మీరు చెప్పినదే మంచి అని ఎందుకు అనుకోవాలి, ఇతరుల కోణం లో నుండి అది తప్పు కావచ్చు కదా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,771; 104 తత్వాలు (Tatvaalu) and views 225,934.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Why do we think what you say is good for you, can it be wrong from the perspective of others

*ఏవండీ మీవి చాలా చదివాను, తెలుగు భాష మరవకుండా సొంత ప్రయత్నం చేస్తున్నారు, రాత మరియు పద్యం పలుకు లో. ఇంకా చదువుతా. కానీ మీరు చెప్పినదే కరెక్ట్/ మంచి అని ఎందుకు అనుకోవాలి అని కొందరు అంటారు, లోతు అర్ధం గాక. ఇతరుల కోణం లో నుండి అది తప్పు కావచ్చు కదా. ఇది అందరి కోసం, అడుగుతున్నా అన్యధా భావించవద్దు.*

జవాబు, గురువు లు గా మిమ్మల్ని భావించి, అజ్ఞాన శిష్యుడు, మీకు పంపినప్పుడు, అది చదవకపోతే మరియు తప్పు సరి చేయకపోతే, అది మీ తప్పు అవుతుంది, శిష్యునిది కాదు.

నేను మీకన్నా 100 శాతం పాపాత్ముడను, అని ప్రతి శనివారం చెపుతున్నా, అందుకే సాధన చెస్తున్నా. మరి పుణ్యాత్ములు, సాధన చేయరు.

ఓ తాగుబోతు అయినా, దయచేసి మిగతా వారు చెడిపోవద్దు, అని చెప్పే ప్రయత్నం చేయవద్దా?

అప్పుడు ఆది శంకరులు దేశమంతా తిరిగి ప్రచారం చేసారు, ఇప్పుడు వాట్సాప్ తో ప్రపంచం మొత్తము ప్రచారం తేలిక కదా?

సొంత పిల్లల ను సంస్కారం తో పెంచే వారు, శిష్యుల ను కూడా సొంత వారి లాగే చూస్తారు. ఎందుకంటే వారికి, మన లాగే జగమంత కుటుంబం, దైవం మీద ఆచరణ లో నమ్మకం.

పెళ్లి పిల్లలు లేని పుణ్యాత్ముడు భీష్ముడు కు, పిల్లలు ఉండీ సంస్కారం తో పెంచలేని వదిలేసిన పోగొట్టుకున్న పాపాత్ముడు ధృతరాష్ట్రుడు కు, తేడా తెలీని జనం, మన చుట్టూ ఉన్నారు.

చాటుగా తమ అనవసర వాదన ఉంటుంది వ్యక్తి గతంగా, ఇలా పదిమంది ముందు జనరంజకం గా సహజంగా అందరినీ మెప్పించే విధముగా అనలేరు, ఎందుకంటే వారి సుజ్ఞానం బయట పడుతుంది.

అయితే, ఒప్పు చెప్పే సాత్విక గురువు కూడా, ప్రాపంచిక మోహం వదిలి, అరిషడ్వర్గాలు లో సాధన ఉండాలి కదా.

మంచి ని పొగడటం తెలిసిన వాడే, తెగడటం కి కూడా అర్హులు, వారి మాటలు మాత్రమే పట్టించుకోవాలి. మనం  నాయకులు ను పొగిడినవి, అలాగే తప్పు చెప్పినవి ఉన్నాయి చూడండి.

మనిషి ని బట్టి ధర్మ కోణాలు ఉండవు మిత్రమా, ధర్మం న్యాయం బట్టి మాత్రమే కోణాలు ఉంటాయి. అరిషడ్వర్గాలు కు బానిసలైతే, తప్పు ఒప్పు గా కనపడుతుంది అంతే. కాని ఏనాడూ తప్పు నిజము గా ఒప్పు కాదు, అది బ్రమ, విష్ణు మాయ, మనల్ని పరీక్షించడానికి.

మేనక విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చింది అంటే, అది మాయ మోహం, అతని పతనానికి మాత్రమే, అది గొప్ప కాదు, ప్రేమ కాదు. విజయ మాల్యా దగ్గరకు డబ్బు వచ్చింది, అతనిని పతనం చేసింది.

కృష్ణుడు మరియు పాండవులు ఏమి చెప్పినా, ఏది చేసినా, దుర్యోధనుడు అలాగే దుష్ట చతుష్టయం కు, అలాగే కౌరవులు వారి మిత్రులు అందరి కి ఒళ్ళు మంట, జీవితాంతం, చివరి కట్టె కాలిందాకా, అంతే సుమా. వారి కోణాలు కలవవు, కౌరవుల కు ముందు చూపు ఉండదు. ఎందుకంటే వారిది రాజస మరియు తమో గుణం భావనలు, భోగభాగ్యాలు కు అలవాటు పడ్డారు, నేల విడిచి సాము చేసారు.

అంటే ఆనాడే, 60 శాతం మోహం లో జనాలు ఉన్నారు, 11 అక్షౌహిణుల సైన్యం, మంది మార్బలం ఐశ్వర్యం తో, విర్రవీగుతూ ఉన్నారు.

బంగారం లాంటి సాత్విక గుణం వదిలేసి, శరీరం పై బంగారం మోహం తో ఉన్నారు.

మరి ఇప్పుడు కలియుగంలో, కనీసం 80 శాతం మోహం లో ఉండరా?

ధర్మం ప్రకారం, కౌరవ సమాజం కరెక్ట్ అనుకునేవి, నిజం కాదు కదా ఏనాడూ? అదే వారి మాయ భ్రమ. ఎప్పుడు దాకా? శని లేదా కాల శిక్ష పడేదాకా.

మన ఇంట్లో వి అంటే, మీకు కోపం వస్తుంది కాబట్టి, అందరికీ తెలిసిన రాజకీయ ఉదాహరణ తీసుకుందాం.

ఉదాహరణకు ఓం ఎమ్మెల్యే/ ఎంపీ/ ఎమ్మెల్సీ తెదేపా (లేదా వైకాపా) తో గెలిచి, కనీసం రాజీనామా తో తిరిగి గెలవకుండా, సిగ్గు లజ్జ ఆత్మాభిమానం కుటుంబ గౌరవం విలువలు సంస్కారం లేకుండా, వైకాపా (లేదా తెదేపా) తో అక్రమ సంబంధం పెట్టుకుని, ఊరేగుతున్నారు అనుకుందాం, నేడు దర్జాగా పెద్ద మనిషి లా ఉన్నారు అనుకుందాం.

మోహం లో ఉన్న వారు, ఆయనకు వంగి వంగి దండాలు పెడతారు, ఎందుకంటే వారూ అలాగే ఎదిగారు లేదా ఎదగాలని అనుకుంటున్నారు. రేపు ఆయనకు లేదా ఆయన పిల్లలకు ద్రోహం చేయడానికి కూడా, ఈ అవకాశ అవసర అనుచరులు వెనుకాడరు సుమీ. ఎందుకంటే అప్పుడు నీవు నేర్పిన విద్య యే నీరజాక్షా అంటారు.

ఇప్పుడు ఆయన ఓ కుటుంబ తగాదాకు వెళ్లి, డబ్బు అధికారం హోదా ఉందని, న్యాయం ధర్మం చెబితే ఇలా - అబ్బాయి నువ్వు కట్టుకున్న భార్యను వదిలి ఇతరుతో తిరగడం తప్పు అంటే, ఆ కుటుంబం లో వాళ్ళు వింటారా? లోన నవ్వుతూ అనుకుంటారు, గోడ దూకి కూడా, అబ్బో నీతి చెప్పవచ్చాడు అని.

ఇప్పుడు నేను మరియు ఆ నాయకుడు గారు మాట్లాడుకునేటప్పుడు, ముందు మీరే విలువలు లేకుండా, న్యాయం చెబితే, వారు వింటారా అంటే, ఆయన నన్ను గౌరవిస్తారా?

ఏమంటారు? అబ్బో లోకంలో నువ్వే నీతిమంతుడు వి, నేను అన్యాయం గా పైకి వచ్చా, అనరా? తన తప్పు అంగీకరించరు, కోణం మార్చుకోరు.

తేడా ఎక్కడ ఉంది? ఆయన పదవీ అధికార మోహం లో ఉన్నారు, భవిష్యత్తు చూడరు, చూడలేరు, కనపడదు.

నేను మోహం బయట ఉన్నాను, ఆయన మరియు ఆయన పిల్లల భవిష్యత్తు, స్పష్టం గా కనపడుతుంది. అందుకే స్నేహితుని గా, నన్ను అడిగితేనే మంచి చెప్పాను.

ఇక్కడ నా కోణం, ఆయన కోణం ముఖ్యమా, లేదా, ధర్మం కోణం కాలం కోణం ముఖ్యమా? మిత్రమా.

కాలం శిక్ష పడిన రోజు న, ఆయనకు పూర్తి ధర్మం అర్ధం విలువ అవుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే, లాభం లేదు కదా అప్పుడు?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,771; 104 తత్వాలు (Tatvaalu) and views 225,934
Dt : 27-Mar-2022, Upd Dt : 27-Mar-2022, Category : General
Views : 691 ( + More Social Media views ), Id : 1318 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : think , good , wrong , perspective , others
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content