Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Heard Chinna Jeeyar Swamy controversy? opinion about village deities and Jagadguru.
జవాబు - మనకు చేతగాని మంచి పనులు చేస్తున్న ఎవరు అయినా, ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తే లేదా లేని తప్పును కల్పించి, అది బూతద్దములో చూపించి, దాని గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం, పెడర్ధాలు తీయడం, అసూయతో మనము అందరమూ చేస్తున్నాము.
ప్రాపంచిక సుఖాలకు అరిషడ్వర్గాలకు బానిసలము అయిన మనము, మంచిని మన చేతులతో అసలు చేయము, మంచిని ప్రోత్సాహం చేయము, ఇంకొకరు చేస్తే సహించము.
ఇది కలి ప్రభావము, కల్లోల మనసుల బలహీన ఆరోపణలు. ఎందుకంటే మనము నీతి నియమాలను సాంప్రదాయ పద్దతి పాటించము, అంత ఓపిక సహనము లేదు, ఇంకొకరు పాటిస్తే సహించము భరించలేము.
వారిని కూడా, మనలాగే చెడ్డ వారిగా నిరూపించినదాకా, నిద్రపోము. అలాంటి అసూయ హ్రుదయాలకు, బుద్ది జ్ఞానం, కాలం మరియు వారి వారసులే చెపుతారు సుమా.
ఉదాహరణకు మనమే ఒక మాట జారాము లేదా తప్పు చేసాము అనుకోండి, మన గురువుల నుంచే, చూడండి ఎన్ని నీతులు చెప్పాడో, ఇప్పుడు ఇలా నోరు జారారు లేదా తప్పుడు పనులు చేసారు అని నన్ను కూడా అనడానికి, కౌరవులు కొంత మంది రెడీ గా ఉంటారు.
అంటే ఆ ఒక్క మాటతో లేదా తప్పు తో, 128 వారాల 108 ప్రదక్షిణలు, 8 యేళ్ళ సజీవ గురువు సేవ మరియు ఆరోగ్య రక్షణ ఉత్తమ వైద్యం తో, 24 నెలలు ప్రతినెలా గుండు, 20 ఏళ్ళ నేల చాప నిద్ర, యోగా, ధ్యానం, చాంటింగ్ మరియు ఇంటి శాఖాహారము, 2 ఏళ్ళ అమ్మ పాద పూజ, అన్ని అబద్దాలు అవుతాయా?
ఇవన్నీ అందరమూ చేయగలమా? కనీసం 20 నెలలు నేల చాప నిద్ర చేయగలమా, ఇంటి శాఖాహారము మాత్రమే తినగలమా?
1. జగద్గురువు గురించి - మనుషులలో జగద్గురువు అంటే, కేవలం ఆది శంకరులు మాత్రమే. ఎందుకంటే భారత దేశాన్ని కాలి నడకతో 3 సార్లు పర్యటించి, అందరూ మేధావులతో వాదించి మెప్పించి, ఆయన పీఠాన్ని అధిరోహించారు. ఇది జగమెరిగిన సత్యం.
జీయరు స్వామి గారు, తమ గురువులు రామానుజులు గురించి ఏమైనా చెప్పుకోవచ్చు సమతా మూర్తి గా మరియు జగద్గురువులు గా (వెంకన్న కు అలంకారములు ఇచ్చారు కాబట్టి). కానీ, ఈయన ఒక్కరే జగద్గురువులు అని మాత్రం అనకుండా ఉంటే బాగుంటుంది. పొరపాటున వచ్చి ఉంటుంది, అంత పెద్ద కార్యక్రమ హడావిడిలో.
కానీ హైదరాబాద్ లో, అంత పెద్ద విగ్రహముతో రామానుజుల వారి, సేవా మందిరాన్ని కట్టి నడపడం అంటే, మనకు సాధ్యమేనా? ఇది, కేవలము జీయరు స్వామి వారి కే సాధ్యం. వారికి వారి హైందవ సేవలకు మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణా.
2. గ్రామ దేవతలు - జీయరు స్వామి గారే, వివరణ ఇచ్చారు. గ్రామములో పుట్టి కూడా, దేవతలు గా పేరు పొందారు అంటే చాల గొప్ప విషయము. మా మాటలను వక్రీకరించారు, అటు ఇటు మాటలను తీసేసి, ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఈ వివాదాన్ని తెచ్చారు అని. ఆ దేవతలను అడ్డము పెట్టుకుని, వ్యాపారము చేస్తున్న వారిని మాత్రమే ఉద్దేశించి అన్నాము అని చెప్పారు.
అది నిజము, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టించి శునకానందము పొందుతున్నారు, వారికి దైవ శిక్షలు తప్పవు.
అడిగితే సలహా చెపుతాము, అడగకపోతే జరిగే కార్యక్రమాలు చూసి ఆనందిస్తాము. మేము ఇలాగే ఉండాలి ఉంటాము.
ఇప్పుడు మేము కూడా, తిరుపతి ధర్మ కర్తల మండలిలో, రాజకీయ నాయకులు ఎందుకు, అని అంటే, వెంకన్న ను అన్నట్లు కాదు కదా?
నిర్మాతలు అశ్వనీదత్ లాంటి వారు, అనవసరముగా నోరు పారేసుకుని, ఏదేదో చెప్పారు.
ఆయన గతం, మీ గతం, చంద్రన్న గతం మనకు ఎందుకు. ఈ 20 ఏళ్ళ లో ఏమి చేసారో మనకు కావాలి, అవి మంచి పనులా కాదా, లేకపోతె అలాంటివి మీరు చేయగలరా? లేనప్పుడు గమ్ముగా ఉండక, ఇతరులను దుమ్మెత్తి పోయడం ఎందుకు? కాలం బలమైనది సుమా.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,572,056; 97 తత్వాలు (Tatvaalu) and views 198,433 Dt : 26-Mar-2022, Upd Dt : 26-Mar-2022, Category : News
Views : 448
( + More Social Media views ), Id : 1316 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chinna ,
jeeyar ,
swamy ,
controversy ,
village ,
deities ,
jagadguru ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments