ప్రాణం నీది, దేహం నీది, మాటే నీది, మంత్రం నీది, ఆత్మ నీది, స్రుష్టి నీది - పంచ భూతాలు మన కదలికలను - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,486; 104 తత్వాలు (Tatvaalu) and views 225,998.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏమి ఇచ్చేది అయ్యా, ఈశ్వరా పరమేశ్వరా, నీకు? ప్రాణం నీది, దేహం నీది, మాటే నీది, మంత్రం నీది, ఆత్మ నీది, స్రుష్టి నీది. బ్రతికి ఉన్న 4 రోజులు, నీ నామస్మరణ తప్ప, ఏమివ్వగలను, ఏమీ లేని, ఎవరికీ ఏమీ గాని అల్పుడను,

అంటూ మన మనస్సు, ఇష్ట దైవానికి అంకితమయినప్పుడు, ఆ భగవంతుడే, అన్నిటికి అండ.

ఐశ్వర్యం అంటే ధనం హోదా అధికారం కాదు, కేవలం మనశ్శాంతి, మానసిక బలం, ఉన్న దానితో సంత్రుప్తి, అరిషడ్ వర్గాల పై నిరంతర జయం.

కర్త కర్మ క్రియ, నేను కాదు నా స్వార్ధం కోసం కాదు, అన్ని ఆయనే ఆయన కోసమే ఆయన సంతానం కోసమే, నేను నిమిత్త మాత్రుడిని అనుకుంటే చాలు.

పిచ్చి తల్లి/ తండ్రి, మాయకు లొంగకు. మాయ, మిమ్మల్ని 5 ఏళ్ళు పైగా, వాస్తవానికి దూరంగా లాక్కుని వెళ్ళింది, ఇంకా వెళుతుంది కూడా. మంచి కి దూరంగా వెళ్ళ కూడదు, కష్టమైనా ఇబ్బంది అయినా.

ఈ రోజుల్లో ప్రాపంచిక సౌకర్యాలకు, సుఖాలకు అవసరాలకు బంధీలు అయ్యి, అహంకారముతో అరిషడ్ వర్గాలకు బానిసలై, రంగుల ప్రపంచం లో విహరిస్తూ, ఇష్టం వచ్చిన విధము గా చేస్తూ, నచ్చినట్లు ప్రవర్తిస్తూ, ఎవరినీ లెక్క చేయకుండా, పెద్దల మాట వినకుండా, మంచి కి దైవానికి దూరంగా వెళ్ళడం, సర్వ సాధారణం.

అదే కలి పురుష లక్షణం, నిరంతర మోహం లో ఉంచడం, పతనం చేయడం.

అలా వెళ్ళని వారిని చూసి, మిగతా వారు హేళన చేస్తారు, తాము మునుగుతూ కూడా.

అందుకే కరోనా ఉప జాతులు ప్రపంచాన్నే వణికిస్తున్నాయి. మంచి మాట, మానవుల మాట విననప్పుడు, ప్రక్రుతి పరమాత్మనే దోవ చూపిస్తారు, మన బుద్దులకు తగిన శిక్ష తో, ఇదే ఉదాహరణ. టీకా వేసినా, ఉపజాతుల నుంచి రక్షణ లేదు అని అంటున్నారు.

సోషల్ మీడియాలో ప్రొఫైల్ ఫోటో కనీసం దేవుడ్ని లేదా ప్రక్రుతిని పెట్టుకొండి, ఖాళీ వద్దు, నష్టం ఆపుకోండి అంటేనే, చాల మంది కి నవ్వు వచ్చింది, నమ్మకము కలగడం లేదు. 2017 లో ఆరోగ్య రక్షణ కోసం, రోగ నిరోధక శక్తి ని, పెంపుదల చేసుకోండి అని అంటే, ఇలాగే నవ్వారు.

వారిలో కొంత మంది, కరోనా ధాటికి, ఇప్పుడు భూమి పై లేరు. ఇంకొకరు పరువు ప్రతిష్టతో కోటి పోగొట్టుకుంది మీకు తెలుసు. ఇలాంటివి ఎన్నో.

మనకు ఏమీ కాదు ఎవరూ చూడరు, అడగరు అనుకుంటారు, పంచ భూతాలు ప్రతి క్షణం, మన కదలికలను గమనిస్తూ, రికార్డ్ చేస్తున్నాయి, ఫలితాలు ఇస్తాయి.

రాత గీత మారడం క్షణం. ఆ తర్వాత చిక్కుల్లో చిక్కుకుని, అల్లాడడం కూడా తప్పదు. చర్య కు ప్రతి చర్య, కర్మ కు ఫలితం తప్పదు.

నిన్న గద్దె మీద ఉండి, జనాన్ని ఊహల్లో ఉంచి, ఇష్టం వచ్చిన విధముగా, అధికారం చలాయించిన చంద్రన్న, బావురుమంటూ బిక్కు బిక్కు మంటూ, ఇప్పుడు పక్క రాష్ట్రం లో అజ్ఞాత వాసం లో ఉన్నారు.

నిన్న జైలు లో ఉన్న మరియు పక్క రాష్ట్రం లో ఉన్న జగనన్న, అద్రుష్టం వచ్చి, గద్దె ఎక్కి, ఏమేమో చేస్తున్నారు.

మరి రేపు పరిస్థితి ఏమిటో, ఎవరూ ఆలోచన చేయడం లేదు, అదే మాయ?

రామన్న, రాజన్న కధలు చూసాము, అయినా మారము.

వారే ఎవరి మాట వినరు, ఆ వ్యామోహం లో చిక్కుకుని, వాస్తవం గ్రహించలేరు.

మరి ఏమీ లేని మనం, ఎగిరెగిరి పడటం ఎందుకు, మంచికి దైవానికి దూరం ఎందుకు?

రావణుడు ఎత్తుకు వెళ్ళి రాణివాసం ఇస్తాను అంటే, అమ్మ మనసు మారిందా, లేదు? గడ్డి పరక లాగా తీసేసింది.

ఎందుకంటే అది మాయ జాలం, ఐశ్వర్యం అధికారం ఆనందం, అవి శాశ్వతం కాదు. జరిగేదంతా, భ్రమల నాటకం, దూరం గా ఉండి చూసి నవ్వుకోవాలి, దాని లో కలవకూడదు.

అందుకే నీటి లో తామర పువ్వు లాగా ఉండాలి, తాకుతూ తాకనట్లు, సంసారి అయినా, ఒంటరి అయినా.

అందరూ అంటే మాయలో ఉన్న రాక్షసులు, బతిమాలి చెప్పారు ఆశలు పెట్టారు, రారాజు తో గొడవ వద్దు అని, ఇంక బతుకు లేదు అని.

కానీ తనకు వాస్తవం తెలుసు, ఇది మాయా ప్రపంచం అని, అందులో దిగకూడదు ప్రాణం పోయినా, అని కూడా తెలుసు, అదే మానసిక బలం. అలాగే నిశ్చలము గా ఉండి, అన్ని అవమానాలను కష్టాలను దిగమింగింది, ఓర్పు గా ఉంది.

4 రోజులు ప్రదక్షిణాలు చేసావు. 5 వ రోజు మరలా మాయ కమ్మింది, వెనక్కి లాగింది ఇంకా లాగుతుంది. 5 ఏళ్ళ బురదలోనే పొర్లాడు అంది. ఈ 5 ఏళ్ళ ఫలితాలు వరుసగా వస్తాయి, మీరే భరించాలి, ఎందుకంటే అవి మీ సొంత నిర్ణయాలు, మనసా కర్మణా ఇష్టముగా చేసుకున్నవి.

వరాహం కి బురద (అదే ప్రపంచ మోహం) లో పొర్లాడటం ఎంతో చెప్పలేని ఆనందం, దాని నుంచి బయటకు రావాలంటే దానికి, ప్రాణం పోయే అంత కష్టం.

మామూలు మనిషికి అది భరించ రాని దుర్ వాసన.

వాస్తవం ఏమిటి? బురద ఎప్పటికైనా బురదే. దాన్ని ఎంత కష్టమైనా, ఏనాటికైనా వదలాల్సిందే.

భార్య, భర్త, కొడుకు, కూతురు, పదవి, ధనము, ఆస్తి, అన్ని వదలి వెళ్ళాలి కదూ, ఉత్త చేతులతో?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,486; 104 తత్వాలు (Tatvaalu) and views 225,998
Dt : 26-Jun-2021, Upd Dt : 26-Jun-2021, Category : Devotional
Views : 1060 ( + More Social Media views ), Id : 1216 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lord , shiva , god , life , body , word , mantra , soul , creation , sita , ravan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content