తెదేపా అధిష్టానం, కొంతమంది నాయకులు పరిస్థితి ని బట్టి నేర్చుకోరు, నోరు లేని చీరాల తెదేపా - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,793; 104 తత్వాలు (Tatvaalu) and views 225,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

తెదేపా అధిష్టానం, అలాగే కొంతమంది వారి నాయకులు అనుచరులు, వాస్తవం అర్థం చేసుకోరు, తమ తప్పు ఒప్పుకోరు, మంచి వినరు, పరిస్థితి ని బట్టి మారరు, తమను మార్చుకోరు నేర్చుకోరు.

కనీసం అధికారం కోల్పోయిన తర్వాత అయినా, 23 ఎమ్మెల్యేలు తో జనం ఛీత్కారం చేసినా, అందరినీ అన్ని వర్గాల ను, ప్రజలను, విలేఖరుల ను, సామరస్యంగా కలుపుకొని పోరు. ఇక ఇప్పుడు అధికారంలో ఉంటే, ఎలా ప్రవర్తించే వారో చూసుకోండి.

చంద్రన్న ను పొగిడాము, అలాగే తప్పులు ఎత్తి చూపించాము. పాత లింకు చూడండి. link.

ఇన్నాళ్లు అధికారం ఇచ్చిన ప్రజలను గాలికి వదిలినా, కనీసం తమ పార్టీ సొంత తమ్ముళ్లు, వైసీపీ నాయకులు తో ఇబ్బందులు తంటాలు పడుతూ ఉంటే, జైలు కు పోతూ ఉంటే, అండగా ఉండాలి, పోయి వెంటనే పరామర్శించాలి. రాష్ట్రంలో అందుబాటులో ఉండాలి, కానీ వారిని గాలికి వదిలేసి, దూరంగా హైదరాబాద్ లో ఉంటారు.

ఎన్నోసార్లు చెప్పాము, ఇబ్బంది అయినా తప్పదు ఇక్కడ ఉండాలి అని. గతంలో జగనన్న అక్కడ ఉన్నా, మనం అనుభవం లో సాంప్రదాయం లో, పెద్దగా ఉండాలి కదా అని.

నాయకుడు, దూరంగా వెనక ఉండి, సైన్యం ను మీరే పోరాడి చావండి, జైలు కు పోండి ఈ 5 ఏళ్ళు అంటే? సైన్యం తెలివి తక్కువ వారా? ఆ తాను ముక్కలే కదా? వారూ కరోనా సమయంలో ఇంట్లో నే ప్రశాంతంగా ఉన్నారు, జనాల కష్టాలు కు దూరంగా. ఆయన కు లేని దురద మాకెందుకు అని, చిన్న నాయకులు అంతా లోపలే ఉన్నారు.

కొందరు పార్టీలు దూకారు, ఇతరుల తో కలసి, వంగి సలాములు చేస్తున్నారు. అయినా అధిష్టానం తీరు మార్చుకోకుండా, పట్టించుకోకుండా ఉంది.

ఎందుకు ఇప్పుడు ఇవి చెబుతున్నాము అంటే, ఇవన్నీ నిర్భయంగా చెప్పి, వారిని అవమానించాలని కాదు, మనసు మారి, భవిష్యత్తు లో ఇంకో 50 సీట్లు, తెచ్చుకోవడం జరగాలని.

కానీ అధిష్ఠానం నుంచి ఒకరు సంవత్సరం క్రితం, ఇంకొకరు ఈ నెలలో, వాట్సప్ ఆపేసుకున్నారు, తమ పార్టీ పై, మంచి వాస్తవ విమర్శలు భరించలేక.

అది తప్పు, మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, సూత్రాలు కూడా చెప్పాము. మా మీద అలక, కోపం ఎందుకు? కొడాలి, ఆమంచి, అలా చంద్రన్న ను తిట్టడం తప్పు అని చెప్పాము కదా.

పచ్చ పత్రిక ల అనవసర పొగడ్తలే, ఈరోజు ఈ దుస్థితి కి కారణం అని, ఇప్పుడు కూడా గ్రహించరా? మనల్ని మంచి విమర్శలు చేసే వారే, మన మంచి కోరేవారు అని అర్థం కాదా?

తెదేపా అంటే కోపం అయితే, తెదేపా శ్రీకాకుళం ఎంపీ ని, పర్చూరు మరియు తాడిపత్రి తెదేపా ఎమ్మెల్యే ను, పొగుడుతామా? అందరూ ఒకటే, అందరూ మన పిల్లలే.

వాట్సప్ ఆపిన వారి ప్రైవసీ ని గౌరవించి, మనసు మార్చుకుంటారు అని భావించి, వారి పేర్లు ఇప్పుడు చెప్పము. మావి చదివినా చదవకపోయినా, మారినా మారకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, విలేఖరికి దూరముగా నాయకులు, పారి పోకూడదు.

ఎందుకంటే తల్లి దండ్రులు, హైందవం, సమాజ సేవ, పిల్లల పెంపకం, ఆరోగ్యం, అభివృద్ధి, శనివారం దేవుని దీవెనలు అన్ని ఉండాలి. దయచేసి అధిష్ఠానం కు పంపగలరు.

ప్రజలు 2024 లో జగనన్న ను ఛీత్కారం చేసి, మన తెదేపా కు కట్టబట్టారు అధికారం అంటే, అది మన గొప్పతనం కాదు. ఇంకో గట్టి దిక్కు మాలిన నాయకుడు లేక.

ఒకవేళ వాస్తవం గ్రహించి, కుటుంబ పాలన వద్దు, పధకాలు కు సొంత కుటుంబం పేర్లు పెట్టె వారు వద్దు, అప్పులు పెంచే వారు వద్దు, సొంత పార్టీ లేని చంద్రన్న వద్దు అనుకుని, కొత్త జనసేన పవనన్న పాలన ను చూద్దాం అని అటు గెలిపిస్తే, ఇక వైసీపీ జనసేన, రెండు మాత్రమే మిగిలి ఉంటాయి.

కాబట్టి దయచేసి అన్ని వర్గాలు కు, అందుబాటులో దగ్గరగా ఉండాలి. అధికారం లేని మీరే ఇలా కోపంతో బాధతో అసహనం తో వెళ్ళి పోతే, మరి అధికార వైసీపీ బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేలు ఎంపీలు, గమ్ముగా ఒదిగి ఉంటే ప్రజాస్వామ్యాన్ని పత్రికలను విలేఖరి ని గౌరవించి, ఇప్పుడు వైసీపీ బీజేపీ జనసేన గొప్పవి, ప్రజలకు దగ్గరగా ఉంటాయి అని మీరు ఒప్పుకున్నట్లే కదా? మీరు సర్టిఫై చేసినట్లు కాదా?

ఈరోజు చీరాల తెదేపా శాఖ అధ్యక్షుడు బాలాజీ అన్న, మున్సిపల్ ఎన్నికల్లో 33 మంది వార్డు మెంబర్లను ఎందుకు పోటీకి పెట్టలేకపోయారు, ఎందుకు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా ను 2 ఏళ్లుగా పాతి పెట్టారు, ఊళ్ళో ఉండని ఎమ్మెల్యే కరణం అంటే భయం ఎందుకు, అభివృద్ధి విమర్శలు ఎందుకు లేవు, చీరాల జిల్లా కావాలని ఎందుకు ఎలుగెత్తి అరవరు, ఫిషింగ్ హార్బర్ చేనేత పార్కు ఏవి, ప్రతిరోజూ చీరాల తెదేపా ఫేస్బుక్ పేజీలో స్ధానిక సమస్యలు అభివృద్ధి ధర్నాలు ఫోటోలు ఏవి, అన్న వాటికి జవాబు లు లేకుండా ఏదేదో జవాబు లు చెప్పారు.

ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా, మేము అలాగే మా పార్టీ మారదు, నేను ఇంకా తెదేపా నాయకత్వం లో ఇలాగే మౌనముగా కొనసాగుతూ, 2 ఏళ్ల పనితనం తో, చీరాల మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన, తెదేపా గెలుపు పరిస్థితి ని, ఇంకా 3 ఏళ్ళు కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు.

ఇంక తెదేపా అధిష్టానం ను, బాపట్ల పార్లమెంటు ఇంఛార్జి ని, ఆ పై నాయకులు ను ఏమని పొగడాలో, మీరే చెప్పగలరు. అధ్యక్షుడిని మార్చమని కాదు, పని తనం మెరుగు పరచి, అభివ్రుద్ది విమర్శలు ఫేస్బుక్ లో పెట్టించమని. దీనికి కోపం ఎందుకు, దూరంగా పోవడం ఎందుకు, గమ్ముగా, మా పార్టీ మా ఇష్టం, మేమే నాశనం చేసుకుంటాం, అని ధైర్యంగా చెప్పవచ్చు కదా.

కానీ మా అన్న స్వర్గీయ ఎన్టీఆర్ కష్టార్జిత పార్టీ అని, నందమూరి అభిమానులు అందరి బాధ కోసం, ఈ నిష్ఠూరం అయిన మాటలు చెప్పక తప్పదు, మన్నించాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,793; 104 తత్వాలు (Tatvaalu) and views 225,171
Dt : 28-Mar-2021, Upd Dt : 28-Mar-2021, Category : Politics
Views : 769 ( + More Social Media views ), Id : 1057 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tdp , high command , leaders , learn , political situation , chirala , tdp , mouthless
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content