Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Andala Aparanji Bomma(Original, Parody), Ghatothkachudu, Ali, Roja, Kaikala Satyanarayana
కన్న తల్లిని కోల్పోయిన, ఓ పసిపాప ఆవేదనను తగ్గించి, బుజ్జగించడానికి తాను చేస్తున్న ప్రయత్నము చూడండి. సంస్కార తల్లి, తన పిల్లల గురిచి, ఎంత చక్కగా ఆలోచన చేస్తుందో, ఈ అసలు పాటలో వినండి, అలాగే పాడండి.
ఆకలందంటే, ఆ చిన్ని బొజ్జ అడగకుండానే, తెలుసుకోమంది. ఆటాడుకోగా, తోడెవ్వరంటే, అంబారి కట్టి, ఆడించమంది. అయ్యో, మాకు 2 ఉద్యోగాలు, సోషల్ మీడియా, ఓటీటీ సినిమాలు ఉంటే, అదెలా కుదురుతుంది, ఆయాలను అమ్మ అత్త డేకేర్ మనుషులను పెట్టాము కదా. మా కడుపున పుట్టిన వారికి, ఆ మాత్రం అండ చాలదా, మేము ఇంట్లో కూర్చోవాలంటే ఏలా? మా ఆనందాలు, మా ఆస్తులు అనే వారు ఉన్నారు.
మన్నించాలి, ఇది 1995 లో పాట. ఇప్పుడు ఎంతో ఎదిగాము, తొందరగా పతనం కావాలని, ప్రేమ క్రుతజ్ఞత విశ్వసనీయత అనేవి, సొంత ముదుసలి తల్లి దండ్రి మీదే లేనప్పుడు, పుట్టిన పిల్లల మీద ఉంటాయా అంటే, అలాంటి పిచ్చి వారే నమ్ముతారు కదూ?
మరి ఇంక, పేరడీ ఎవరి మీద? భర్తను పోగొట్టుకుని, ఒంటరిగా ఉన్న ముదుసలి సంస్కార తల్లి కి ధైర్యం చెపుతూ, తన కొడుకు ప్రేమగా పాడే పాట అది. మనకు తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నా, అందులో తండ్రి/ తల్లి బదులు, తాత నానమ్మ అమ్మమ్మ అని పెట్టి పాడుకోవచ్చును.
సంస్కార మముకన్న అమ్మ, నాన్న లేడన్టూ బెంగ పడకమ్మ, ప్రేమార నిను కన్న అయ్య,
చూడలేడమ్మ నీకంట చెమ్మ, తను మరుగునున్న, నిను మరువడమ్మ. మీరూ పాడి, ముదుసలి అమ్మ నాన్న లకు మానసిక సంతోషమును ఇచ్చి, రోజూ చేయిపట్టుకుని కమ్మటి మాటలను చెపుతూ, ఓ కిలోమీటర్ లేదా మైలు నడిపిస్తారు కదూ, వారి భౌతిక ఆరోగ్య క్షేమం కోసం.
మాటాడుకోగా తోడెవ్వరంటే, నీచేయి పట్టి నడిపించమనే, కాపాడుకుంటా కనుపాపలాగా, నిను చూసుకుంటా మా నాన్న లాగా, నమ్మమ్మ నా మాట, సంస్కార మముకన్న అమ్మ, నాన్న లేడన్టూ బెంగ పడకమ్మ అని అమ్మకు ధైర్య ఇద్దామా ఇంట్లో మనతో సమాన వైద్య మరియు ఇతర సౌకర్యాలు ఇస్తూ, రోజూ చేయి పట్టుకుని ప్రేమగా మాట్లాడి నవ్విస్తూ?
Original అసలు
స్వర్గాన ఉన్న మాతా
నీ స్వరం వినాలని తపిస్తుంది, నీ కూన
నీ మాటగా, నేను చెప్పేదా తల్లి
ఆహ! దివ్యోపదేశం, దివ్యోపదేశం, మాతా
చెప్పు అంకుల్
అమ్మ ఏం చెప్పిందో చెప్పు
చెప్పవా, చెప్పవా?
చెప్పు, చెప్పు
చెప్ప్తాను తల్లి, చెబుతా
అందాల అపరంజి బొమ్మ
అమ్మ ఏదంటూ బెంగ పడకమ్మ
కడుపార, నిను కన్న, అమ్మ
చూడలేదమ్మ, నీకంట, చెమ్మ
తను మరుగునున్న, నిను మరువదమ్మ
కన్నీరు తుడిచే, కబురంపెనమ్మ
చెబుతాను, వినవమ్మ ||అందాల||
ఆకలందంటే, ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే, తెలుసుకోమంది
ఆటాడుకోగా, తోడెవ్వరంటే
అంబారి కట్టి, ఆడించమంది
నీకేం కా.వా.లన్నా.., నాకు చెపుతూ. ఉంటా.నంది
తానే. లోకా.నున్న, ని.న్ను చూ.స్తూ ఉంటా.నంది
కాపాడుకుంటా, కనుపాపలాగా
నిను చూసుకుంటా, మీ అమ్మలాగా
నమ్మమ్మ, నా మా.ట ||అందాల||
మావయ్యనంటూ, నిన్ను చెరమన్ది
మంచి మాటలతో, మరిపించమంది
కథలెన్నో చెప్పి, నవ్వించమంది
ఒడిలోన చేర్చి, వోదార్చమంది
జో జో పాపా అంటూ, తాను రోజు పాడే లాలి
ఇట్టా. పాడాలంటూ, నాకు తానే నేర్పింది తల్లి
మా పాపనెపుడు, కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి, దీవెనలు తెచ్చే, పని మీద వెళ్ళింది ||అందాల||
Parody పేరడీ
స్వర్గాన ఉన్న పితా
మీ స్వరం వినాలని తపిస్తుంది, మా అమ్మ
మీ మాటగా, నేను చెప్పేదా తండ్రి
ఆహ! దివ్యోపదేశం, దివ్యోపదేశం, పితా
చెప్పు బిడ్డా
నాన్న ఏం చెప్పారో చెప్పు
చెప్పవా, చెప్పవా?
చెప్పు, చెప్పు
చెప్ప్తాను తల్లి, చెబుతా
సంస్కార మముకన్న అమ్మ
నాన్న లేడన్టూ బెంగ పడకమ్మ
ప్రేమార, నిను కన్న, అయ్య
చూడలేడమ్మ, నీకంట, చెమ్మ
తను మరుగునున్న, నిను మరువడమ్మ
కన్నీరు తుడిచే, కబురంపెనమ్మ
చెబుతాను, వినవమ్మ ||సంస్కార ||
ఆకలందంటే, ఆ చిన్ని బొజ్జ
అడగకుండానే, తెలుసుకోమనే
మాటాడుకోగా, తోడెవ్వరంటే
నీచేయి పట్టి, నడిపించమనే
నీకేం కా.వా.లన్నా.., నాకు చెపుతూ. ఉంటా.ననే
తానే. లోకా.నున్న, ని.న్ను చూ.స్తూ ఉంటా.ననే
కాపాడుకుంటా, కనుపాపలాగా
నిను చూసుకుంటా, మా నాన్న లాగా
నమ్మమ్మ, నా మా.ట ||సంస్కార ||
కన్నతండ్రిలాగా, నిన్ను చూడమనే
మంచి మాటలతో, మరిపించమనే
కథలెన్నో చెప్పి, నవ్వించమనే
ఒడిలోన చేర్చి, వోదార్చమనే
జో జో తల్లి అంటూ, తాను రోజు పాడే లాలి
ఇట్టా. పాడాలంటూ, నాకు తానే నేర్పేను తల్లి
మా అమ్మనెపుడు, కాపాడమంటూ
దేవుణ్ణి అడిగి, దీవెనలు తెచ్చే, పని మీద వెళ్ళేను ||సంస్కార ||
మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.
Starring: Ali, Roja, Kaikala Satyanarayana; Music : Sv Krishna Reddy; Lyrics-Sirivennela; Singers :Sp Balu 1995
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,282; 104 తత్వాలు (Tatvaalu) and views 226,421 Dt : 25-Jun-2023, Upd Dt : 25-Jun-2023, Category : Songs
Views : 535
( + More Social Media views ), Id : 1817 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Andala ,
Aparanji ,
Bomma ,
Ghatothkachudu ,
Ali ,
Roja ,
Kaikala ,
Satyanarayana Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments