Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కరోనా కోవిడ్ 19 లో భాగంగా, మార్చి 23 నుండి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి, వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధి లోని, ప్రజల కదలికలను నిలువరించుటకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూ, విధులు నిర్వర్తిస్తూ ఉన్న వేటపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఈ రోజు చీరాల డీఎస్పీ వై. జయ రామ సుబ్బా రెడ్డి గారు, వేటపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించి లాక్ డౌన్ అమలు తీరును పరిశిలించి, నియమాలు ఖచ్చితంగా అమలు జరుగుటకు, పలు సూచనలతో కూడిన ఆదేశాలను జారి చేసారు.
అలానే ప్రజలందరూ కూడా స్వచ్చంధముగా, స్వీయ క్రమ శిక్షణతో, పోలిస్ కు సహకరించి, మే 3 వరకు ఇండ్ల కే పరిమితం కావాలని కోరారు. గత 25 రోజులుగా కుటుంబాలకు దూరంగా ఉంటూ, 24 గంటలు లాక్ డౌన్ విధులలో పాల్గొంటున్న, వేటపాలెం పోలీస్ సిబ్బంది, హోంగౌర్డ్ నుండి ఏఎస్సై స్ధాయి వరకు మరియు గ్రామ మహిళా పోలీస్ సిబ్బందికి, మొత్తం 55 మందికి ఒక్కొకరికి 25 కిలోల బియ్యం, 1 కేజీ కంది పప్పు, ఒక పాకెట్ వంట నూనె, రెండు కేజీల ఉల్లి పాయలు మరియు కూరగాయలను అందచేసారు.
ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మరియు వేటపాలెం ఎస్సై అజయ్ బాబు గారు పాల్గొన్నారు. డీఎస్పీ గారు సమావేశంలో మాట్లాడుతూ, సహకరించిన దాతలు అందరిని అభినందిన్చినారు.
Photo/ Video/ Text Credit : Koti Veeraiah Ch., Vetapalem
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1725 General Articles, 86 Tatvaalu కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments