మిత్రమా, నీ గురించి ఉన్నది ఉన్నట్లు గా మంచి చెడు చెబితే, నువ్వు తట్టుకోలేవు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,674; 104 తత్వాలు (Tatvaalu) and views 224,977.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Friend, you can not tolerate good and bad things being said about you

మిత్రమా, నువ్వు మన గురించి చెప్పినట్లు గా, నీ గురించి ఉన్నది ఉన్నట్లు గా మంచి చెడు చెబితే, నువ్వు తట్టుకోలేవు. అందుకే ఎప్పుడూ చెప్పను, అని రాము సోముతో అన్నాడు.

కానీ నీ భవిష్యత్ బాగుండాలి అంటే, అవకాశం వచ్చిన నీవు ఇచ్చిన ఈరోజు అయినా, నీకు అర్ధము అయ్యెలా చెప్పాలి.

నీకు నువ్వు గొప్ప అనుకుంటే ఎలా, పక్కన ఊసరవెల్లి అవసర అవకాశ వాదుల పొగడ్తలు తో.

నీకు భవిష్యత్తు కష్టం వస్తే, గత సహాయం గుర్తు పెట్టుకుని, నాలాంటి వాడు వస్తారు అండగా. కానీ వారు రారు మిత్రమా.

ఎందుకంటే మా బుద్ధి ఆలోచన స్ధిరం, గాలికి కాలానికి మోహాలకు మారవు, అని నువ్వే అన్నావు.

నేను మీ కన్నా వందశాతం పాపాత్ముడను, అని ప్రతి శనివారం సాధన దాంట్లో స్పష్టంగా రాసిన అందరి ఎదురు గా. నువ్వు చదవకపోతే బాధ్యత నాది కాదు. నేను చేస్తున్నవి నిన్ను చేయమని ఎప్పుడూ అడగలేదు, అవి చేయలేవు. అలాగే నువ్వు చేసేవి నేనూ చేయలేను.

ఇంక నన్ను పుణ్యాత్మడని ఎవరు అంటారు? ఎందుకు అనాలి? బలం అలాగే అవసరం ఏముంది అందులో?

బాల్య మిత్రుడు వి, అది మన మధ్యలో, మంచి భావన గౌరవం సహకారం అలాగే ఉండనీయి.

మనసు బాగుంటే మంచి చేస్తావు, అండగా ఉంటావు, సందేహం లేదు.

లేదా మధ్యలో మాయ మాటలు చెప్పి వదిలేస్తావు, కనపడవు కూడా కదూ. మనం చేయలేనిది ఏదో ఒకటి చెప్పి, మధ్యలో మొహం చాటు చేయకూడదు, ఫోన్ ఎత్తకుండా తిరిగి చేయకుండా ఆగకూడదు.

1. ప్రేమ బంధాలు కుటుంబ విలువ తెలిస్తే, ఉత్తమ భార్య ఉండగా, ఎదిగిన పిల్లలు ఉండగా, ఇంకో వైపు పక్కన దొంగ చూపు చూడగలమా?

2. తల్లి ని చూడటం అంటే, ఇంట్లో వస్తువుగా పడేసి, ఇంట్లో వారికి అప్పచెప్పి, మనం బయట పనులు తో తిరగడం కాదు అంటే, మనం ఒప్పుకుంటామా?

ఇంత ఆస్తులు సంపాదించి అంతే నా, అమ్మ ప్రేమకు, సౌకర్యాలు కు వైద్యం కు విలువ?

3. మగపిల్లలు లేదా ఆడపిల్లలు ఉన్న వారు మాత్రమే అదృష్ట వంతులు అంటే, వంశం నిలబెట్టే వారంటే, మనం ఒప్పుకుంటామా? అసలు అది నిజమా?

అది మన తప్పా, లోపమా, దైవ నిర్ణయం నా? మనం ఇతరుల ను అనవచ్చునా, పెళ్లి బంధాలు పిల్లలు అని?

3.1 పిల్లలు వదిలేసిన‌, ఆశ్రమంలో ఉన్న, ఒంటరి అభాగ్య అమ్మా నాన్న ల సంగతి ఏమిటి? వాళ్ళ కు పెళ్ళి బంధాలు పిల్లలు ఉండి ప్రయోజనం ఏమిటి?

3.2 నీ లెక్క లో భీష్ముడు, నారదుడు, ఆదిశంకరులు, హనుమాన్, అలాగే నేటి వాజపేయి, మోడీ, యోగీ, పెళ్లి పిల్లలు లేకుండా ఉండటం లోపమా, నేరమా?

పెళ్ళి తో స్వార్థం గా, నా కుటుంబం మాత్రమే, అని బతకడం పుణ్య మా, సంస్కార పెంపకం లేకుండా?

4. అప్పు లేకుండా, ఎవరి మోచేతి నీళ్ళు తాగకుండా, సొంతంగా ఉన్న దానితో ఆడంబరాలు లేకుండా, తృప్తిగా మనం బతకాలి చిన్న ఇంట్లో అయినా అంటే, మనం ఒప్పుకుంటామా?

అప్పు చేసి పప్పుకూడు తినరా ఓ నరుడా, గాలిలో ఎగరరా ఓ పామరుడా అంటారా?

మనం అకాలం గా పోయినా, అప్పుల వాళ్ళు, మన ఇంటి మీద పడకూడదు పరువు తీయకూడదు అంటే, మనం వింటామా? గోఫండ్ కి పోవాలా, ఆన్లైన్ లో చేతులు చాచి? ఇదేనా బంధము పై ప్రేమ?

5. పిల్లల ను దగ్గర లో, రోజూ చూసే విధంగా పెట్టుకోవాలి, అంటే మనం ఒప్పుకుంటామా? పిల్లల ను దగ్గరకు లేదా మనం వారి దగ్గరకు వెళ్ళి ఉండాలి అంటే, ఒప్పకోము?

బంధాలు సంస్కారం ముఖ్యం ఉత్తి ఉత్తినే కాబట్టి, సంపాదనే ముఖ్యం అంటామా?

6. అవినీతి తో అప్పులతో, ప్రభుత్వం ను మోసం చేస్తున్న, టాక్స్ లు ఎగకొడుతూ లేదా తగ్గించి కడుతూ, పదిమంది కి అన్నం పెట్టడం కంటే, నీతి గా ఒక్క మనిషి ని కనీసం ఇంట్లో వారిని పోషించడం మంచిది, అంటే ఒప్పుకుంటామా?

ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్న లిస్టు విషయాలు మనకు మనం అనుకోవచ్చు నా? అందుకే 5 ఏళ్ళు లో ఎప్పుడూ అడగను, అడగలేదు. నాకు అవసరం లేదు, ఆ తప్పు ఎప్పుడూ చేయను.

కేవలము సలహా అడిగి న వారికే, వ్యక్తి గత జవాబు ఇస్తా.

ఎందుకంటే నీ మంచే నిన్ను కాపాడుతుంది, శిక్షణ ఇస్తుంది. మధ్యలో మనకెందుకు బాధ.

ఇప్పుడు నా పాపమే, 3 న్నర ఏళ్ళు ఆదాయం లేకపోయినా, అప్పు లేకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా, మోసం అబద్ధాలు లేకుండా, కన్నతల్లి వైద్య సౌకర్యాలు ఏమాత్రం తగ్గకుండా, నెట్టుకు వస్తుంది.

ఇప్పుడు అయినా, మనసులో కల్మషం తుడిచేసుకో. మంచి ని మంచి అను, నవ్వుతూ చెడు ను చెడు అను, తప్పు లేదు. లేదు ఏదీ అనకు.

కుళ్ళు అసూయ కల్మషం, రాచపుండు లాంటిది, శరీరం ను మనసు ను దహిస్తుంది. అది వద్దు మనకు.

రేపు భవిష్యత్తు లో నువ్వు నీ వాళ్ళు తర్వాత తరాలు ఇక్కడ కు వస్తే నేను ఇక్కడ ఉంటే ఒకవేళ, అన్ని నేను చూడాలి నా బంధువులు గా.

అలాగే నేను అక్కడ కు వస్తే, నువ్వు చూడాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఎదగాలి, చెడు చేసుకోకూడదు, ఎత్తి పొడుచుకో కూడదు.

నీ వృత్తి నీ గుణం నీ అలవాట్లు ను నేను గౌరవిస్తూ ఉన్నా, నువ్వు అలాగే గౌరవించాలి ఇతరుల వృత్తి, అలవాట్లు ను.

సలహా దారుల మాటలు అలాగే ఉంటాయి, పట్టించుకోకుండా ఉండాలి. అవి అందరికీ, మన గురించి కాదు. మిత్రమా ప్రతిసారీ భుజాలు తడుముకోకు, బాధపడకు, నీ జ్ఞానాన్ని బయటపెట్టకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,674; 104 తత్వాలు (Tatvaalu) and views 224,977
Dt : 27-Mar-2022, Upd Dt : 27-Mar-2022, Category : General
Views : 539 ( + More Social Media views ), Id : 1321 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : friend , tolerate , good , bad , things , ego
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content