ఆదాయం లేక, ప్రభుత్వ స్ధలాలు అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా, అభివృద్ధి ఎలా? గమ్ముగా? నాయకుల ప్రశ్నలు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1241 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1271 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఆదాయం లేనప్పుడు, ప్రభుత్వ స్ధలాలు అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా, అభివృద్ధి ఎలా? గమ్ముగా ఉండమంటారా? తెలుగు నాయకుల ప్రశ్నలు

అబ్బబ్బా ఏమి చెప్తిరి నాయకా ఏమి చెప్తిరి, ఎన్నాళ్ళీ మోసపు మాయ మాటలు. మన వంశాలు, మన గత అధికారము పోయిన, పాత నాయకులను చూసి కూడా, మనము మన అబద్దాలకు సాన పట్టము కదా, పిచ్చి జనాల దగ్గర?

అవన్నీ అమ్మి తాకట్టు పెడితే, మీ లాంటి అనుభవజ్ఞులు ఎందుకు? కొత్త గా వచ్చే మూడవ నాలగవ ఐదవ కుటుంబము, మామూలు మనుషులు అభివ్రుద్ది చేయలేరా? ధనము పంచలేరా విచ్చలవిడిగా? దానికి తండ్రులు మామలు వంశాలు అనుభవం ఎందుకు?

ఆ విధముగా అమ్మి తాకట్టు పెట్టి, అబద్దపు అభివ్రుద్ది చూపిస్తున్నా, మన స్వదేసీ విదేశీ చెంచాలు మరియు అనుచరులు, మన కోసం తమ కుటుంబాలను నాశనం చేసుకుంటూ, ఎలుగెత్తి పొగుడుతూనే ఉంటారు, ఇంకా పతనమై, కరోనాల పరంపర వచ్చిందాకా? రామ రామా.

మేము అవసరానికి ఓటు అమ్ముకున్నాము అనుకున్నా, మా నాయకులు మాత్రం నీతి మంతులుగా ఉండాలి అనుకోవడం తప్పా? లేక రాక్షసులకు రాక్షస రాజే వస్తాడు రాక్షసులనే ఎన్నుకుంటాము, అనడం కరెక్టా?

40 ఏళ్ళ అనుభవము, తండ్రులు మామలు నాయకులుగా అనుభవము ఉండి, మాట తిప్పము మడమ తిప్పము, నాయకులను తయారు చేస్తాము, పారదర్శకత, విశ్వసనీయత ఉంది అని, ఉత్తుత్తి అబద్దాలు చెప్పడము ఎందుకు?

ఎలక్షన్ లో నే, ధైర్యముగా, ప్రతి నాయకుడు కూడా, ఉన్నది ఉన్నట్లు గా ఇలా చెప్పినా కూడా - మీ పై అధిక పన్నులు వేసి, మీతో ఎక్కువ మందు తాగించి చెడిపోయే వినోదం పంచి, మీ అందరికి చెందిన ప్రభుత్వ భూమిని, విదేశీ లేదా స్వదేశీ పెట్టుబడి దారులకు తాకట్టు పెట్టి లేదా అమ్మి లేదా లీజుకు ఇచ్చి లేదా ఆక్రమించి, మిమ్మల్ని బాగు చేస్తూ ఉన్నట్లు నమ్మించి మేము బాగుపడుతాము, ఇతర ఆదాయ మార్గాలు పెంచే తెలివి తేటలు మాకు వంశ పారంపర్యముగా లేవు, మా కంపనీ ఆదాయాలు పెంచిన విధం గా రాష్ట్ర ఆదాయం పెంచలేని అసమర్ధులము అంటే, మేము ఎటూ ఏదో ఒకదానికి అమ్ముడుపోయి ఓటు వేస్తాము అనే స్వచ్చమైన అనుచరులు ఉన్నారు కదా?

ఇంక భయం ఎందుకు? అబద్దపు పాపము ఎందుకు మనకు? మన వెంట గొర్రెలు ఉన్నంత కాలం, అబద్దాల మీడియా ఉన్నంతకాలం, మనల్ని ఆపేది ఎవరు నాయకా?

ప్రజలమైన మేము కూడా, నాయకులారా, ప్రభుత్వ ఆస్తులు అమ్మకము తాకట్టు పెట్టే ముందర, మీరు మీ వాగ్ధానాల అమలు కొరకు, మొదటి ఆదాయ మార్గముగా, మొన్న ఎలక్షన్ అఫ్ఫిడవిట్ లో ప్రతి ఎమ్మెల్యే ఎంపీ లకు చూపిన ఆస్థి మరియు ధనములో ముందుగా, సగ భాగము ప్రభుత్వానికి ఇచ్చి, నాయకుల స్థలాలను కంపెనీలను తాకట్టు పెట్టి, ఆ తర్వాత చాలవు కాబట్టి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు అమ్మకాలకు పెడితే బాగుంటుంది అని అడగలేమా? బానిసత్వము వీడలేమా? అభివ్రుద్ది, ప్రజలకోసం ప్రాణాలు ఇచ్చే నాయకుల ఆస్తులనుంచి, పొందలేమా? అని సామాన్యుడు అడగలేక, టీవీ ల మందుల మత్తులో కొట్టు మిట్టాడుతూ ఉన్నంత కాలం, మన అభివ్రుద్ది శూన్యం.

నాయకుల మాటలు కోటలు, వారి ఆస్తులు బారెడు, ప్రభుత్వ ప్రజల ఆస్తి అమ్మకాలతో మూరెడు. మనకు మనమే నాశనుము చేసుకుంటున్న ప్రజాస్వామ్యం. ఆ పాపము మనదే అని అందరము ఎప్పుడు బాధ్యత గల మనుషులుగా ఆలోచన చేస్తాము దేవా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1271 General Articles, 47 Tatvaalu
Dt : 27-Jun-2021, Upd Dt : 27-Jun-2021, Category : Politics
Views : 168 ( + More Social Media views ), Id : 1218 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ycp , tdp , income , develop , sell , mortgage , govt , lands , telugu , leaders , kcr , pavan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content