అయ్యప్ప - శబరిమలను స్వర్ణ చంద్రోదయం - హరివరాసనం స్వామి విశ్వమోహనం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1766 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,395,046; 94 తత్వాలు (Tatvaalu) and views 184,846.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

స్వామియే శరణం అయ్యప్ప భక్తులకు మరో రెండు మధుర గీతాలు.

దేవుడు ఒక్కరే, భావనలు వేరు వేరు అంతే. అసలు దేవుని నమ్మని వారిని కూడా, సనాతన ధర్మం గౌరవిస్తుంది. ఎందుకంటే, దేహమే దేవాలయం, జీవుడే ఆత్మ, పరమాత్మ తో సఖ్యత ఉంటే చాలు, కానీ అది ఎంత మందికి అర్ధము అవుతుంది? కాబట్టి భక్తి అనేది ఒక దోవ మాత్రమే.

అన్నాన్ని పులిహోర చేసినా, బిర్యాని చేసినా, పొంగలి చేసినా, అందులో ఉన్నది అన్నమే అని గ్రహిస్తే చాలు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటీ అని అడగరు తెలివి తక్కువ వారు.

మనశ్శాంతి ఆత్మబలానికి ఉచిత మందు, కేవలము భక్తి, అయితే అది ఎందుకు చేస్తున్నామో ఎలా నియమ నిబద్దతలు పాటించాలో త్రికరణ శుద్దిగా తెలిసి చేయాలి. లేదంటే, అది వ్రుధా ప్రయాస గా మారుతుంది.

ప్రతి ఒక్కరు ఇలా మనస్పూర్తి గా అనుకోవాలి - కొత్త సినిమా లేదా సీరియల్ లేదా ఇంకో కార్యక్రమం, ఓటీటీ లో లేదా ధియేటర్ లో ఆన్లైన్ టీవీల్లో, చూసేటప్పుడు ముందు గా, మా కుటుంబం క్రుతజ్ఞతలతో, ఒక పద్యం శ్లోకం పాట నేర్చుకునే శక్తి దేవుడు ఇచ్చారు.

లేదంటే సినిమా లేదా మిగతావి చూడము జీవితము సమయము పాడు చేసుకోము, మేము మా మనసులు బలహీనం గాదు. నీతి జాతి గల సనాతన ధర్మం కు చెందినవారం, మా తాతల శక్తి యుక్తులు, మాకూ ఉన్నాయి అని నిరూపించాలి సుమా.

ఎప్పుడు లాగనే, మీరూ ప్రయత్నం చేసి, మీ గొంతు తో మమ్మల్ని ఆనందింప చేస్తారు కదూ. Like always, you will also make us happy by sharing your devotional voice.

1) శబరిమలను స్వర్ణ చంద్రోదయం, ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం, భక్తితో పాడుకుంటాం హృదయములా ||శబరిమలను స్వర్ణ చంద్రోదయం||

Sabarimalanu Svarna Chandrodayam, Dharma Raksakuni Sannidhini Abhisekam
Lokala Garavinhchu Ayyappa Stotram, Bhaktito Padukuntam Hrdayamula

ప్రీతియే ఉల్లమున పాలగును, అదే చల్లని నీ ఎదను పెరుగౌను
వెన్నయే నీవిచ్చు అనురాగం, నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తాం

నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా, ఈ సర్వస్వం నీ ఆశీర్వాదమయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యప్పా, అయ్యప్పా.. శరణమయ్యపా ||శబరిమలను స్వర్ణ చంద్రోదయం||

పుణ్యమిచ్చే పన్నీరభిషేకం, జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం, నీదు తనువంత జ్యోతివలె వెలిగేనూ

నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా, ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యప్పా.., అయ్యప్పా.. శరణమయ్యపా.. ||శబరిమలను స్వర్ణ చంద్రోదయం||

దోసిట పుణ్య జలం అందుకొని, అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం, హరి ఓం అని చందనంతో అభిషేకం

నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా, ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా
అయ్యప్పా.. శరణమయ్యప్పా, అయ్యప్పా.. శరణమయ్యపా ||శబరిమలను స్వర్ణ చంద్రోదయం||

అయ్యప్పా.. శరణం అయ్యప్పా 3

2) హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 2

Harivarasanam Viswamohanam, Haridadhiswaram Aaradhyapadhukam
Arivimardhanam Nithyanarthanam, Hariharathmajam Devamashraye
Saranam Ayyappa Swamy Saranam Ayyappa 2

శరణకీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం
అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం , ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం
ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 2

తురగవాహనం స్వామి సుందరాననం, వరగదాయుధం స్వామి వేదవర్నితం
గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం, త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 2

[భవభయాపహం స్వామి భావుకావహం, భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవలవాహనం స్వామి దివ్యవారణం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

కళ మృదుస్మితం స్వామి సుందరాననం, కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 2]

శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం, శృతివిభూషణం స్వామి సాధుజీవనం
శృతిమనోహరం స్వామి గీతలాలసం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప 2

Sabarimalanu | Devotional Video | K.J. Yesudas | Swami Ayyappa | Telugu
హరివరాసనం స్వామి విశ్వమోహనం, Saranam Saranam Manikanta

Ayyappa - Swarna Chandrodayam of Sabarimala - Harivarasanam Swami Vishwamohanam  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,395,046; 94 తత్వాలు (Tatvaalu) and views 184,846
Dt : 26-Apr-2022, Upd Dt : 26-Apr-2022, Category : Songs
Views : 340 ( + More Social Media views ), Id : 1372 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ayyappa , swarna , chandrodayam , sabarimala , harivarasanam , swami , vishwamohanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content