తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది - తల్లాపెళ్ళామా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,714; 104 తత్వాలు (Tatvaalu) and views 224,707.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఉగాది సందర్భముగా, తెలుగు జాతి పాట మరలా మనసారా పాడుకుందాము.

గతం గుర్తుకు తెచ్చుకుని సిగ్గు పడదాము, ఎంటీయార్ మరియు రాజన్న లు ఉంటే, ఈ రోజు వెన్నెముక లేని రాజకీయ నాయకుల ఆటలు సాగుతాయా, రాష్ట్రము ముక్కలు అవుతాయా?

ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర గా ఇంకా ముక్కలు చేసుకుని, పబ్బం గడుపుకోవాలని చూసే, ప్రబుద్దులు ఉన్నారు. వారి మాటలు నిజము అనుకునే, పిచ్చి జనాలు ఉన్నారు.

శ్రీలంక దేశం మన జిల్లాల అంత చిన్నది, ఇప్పుడు దాని గతి ఏమైంది?

ప్రజలు మంచి వారు, నాయకుడు గట్టి వాడూ ఉంటే, భారత దేశం రామరాజ్యం గా ఉంది ఒకప్పుడు.

ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలాగా ఉంది - ప్రాంతీయ పార్టీల ఉచిత పంపకాల తో.

ఒక్కో పదములో ఎంత భావం ఉందో చూడండి. శ్వాస మరియు వాక్సుద్ది కోసం, మీరూ ప్రయత్నం చేస్తారు కదూ?

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది 2
తెలంగాణ నాది రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది
అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా ||తెలుగు జాతి||

ప్రాంతాలు వేరైనా, మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా, మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ వచ్చిండన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా ||తెలుగు జాతి||

మహాభారతం పుట్టింది, రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న 2 ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా ||తెలుగు జాతి||

పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది 2
మూడు కొండలు కలిపి దున్నినా, ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం, ఐదు కోట్ల తెలుగువారిది ||తెలుగు జాతి||

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని, సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట, స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి, దీటే లేదనిపించాము ||తెలుగు జాతి||

ఇంటిలోన అరమరికలు ఉంటే, ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే, కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు 2
నలుగురిలో మనజాతిపేరును, నవ్వులపాలు చెయ్యెద్దు ||తెలుగు జాతి||

Talla Pellama - Telugu Jaathi Manadi - NTR, Chandrakala

Telugu Movie Staring : N. T. Rama Rao, Devika, Balakrishna,
Director: j satyanarayana, Produced by :Trivikram Rao  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,714; 104 తత్వాలు (Tatvaalu) and views 224,707
Dt : 27-Mar-2022, Upd Dt : 27-Mar-2022, Category : Songs
Views : 1332 ( + More Social Media views ), Id : 1317 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : talla , pellama , telugu , jaathi , ntr , chandrakala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content