సాత్విక ఆధ్యాత్మిక తల్లి దండ్రులూ లేదా ఒంటరివారూ, వృద్ధాప్యంలో మన స్థానమెక్కడ ఈ 3 మార్గాల లో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,285,711; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*సాత్విక ఆధ్యాత్మిక ఆచరణ తల్లి దండ్రులూ లేదా ఒంటరివారూ, వృద్ధాప్యంలో మన స్థానమెక్కడ ఈ 3 మార్గాల లో?*

మన పూజలు పునస్కారాలు ఆచరణలో ఎంత బాగా సాగుతున్నాయో, మనకు మనమే తెలుసుకోవచ్చు, మన పిల్లల సంస్కార పెంపకములో, మనకు చిత్తశుద్ది ఉంటే, దేవునికి మన మనసు నైవేద్యముగా ఎప్పుడైనా పెట్టి ఉంటేనే సుమా.

మనము చేదు దోశకాయ సామెత గా మిగలకూడదు. మనకు పిల్లలకు 10 ఏళ్ళు వచ్చేసరికి, వారి మానసిక ఎదుగుదల, నీతి నిజాయితి దేవుని పై ప్రేమ పెద్దల పై గౌరవం సంస్కారం, అన్ని ఆచరణలో మనకు స్పష్టముగా అర్ధము అవుతాయి, మనము ద్రుతరాష్ట్ర గాంధారీలము కాకపోతే నే. వారూ పూజలు పునస్కారాలు చేసారు, కానీ ఆచరణలో అవి లేవు సుమా. వారి పిల్లలు ధర్మం వైపు లేరు, పెద్దల ను గౌరవించరు, ఎవరి మాట వినరు లెక్కచేయరు, సొంత అమ్మ నాన్న మాటనే లెక్కచేయరు.

బాల భీముడి పై సమిష్టి గా హత్యాప్రయత్నం కూడా చేసారు, ఇంకా పిచ్చి చేష్టలు ఎన్నో చేసారు. కానీ తల్లి దండ్రులు పట్టించుకోలేదు, చిన్న విషయాలు గా కొట్టి పారేసారు. ఇప్పుడు మనము కూడా 80 శాతం అలాగే నవ్వి వదిలేస్తాము, అసలు మనకు తెలీకపోవచ్చు కూడా, ఎందుకంటే పెద్దలు ఇద్దరకూ ఆస్తుల సంపాదనలో ప్రాపంచిక భోగాలతో పూర్తి బిజీ. మొక్కై వంగనిదే, మానై వంగదు అని అందరికీ తెలుసు.

అసలు పెళ్ళి పిల్లల ఉద్దేశ్యం ఏమిటి? శారీరక సుఖం, మందిని కని, భుభారం పాపం ఆస్తులు పెంచడమా?

సంస్కారం గల గురువులు పెద్దలు నిర్ణయించిన సీతా రాములు లా గుణ ప్రధాన పెళ్ళి తో, అరిషడ్వర్గాలను జయిస్తూ, కేవలము ఉత్తమ సంస్కార గుణవంతులైన పిల్లలు ను కని, వంశాభివ్రుద్ది చేసి, లోకములో మంచి పెంచుతూ, భూభారాన్ని పాపాన్ని తగ్గించాలి, ముక్తి వైపు అడుగులు వేయాలి. ప్రేమ పెళ్ళి అయినా, తమ గుణాలతో, పెద్దలను ఒప్పించాలి, బెదిరించి లేదా పారిపోయి కాదు.

కౌరవ సంతానాన్ని కంటే పిల్లలకు, అలాగే తల్లి దండ్రూలకు కూడా, పాప భారం పెరుగుతుంది. అందువలనే వందల కష్టాలు జీవితములో, మనశ్శాంతి ఉండదు, ఒంటరితనం వ్రుద్దాప్యములో. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు.

తల్లి దండ్రులకు ఖచ్చితము గా తెలుసు, తమది పాండవ లేక కౌరవ సంతానమా అని వారు ఆచరణ భక్తిలో ఉంటే నే సుమా.

ఒంటరి వారి కింద, అసలు పెళ్ళి కాని వారు, విడాకులైన వారు, లేదా తర్వాత ఒకరు గతించి న వారు, పిల్లలు లేని వారు కూడా వస్తారు. వారికైనా అరిషడ్వర్గాల సాధన లేదా బానిసత్వం ఉంటాయి కదా.

కాబట్టి మనము మాయలో లేకపోతే, మన స్ధిరమైన జవాబు ఏది? ఇన్నాళ్లు సంస్కార దైవ పూజ గుణ పెంపకంలో, ధైర్యంగా మనస్ఫూర్తిగా దేవుని కి చెప్పగలిగింది, వృద్ధాప్యంలో మనం ఎక్కడ ఉంటాము? 30 ఏళ్ళు దాటిన, ప్రతి ఒకరూ చెప్పాలి. పిల్లలు లేని వారు కూడా, ఈ 3 మార్గాల లోకే వస్తారు.

Mom n Dad, after 60 you are like our 6 yr old kids, we have samskar gratitude - Our kids will tell this and take care us, Correct?
అమ్మా నాన్న 60 తర్వాత, మీరు మాకు 6 ఏళ్ళ పసిబిడ్డలు, మాకు సంస్కారం క్రుతజ్ఞత ఉంది, అంటారు మనల్ని జాగ్రత్తగా చూస్తారు కదూ మన పిల్లలూ?

1. *సంస్కార గుణ సంతానం తో ఉంటాము* - మనము పెంచిన సంస్కార ఉత్తమ సంతానం తో, వారి ఇంట్లో నే వారితో లేదా మనుమలతో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, గౌరవ ప్రదము గా ఉంటాము. మన ఇంట్లో ధనం కు విలువ లేదు, కేవలం గుణం మాత్రమే అని అందరికి చెపుతారు. మా పెళ్ళిళ్ళు తర్వాత నడవడిక సాత్విక గుణ ప్రధానమైనవి, మా ముదుసలి తల్లి దండ్రులు మాతోనే ఆనందముగా, చివరి నిమిషము వరకు తిరిగారు, ఉన్నారు అంటారు. ఇదుగో ఉదాహరణ లు అని చూపిస్తారు.

వీరికి, వీరి పిల్లలకు, అరిషడ్వర్గాల బానిసత్వం, 0-25 శాతం కన్నా తక్కువ ఉంటుంది. ప్రాపంచిక మాయకు దూరముగా ఉంటారు. కష్టాలు సుఖాలు సమం వీరికి, నవ్వుతూ ఆస్వాదిస్తారు. అందరి కష్టాలు వింటారు, వీలైనంత సహాయం చేస్తారు. వీరికి పిల్లల వలన, కలిగే పాప శాతం 0-25 లోపే ఉంటుంది.

ఒంటరివారు గుణ ప్రధాన వారి పైనే ఆధారపడతారు, వారు గుణ సంపన్నులు అయితే.

2. *ప్రాపంచిక మోహ సంతానం తో ఉంటాము* - మా సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత లేని సంతానం కు పెంపకముకు, ధనం ఆస్తి హోదా పదవి అన్ని భేషరుతు గా సమర్పించి, వారిని ఇంకా బలవంతులను చేసి, ప్రేమ అండ గౌరవము కొనుక్కుని, వారి పక్కన లేదా దగ్గర లేదా అందుబాటు ఊళ్ళో ఇంట్లో ఉంటాము. పూజలు పునస్కారాలు అన్ని చేస్తారు, కానీ ఆచరణలో ఉండదు.

వయస్సు ఉడిగిన తర్వాత లేదా కాళ్ళు చేతులు కదలని పరిస్తితిలో, వారే మిగతా మొత్తము లాక్కుంటారు, విలువలకు చోటు లేదు, కేవలం అవసరాలు అవకాశాలు ముఖ్యం, ఏనాటికైనా పతనమే, అవమానమే, ఒంటరి తనమే. దీనికి మేము సిద్దమే, ఎందుకంటే మా తల్లి దండ్రులను ఇలాగే వదిలేసాము అని గర్వముగా చెపుతారు.

ఆస్తులు పిల్లలకు ఇచ్చి, ఒంటరిగా దూరంగా ఉండే వారూ ఇదే 2 వ కాటగిరీలో నే ఉంటారు, ఎందుకంటే వారు మోహ బుద్దులై, తప్పుడు పిల్లలకు ఆస్తి ఇచ్చినప్పుడు పాపం పెంచినప్పుడు, ఇంక వారిలో ధర్మము పశ్చాత్తాపము ఎక్కడ ఉంది, దూరంగా ఎందుకు ఉండాలి, శిక్ష ఎటూ తప్పించుకోలేరు, దూరంగా ఉన్నా తేడా ఏముంది?

వీరికి వీరి పిల్లలకు అరిషడ్వర్గాల బానిసత్వం, 50-100 శాతం ఉంటుంది. ప్రాపంచిక మాయలోనే ఉంటారు. కష్టాలు లో నలిగిపోతారు కుంగిపోతారు పతనం అవుతారు, సుఖాలు లో తేలిపోతారు. వీరికి పిల్లల వలన, కలిగే పాప శాతం 50-100 ఉంటుంది. వీరి స్వార్ధ పిల్లల వలన భాగస్వామి అలాగే ఇతరులు ఇబ్బందులు పడతారు.

ఒంటరివారు ప్రాపంచిక మోహ వారిపైనే ఆధారపడతారు, వారు ప్రాపంచిక మోహ సంపన్నులు అయితే.

3. *ప్రాపంచిక మోహ సంతానం తో ఉండము* - మా సంస్కారం లేని పిల్లల ను నమ్మను, మా పాపం పెంచుకోము, ఆస్తి ఇచ్చి భస్మాసురులను బలవంతులు చేయము, మమ్మల్ని నాశనం చేసినట్లే ఇతరులను చేస్తారు. మా జీవితం వృధా అయ్యింది, ఖర్మ ఫలితాలు అనుభవిస్తాము, పశ్చాత్తాపము తో పాప ప్రక్షాళన చేసుకుంటాము. ఒంటరిగా ఇంట్లో లేదా అనాధాశ్రమంలో లేదా మంచి వారితో ఉంటాము. మమ్మల్ని మేము సరి చేసుకుంటాము.

వీరికి అరిషడ్వర్గాల బానిసత్వం, 50 శాతం కు అటు ఇటు ఉంటుంది. ప్రాపంచిక మాయలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం తీవ్రముగా చేస్తారు. వీరికి పిల్లల వలన, కలిగే పాప శాతం తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. తమ తప్పులు అన్ని అందరికి చెప్పి, మీరూ మాలాగే మోహములో పతనం కావద్దు అని వేడుకుంటారు.

ఒంటరివారు అరిషడ్వర్గాల బానిసత్వం ను వదిలించుకుని, తమ మోక్షసాధనకై ఒంటరిగా ప్రయత్నం చేస్తుంటారు.

దయచేసి మన ఉత్తమ దేవుళ్ళు స్నేహితులు బంధువులు, అందరి ముందు ధైర్యంగా చెప్పుకుందాము, మన తప్పుల్ని మనమే సరిచేసుకుందాము, ఆత్మ శుద్ది తో. రాబోయే పాపాలు కష్టాలు కన్నీళ్ళు ముందే జాగ్రత్తలతో తగ్గించుకుందాము, ఉత్తమ జన్మలకై దేవుని త్రికరణ శుద్ది గా ప్రార్ధన చేద్దాము, ఆచరణ లో.

మనసు బుద్ది మారనిదే మార్చుకోనిదే, మన పాపము తగ్గదు, ఎన్ని పూజలు యాగాలు వ్రతాలు చేసినా కూడా. బొగ్గును ఎంత రుద్దినా నలుపే, కుక్క తోక వంకరే.

Sattvic spiritual practice parents or singles, where is our place in these 3 arishadvarg traditional ways in oldage  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,285,711; 90 తత్వాలు (Tatvaalu) and views 176,088
Dt : 26-Jun-2022, Upd Dt : 26-Jun-2022, Category : General
Views : 352 ( + More Social Media views ), Id : 1442 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sattvic , spiritual , practice , parents , singles , arishadvarg , ways , old , age
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content