోకం Tilak/ bhasma dharana

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

07 దీపారాధన శ్లోకం lightning lamp Deeparadhana Shloka
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

08 ధూప మంత్రం Dhup mantra

వనస్పతి రసోపేతో గంధాజ్యో గంధ ఉత్తమః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపో్‌యం పరిగృహ్యతాం

09 ఓం కారం మూడు సార్లు 3 times omkara

10 గురు ధ్యానము Guru dhyana
గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేన్నమః

11 ఘంటానాదం GhanTa nadam
ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం
కుర్యాద్ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం

12 సంకల్పము Sankalp

ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివికమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః
ఓంహృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓంఅధోక్షజాయ నమః
ఓం నృసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః

13 విఘ్నేశ్వర ధ్యానం Vigneswara Dhyanam

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానా మేకదంత ముపాస్మహే

14 ఆంజనేయ ప్రార్ధన Hanuman Dyanam

మనోజవం మారుత తుల్యవేగం, జితేంద్రియం బుదిమతాం వాతాత్మజం
వానర యూధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసానమామి
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

ఆంజనేయ మది పాడలావనం, కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తరుమూల వాసినం, భావయామి భవమాన నందనం

యత్ర యత్ర రఘనాధ కీర్తనం, తత్ర తత్ర కృతమస్త కాంజలీం
భాష్ప వారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం

15 బ్రహ్మ ధ్యానం Brahma Dhyanam
ఓం నమస్తే సతే సర్వ లోకాశ్రయాయ, నమస్తేతే చితే విశ్వరూపాత్మకాయ
నమో ద్త్వెత తత్తావయ ముక్తి ప్రదాయ, నమో బ్రాహ్మణే వ్యాపినే నిర్గుణాయ

16 సరస్వతి ప్రార్దన Saraswati Prardhana

సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి
విదారంభం కరిష్యామి సిధిర్భవతు మే సదా
పద్మా పత్ర విశాలక్షీ పద్మకేసర వర్ణినీ
నిత్యం పద్మాలయాం దేవి సామూం పాతు సరస్వతి

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

17 విష్ణు స్తోత్రం VishNu Stotra
శాంతాకారం భుజగశయనం పద్మానాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానవనం
వందే విఘ్ణం భవ భయ హరం సర్వలోక్తెక నాధం

18 లక్ష్మి స్తోత్రం Lakshmi Stotra
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్త్రేలోక్య కుటూంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

19 శివ స్తోత్రం Shiva Stotra
వందే శంభు ముమాపతిం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భుషణం మృగధరం వందే పశునాం పతి
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం

20 పార్వతి స్తోత్రం Parvati Stotra
ఓంకార పంజర శుకీం ఉపనిష దుద్యాన కేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం

21 కృష్ణ స్తోత్రం KrishNa Stotra
వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

22 నరసింహ స్తోత్రం Narasimha Stotra
ఉగ్రం వీరం మహా విఘ్ణం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం

23 రామ స్తోత్రం Rama Stotra
శ్రీరాఘవం దశరాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం
ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షం
రామం నిశాచరం వినాశకరం నమామి

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే

24 గాయత్రి మంత్రం Gayatri mantra

ఓం భూర్భువస్సుః తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహీ దియోయోనః ప్రచోదయత్

25 నవగ్రహ ధ్యానం Navagraha Dhyanam

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః

అసతోమా సద్గమయ తమ సోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగ మాయ ఓం శాంతిః శాంతిః శాంతిః

26 ప్రాణామాయ మంత్రం PraNayaama mantram

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గ్ ం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దియోయోనః ప్రచోదయత్ ఓం మాపో జ్యోతిరసోన్ మృత బ్రహ్మ భూర్భువస్సువరోం నమో నారాయణాయ

27 మృత్యుంజయ మంత్రం Mrutyumjaya Mantra

ఓం త్రయంబకం యజా మహే
సుగంధిం పుష్ఠివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్మృక్షీయ మామృతాత్

** భోజనపూర్వ శ్లోకం Before Meals Sloka

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

** భోజనానంతర శ్లోకం After Meals Sloka
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

** నిద్రా శ్లోకం Before Sleep Sloka
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

** కార్య ప్రారంభ శ్లోకం Before Starting any program Sloka
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

** వెంకటేశ్వర శ్లోకం Venkateswara Sloka
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

** దేవీ శ్లోకమ్ Devi Sloka
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

** దక్షిణామూర్తి శ్లోకం Dakshinamurti Sloka
గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్!
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

** అపరాధ క్షమాపణ స్తోత్రం Aparadha kshamapana Stotra Forgiveness Hymn
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,884; 104 తత్వాలు (Tatvaalu) and views 225,110
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : Devotional
Views : 2033 ( + More Social Media views ), Id : 956 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , praises , prayers , recited , every day , slokam , padyam , peace of mind , Divine , strength
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content