పాటతో పరమార్ధం- ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా- అమ్మ రాజీనామా- శారద, దాసరి, సత్యనారాయణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1913 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1948 General Articles and views 1,573,304; 97 తత్వాలు (Tatvaalu) and views 198,534.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Evaru Rayagalaru Amma Anu Matakana - Amma Rajinama - Sharada, Dasari, Satyanarayana

Who can write Poetry, better than the words of mother?
Who can sing, a tune sweeter than Mother ragam?

అమ్మ కన్నా, కమ్మని కావ్యం లేదు. అమ్మ అను, రాగంకన్నా తీయ్యని రాగం కూడా లేదు. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి అని అందరికీ తెలుసు. అమ్మేగా, ఆదిస్వరం, ప్రాణమనే పాటకి ఇది అందరికీ తెలుసు. సినిమా గాయకులు ఎందరో పాడారు, సినిమాలో అలాగే స్టేజీల మీద, తర్వాత మరచిపోయారు.

మరి ఆ అమ్మ భాషలో, మన సొంత ముదుసలి అమ్మను గౌరవించి, తెలుగు రోజూ ఎంత రాస్తున్నాము? మన పిల్లలకు నేర్పుతున్నాము? ఆ అమ్మ కు తెలుగు పద్యాలు పాటలతో దగ్గర ఉంచి, ఎన్ని సార్లు ఎన్ని ఏళ్ళు లాలి పాడాము, కన్నీళ్ళు తుడిచాము, నోట ముద్ద పెట్టాము బిళ్ళలు వేసాము, రాత్రి అంతా మేల్కొని తోడు ఉన్నాము, కాళ్ళకి బూట్లు తొడిగాము, మైలు నడిపించాము, మంచం మీదవి ఎత్తి పోసాము, పాదాలకు నమస్కరించాము? ఎవ్వరూ చెప్పరు. అందుకే చిత్త శుద్ది లేని శివ పూజ లేలరా అన్నది.

అవతార మూర్తి అయినా, అణువంతే పుడతాడు కదూ? 9 నెలలు, అమ్మ పేగు పంచుకునే, అంతవాడు అవుతాడు కదూ? అమ్మేగా చిరునామా, ఎంతటి ఘన, చరితకి, ఎవరమూ కాదనలేము? అమ్మేగా కనగలదు, అంత గొప్ప అమ్మని, ఇదీ నిజం కూడా?

మరి ఎంత మంది కూతుళ్ళు, తమ ముదుసలి అమ్మలకు, కనీసం అత్తలకు సేవ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడ నుంచి కన్నామో, ఎందుకు మరుస్తున్నారు? కూతురు/ కోడలే ఇవి మరిస్తే, ఇంక పిల్లలకు క్రుతజ్ఞతలు విశ్వసనీయత సంస్కారం ఎలా నేర్పగలము? మహిళకు మహిళే శత్రువు కాదా, కూతురు/ కోడలు అయినా? ఇంక మనకు సహనం ఓపిక ఓదార్పు మనశ్శాంతి ఎందుకు ఉంటాయి? అవి ఇతరులకు ఇవ్వగలమా, నేర్పగలమా?

శ్రీరామరక్ష అంటూ, నీళ్ళుపోసి పెంచింది నిజం. మరి ముదుసలి తనం లో, నోట్లో ముద్ద నీరు పోస్తున్నామా? దీర్గాయురస్తూ అంటూ, నిత్యం దీవించింది, మరి మనం అమ్మా ఇంకా 10 ఏళ్ళు నాతో బతుకమ్మా అని ఎప్పుడైనా 5 ఏళ్ళు సేవ చేసామా? నూరేళ్ళు ఎదిగే బ్రతుకు, అమ్మ చేతి నీళ్ళతో, నడక నేర్చుకుంది, బ్రతుకు, అమ్మ చేతి వేళ్ళతో - మరి అదే నడకకు మనము కర్రగా, తను తూలిపడే వయసులో ఉన్నామా?

ఇంక మన కన్నా విశ్వాసఘాతకులు ఎవరు? జంతువులు మనకన్నా నయం కదూ? ఇంటి పిల్లల కన్నా, విశ్వాసం ఉన్న కుక్క నయమని ఏదో సినిమాలో పాడారు కదూ? పంచభూతాల శిక్షణతో నే మనకు బుద్ది వస్తుంది. కాని అప్పటికి అమ్మ నాన్న ఉండకపోవచ్చు, అంటే పాప పరిహారం లేదు. మరు జన్మ, చాలా భయంకరముగా ఉంటుంది, రోడ్డ్ మీద నుంచి ఎదగాలి పైసా పైసా చేయి చాస్తూ, నమ్మకం విశ్వసనీయత క్రుతజ్ఞత నేర్చుకుంటూ.

కఠోర వాస్తవాలు కేవలం ఆత్మ జ్ఞాన గురువు, శిష్యుడు మాత్రమే చెపుతారు, ప్రాపంచిక బ్రమలనుంచి బయటకు తెచ్చి, జ్ఞాన దోవను చూపడానికి.

ఎవరు రాయగలరు.., అమ్మ అను, మాటకన్నా, కమ్మని కా.వ్యం.
ఎవరు పాడగలరు.., అమ్మ అను, రాగంకన్నా తీయ్యని రా.గం,
అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా, ఆదిస్వరం, ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు, అమ్మ అను, మాటకన్నా, కమ్మని కా.వ్యం.
ఎవరు పాడగలరు, అమ్మ అను, రాగంకన్నా తీయ్యని రా.గం,

అవతార మూర్తి అయినా.., అణువంతే పుడతాడు..
అమ్మ పేగు పంచుకునే.., అంతవాడు అవుతాడు.
అవతార మూర్తి అయినా, అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే, అంతవాడు అవుతాడు
అమ్మేగా.. అమ్మేగా చిరునామా, ఎంతటి ఘన, చరితకి
అమ్మేగా కనగలదు, అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు, అమ్మ అను, మాటకన్నా, కమ్మని కా.వ్యం.
ఎవరు పాడగలరు, అమ్మ అను, రాగంకన్నా తీయ్యని రా.గం,

శ్రీరామరక్ష అంటూ.., నీళ్ళుపోసి పెంచింది..
దీర్గాయురస్తూ అంటూ.., నిత్యం దీవించింది..
శ్రీరామరక్ష అంటూ, నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ, నిత్యం దీవించింది
నూరేళ్ళు.., నూరేళ్ళు ఎదిగే బ్రతుకు, అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది, బ్రతుకు, అమ్మ చేతి వేళ్ళతో

ఎవరు రాయగలరు, అమ్మ అను, మాటకన్నా, కమ్మని కా.వ్యం.
ఎవరు పాడగలరు, అమ్మ అను, రాగంకన్నా తీయ్యని రా.గం,
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా, ఆదిస్వరం, ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు, అమ్మ అను, మాటకన్నా, కమ్మని కా.వ్యం.
ఎవరు పాడగలరు, అమ్మ అను, రాగంకన్నా తీయ్యని రా.గం,

Movie : Amma Rajinama(అమ్మ రాజీనామా)(1991)
Cast : Sharada, Dasari, Satyanarayana శారద, దాసరి, సత్యనారాయణ
Music : Chakravarthy ; Director : Dasari Narayana Rao ; Producer : K Leela Prasad ; Song Lyric: evaru rAyagalarU ; Lyricist : Sirivennala  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,573,304; 97 తత్వాలు (Tatvaalu) and views 198,534
Dt : 22-May-2023, Upd Dt : 22-May-2023, Category : Songs
Views : 189 ( + More Social Media views ), Id : 1758 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Evaru , Rayagalaru , Amma , Matakana , Rajinama , Sharada , Dasari , Satyanarayana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content