పాటతో పరమార్ధం - అంకితం నీకే అంకితం (భక్తి పేరడి తల్లి తండ్రి దైవం) - స్వప్న - రాజా, స్వప్న - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,884,928; 104 తత్వాలు (Tatvaalu) and views 226,524.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ankitham Neeke Ankitham (Devotional Paroday God Parents) - Swapna - Raja, Swapna

కాలేజీ ప్రేమికులను అడగండి, మీ నూరేళ్ళ జీవితం ఎవరికి అంకితం అని, తమ కాబోయే భాగస్వామికి అంటారు వెంటనే, వారి గురించి మంచి చెడు తెలిసినా తెలీకపోయినా, వారితో ఎన్నాళ్ళు ఉంటారో నమ్మకం లేకపోయినా.

మరి నవ మాసాలు మోసి, కని, పెంచిన వారికి, మీ జీవితం అంకితం లేదా అంటే? ఏంటో, మీ గోల, మా అమ్మా నాన్న కే దీనికి జవాబు తెలీదు, వాళ్ళ అమ్మ నాన్నకు ఎప్పుడు అంకితం కాలేదు, మీరు అసలు ఈ రోజులో వారేనా? రాతి యుగం నుంచి వచ్చారా? అని మనల్నే ఎగతాళి చేస్తున్నారు, వారి పిల్లలు పెద్ద అయ్యిన దాకా. అప్పుడు మన మాటల విలువ వారికి అర్ధం అవుతుంది, కానీ అప్పటికే చేతులు కాలిపోయి ఉంటాయి, ఇంక ఆకుల తో పని లేదు.

క్రుతజ్ఞత విశ్వసనీయత వారికి వారి పెద్దలు ఇద్దరికీ లేదు. కాబట్టి, పెడ దోవ పడుతున్న యువత ప్రేమ వివాహాలకు ఆద్యులు ఎవరూ? కేవలం బాధ్యత సంస్కారం లేని, తల్లి దండ్రులు, వారి పెంపకం మాత్రమే కాదా?

అందుకే మన పాట లో అంకితం, మీకే అంకితం, ఈ నూరేళ్ళ జీవితం, ఓ దేవా, అంటే మాత్రు దేవోభవా, పిత్రు దేవోభవా కూడా అర్ధం వస్తుంది సుమా.

మంత్రం మనసు కలయికలో, ఆధ్యాత్మికం పుడుతుంది. ఆ ఆలయ దేవత, తల్లి తండ్రి అయితే? గానం, గాత్రం, గీతం, భావం, సర్వం, వారికే అంకితం.

ఈ భావం కలవారు, తమ గుణ భాగస్వామికి పిల్లలకు కూడా, అవి సమానముగా పంచుతారు కదా. ఎందుకంటే, మల్లెపువ్వు వాసన ఎక్కడైనా ఒకటే అని మనకు తెలుసు.

ముదుసలి తల్లి దండ్రులతో విడిపోయిన లేదా దూరంగా ఉంచిన వారు, ఇంక భాగస్వామి స్నేహితులు బంధువులు పిల్లలతో మాత్రం చివర వరకు కలసి ఉంటారా?

నాదం వేదం కలయికతో, ఒక ప్రణవం పుడుతుంది. ఆ గోపుర కలశం, తల్లి తండ్రి అయితే?
పుష్పం, పత్రం, ధూపం, దీపం, సర్వం, వారికే అంకితం. మరి మీరూ పాడుతారు కదూ?

* * *
అంకితం.. మీకే.. అంకితం....అంకితం.. మీకే.. అంకితం
నూరే.ళ్ళ ఈ. జీవితం.., అంకితం.. మీకే.. అంకితం
ఓ దేవా ఆ ఆ ఆ , ఓ దేవా.., ఓ దేవా..

1) కాళిదాసు, కలమందు చిందు, అపురూప, దివ్య కవిత
త్యాగరాయ, కృతులందు వెలయు, గీతార్ధ, సార నవత
నవ వసంత, శోభనా మయూఖ, లలిత లలిత, రాగ చంద్రరేఖ

స్వరము స్వరమూ కలయికలో, ఒక రాగం పుడుతుంది..
మంత్రం మనసు కలయికలో, ఆధ్యాత్మికం పుడుతుంది - మొత్తము 2 సార్లు

ఆ అనురాగం, ఒక ఆలయమైతే ..
ఆ ఆలయ దేవత, మీరైతే... 2
గానం, గాత్రం, గీతం, భావం, సర్వం., అంకితం...
అంకితం.. మీకే.. అంకితం..

2)లోక వినుత, జయదేవ శ్లోక, శృంగార, రాగదీప
భరత శాస్త్ర, రమణీయ నాద, నవ హావ, భావ రూప
స్వర విలాస, హాస చతుర నయన, సుమ వికాస బాస, సుందర వదన

నింగి నేల కలయికతో, ఒక జీవం అవుతుంది..
నాదం వేదం కలయికతో, ఒక ప్రణవం పుడుతుంది.. - మొత్తము 2 సార్లు
ఆ జీవం , ఒక గోపురమైతే
ఆ గోపుర కలశం, మీరైతే... 2
పుష్పం, పత్రం, ధూపం, దీపం, సర్వం., అంకితం..

అంకితం.. మీకే.. అంకితం....
నూరే.ళ్ళ ఈ. జీవితం.., అంకితం.. మీకే.. అంకితం
ఓ దేవా ఆ ఆ ఆ , ఓ దేవా.., ఓ దేవా..

చిత్రం : స్వప్న (1980); సంగీతం : సత్యం; సాహిత్యం : సి.నారాయణరెడ్డి; గానం : బాలు; రాజా, స్వప్న  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,884,928; 104 తత్వాలు (Tatvaalu) and views 226,524
Dt : 11-Jun-2023, Upd Dt : 11-Jun-2023, Category : Songs
Views : 223 ( + More Social Media views ), Id : 1786 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ankitham , Neeke , Devotional , Peroday , God , Parents , Swapna , Raja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content