విలేఖరి గా జగనన్న చంద్రన్న ల మీద, ఏవైనా రాయవచ్చు. కానీ నాయకులు గా పదవుల్లో ఉండి ఎలా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1625 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1660 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

As reporter you can write anything on jagananna, chandranna, but how do we say same in post as political leaders?

*అబ్బాయి, నువ్వు విలేఖరి గా మీ అబ్బాయి లు జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న ల మీద, ఏవైనా గౌరవం గా అభిమానం గా రాయవచ్చు. కానీ మేము నాయకులు గా పదవుల్లో ఉండి, 1. వారికి ఎదురు చెప్పగలమా? 2. ప్రశ్నించడం ధర్మమేనా? 3. మా మాట వింటారా? 4. మా పదవులు పోవా? 5. అదే పదవి నీకు ఇస్తే, ఇలాగే అడుగుతావా ధర్మం?*

జవాబు, గురువు లు తప్పులు ఉంటే సరిచేయాలి. మన నాయకులు నాకు, మీకూ, ఓటర్లు అందరికీ, పసి పిల్లలే. వారి చేతిలో కలం పెడితే రాస్తారు, మూర్ఖముగా తుపాకి పెడితే కాలుస్తారు.

మొన్నటిదాకా 2వ పెద్దోడు కి 3 పంటల మాగాణి పొలం ఇచ్చాం, కాంక్రీటు చేశాడు భవిష్యత్ లో కూడు దొరక్కుండా. ఇప్పుడు చిన్నోడి చేతిలో పొలం పెట్టాం, ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. అడిగితే అప్పు లెక్కలు చూపుతున్నాడు, నాట్లు కనపడటం లేదు, పంట దిగుబడి లేదు. మరి రేపు వెర్రిగా, ఎవరిచేతిలో పెడతామో?

మన తత్వం తెలిసిన వారే, దానితో కలసి నడిచే వారే, మనతో ఉంటారు, మనమూ వారితో ఉంటాము, కృష్ణ అర్జునుల మాదిరిగా, కష్ట నష్టాలలో. ఇరువురు మోసం చేసుకోరు, వెన్నుపోటు పొడవరు, కూలదోయరు, గొయ్యి తవ్వరు, చాటు నటన మాటలు అరుపులు దురాశ ఉండవు.

ఇరువురు కి నచ్చకపోతే, బేధాభిప్రాయాలు వస్తే, గమ్ముగా పక్కకు వెళతారు, కీడు చేయరు.

ఈ ప్రశ్నలు ఆత్మాభిమానం లేని వారు, అడ్డ దోవలో పైకి వచ్చిన వారు, నటించే వారు, ఎక్కువ గా అనుకుంటూ ఉంటారు. మన్నించాలి. ఇవి చెప్పండి, తప్పో ఒప్పో?

1. రోజు ధనం తగలేసి తాగి వచ్చే బాధించే భర్త ను, భార్య, ఇంట్లో స్ధానం పోతుంది అని, ఏమీ అనకుండా గమ్ముగా ఉంటే, ఆ కుటుంబం ఆ పిల్లల భవిష్యత్ ఏమిటి? భర్త పోతే రోగంతో? ధనం పోయి, రోడ్డు న పడితే? ధర్మము, భవిష్యత్ ముఖ్యమా కాదా?

2. ఏడో తరగతి మరియు పదో తరగతి కొడుకు కూతురు, ఉదయం 5 కు నిద్ర లేపితే కొడతారు తిడతారు అని పేరెంట్స్, గమ్ముగా ఉంటే, నష్టం ఎవరికి?

3. రారాజు దైవం రాముడు తో నమ్మినబంటు ఆంజనేయుడు, జగద్గురువు ఆపద్భాందవుడు కృష్ణుడు తో అర్జునుడు, యుద్ధం ధర్మం కోసం చేసారు. తప్పు అని స్వయముగా వారు కూడా అనలేదు తర్వాత, అర్ధం చేసుకుని మరలా ఒకటి అయ్యారు. కాదా? ఆ సంస్కారం మనకు ఉందా?.

ఈరోజు న 23 సీట్లు తో చంద్రన్న ఉండడానికి, భవిష్యత్తు లో జగనన్న పరిస్థితి కి కారణం, ఖచ్చితంగా మీలాంటి వారే, అలాగే తమ వారి తప్పు లు రాయని పచ్చ మరియు బులుగు పత్రికలు.

మనం పాపాత్ములు అనుకునే కౌరవులు లో కూడా, మన కన్నా నీతి ఎక్కువగా ఉంది.

అందుకే ఎప్పుడూ అంటూ ఉంటా, రాక్షసులు మన కన్నా ఉత్తములు, ఎందుకంటే నటించరు - 2 మాటలు ఉండవు, లోపల బయట, వెనుక ముందు. రాక్షసులు కన్నా మనం నీచులము, కాదా?.

తప్పు లో కూడా, రాక్షసులు ముక్కు సూటిగా, తమ అవలక్షణాలు చెబుతారు - నేను సూదిమోపిన భూమి ఇవ్వను అని, రాముడు వచ్చి సీతను గెలిచి తీసుకుని వెళ్ళమని.

కానీ మనం? సినిమా స్టార్ ల కన్నా, ఆస్కార్ నటన, ఆత్మ ద్రోహం తో - ఒకే ఇంట్లో బాల, మధ్య, వ్రుద్ద నటులు.

విదురుడు, మనలాంటి వాడే. కౌరవులు చేసేవి అన్ని తప్పులు, ఇలా చేయవద్దు అని రోజూ మొత్తుకుంటూ ఉన్నాడు, వారు వినలేదు. అతని ఉద్యోగం, సంపాదన బతుకు తెరువు కోసం కౌరవులు తోనే ఉన్నారు. మంచి చెడు చెప్పడం వరకే అతని విధి.

కౌరవులు, విదురుని అవమానించలేదు, అనుమానించలేదు, హేళన చేయలేదు, ఉద్యోగం సంపాదన తీయలేదు. అబ్బో నీతి మంతుడు వచ్చాడు అనలేదు. ఎందుకంటే రెండో కోణం ధైర్యంగా స్థిరం గా చెప్పే వాడు, కొలువు లో విదురుడు ఒక్కడే అని వారికి తెలుసు, బయట వారిలో.

కౌరవుల మధ్యలో ఉండి కూడా, తన పూరింట్లో తాను ఉన్నాడు. ఏ విషయం లోనూ, వారితో కలవడు. అది అతని తత్వం, ఉద్యోగ ధర్మం, మానసిక పరిపక్వత. మోహ మాయలో ఉండే కౌరవులు కూడా, దానిని గౌరవించారు.

మరి మనలో నీతి ఉంటే, జగనన్న మరియు చంద్రన్న కూడా, ఏమీ అనలేరు అనరు. వారు మనకు పదవి ఇచ్చినా సహాయం చేసినా, ప్రజా పన్నుల పధకాలకు మన కుటుంబం పేర్లు పెట్టి, మన వంశాలను కించపరిచి, భవిష్యత్తు పతనం కు మార్గం వేయవద్దని, మన బిడ్డ ల క్షేమం కోరే హక్కు, మనకు లేదా? ఉంది, ఖచ్చితంగా అడుగుతాము, పార్టీ మీటింగ్ లో. వింటారా లేదా వారి ఇష్టం.

పదవీ కాంక్షతో, రేపు కాలగర్భంలో కలిసిపోవడం కు, సిద్ధం గా ఉంటే, మీరు ఇలాగే గమ్ముగా ఉండవచ్చు. అదీ మీ ఛాయిస్, ఆ తర్వాత దేవుని దగ్గర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

వాస్తవ వాది లోక విరోధి లాగా, మాకు ఆస్తులు అంగబలం లేకపోవచ్చు, కానీ ఆత్మ బలం ఉంది, దేవుని మరియు మంచివారి అండ ఉంటుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1660 General Articles, 64 Tatvaalu
Dt : 27-Mar-2022, Upd Dt : 27-Mar-2022, Category : Politics
Views : 219 ( + More Social Media views ), Id : 1320 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : reporter , jagan , chandranna , mla , mp , minister , political , leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content