జగనన్న సలహాదారుల రివ్యూ - విజయ్ సాయి 90, వైవీ సుబ్బారెడ్డి 75, సజ్జల 50 శాతం? ఎలా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* పార్టీ తగవులు, పార్టీ అభివ్రుద్ది, సంక్షేమం, ప్రభుత్వ పరముగా సమస్యలకు సలహాలు
* తెదేపా ను, రోజూ పార్టీ పరము గా, వాడి వేడి మాటలతో ఎదుర్కోవడం
* ముగ్గురులో, తెదేపా వారికి ఎవరంటే కోపం?
* పదవి ని సమర్ధముగా నిర్వహించడం
* సోషల్ మీడియా లో రోజూ ఏదో ఒక సమాచారం
* ఎవరంటే అధినేతకు ఎక్కువ నమ్మకం?
2 min read time.

జగనన్నకు పార్టీ పరముగా, రాజకీయ సలహా దారులు, ముగ్గురు. ఉత్తరాంధ్ర విజయ సాయి రెడ్డి (Facebook, Twitter), కోస్తా సజ్జల రామక్రిష్ణా రెడ్డి (Facebook, Twitter), రాయలసీమ వైవీ సుబ్బారెడ్డి (Facebook, Twitter) గార్లు అని అందరికి తెలుసు.

ఇది వారిని, తక్కువ చేయడానికి కాదు, లోపాలను సరి చేసుకుని, ఇంకా జగనన్నకు ఎక్కువ సాయం చేయడానికి. పార్టీ మరియు ప్రభుత్వ ప్రతిష్టను నిలపడానికి, వారి సామర్ధ్య పనితనం శాతం చూద్దాము.

అన్ని పార్టీలకు ఇలాగే చెప్పాము కదా?

ఇది అందరికీ అంటే మిగతా నాయకులకు కూడా ఉపయోగము, తమకు తాము మార్పులు చేసుకుని, ఎక్కువ కష్టపడుతూ, సోషల్ మీడియా వాడుతూ, జనము నోళ్ళలో నలుగుతూ ఉండాలి, మంచి తో ఎక్కువ, కనీసం విమర్శల తో అయినా.

సొంత జిల్లా అయినా ఊరు అయినా కాకపోయినా, మంచిని పొగడాలి, నిర్లక్ష్యాన్ని స్పష్టము గా చెప్పి వారి బాగు కోరాలి. అంతే గానీ, మనవాడు అని, లేని దానికి పొగిడితే, రేపు వారు కూడా, చంద్రన్న లాగా, 23 సీట్లకు వస్తారు. చెప్పడం వరకే మన ధర్మం, ప్రజలకు అలాగే నాయకుల వారసులకు ఉపయోగం కాబట్టి.

ఈ రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ అంటేనే, కనీసం రోజూ 2 పోస్టు లు సొంతవి ఉండాలి ఆయన అనుచరుల సహాయం తో, లేదంటే నీరసపు ఎమ్మెల్యే మరలా గెలవరు. వారితో పార్టీకి మరియు ప్రజలకు ఉపయోగము లేదు. ఇంక పార్టీ ప్రతినిధి అంటే, ఇంకా ఎక్కువ వాడి వేడి పోస్టు ల తో, అందరికీ ఆదర్శము గా ఉండాలి.

ఇది, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఎమ్మెల్యే లే ఇలా ఉంటే, ఇంక గెలుద్దాము అన్న కోరిక ఉన్న కొత్త లేదా ఓడిన నాయకుల, పార్టీ మరియు వ్యక్తిగత సోషల్ మీడియా లో, ఇంక ఎన్ని పోస్ట్ లు ఉండాలో ఆలోచన చెయ్యండి. అదే తెదేపా, బీజేపీ, జనసేన నాయకులకు 2 ఏళ్ళుగా మొత్తుకునేది, వారు మారరు.

అది దేని గురించి అయినా ఏదైనా సరే, ఒక వార్డు జనాన్ని కలవడం లేదా ప్రతి పక్షాన్ని విమర్శ లేదా ప్రభుత్వ పధకాన్ని పొగడటం లేదా అభివ్రుద్ది గురించి - ఫోటోలు వీడియోలు ఉండాలి. ఇదంతా ప్రజలకు ఉపయోగమే కదా?

1 వ కోణం - అక్కడ ఆ ప్రాంతపు పార్టీ తగవులు, పార్టీ అభివ్రుద్ది, సంక్షేమం, ప్రభుత్వ పరముగా సమస్యలకు సలహాలు

* సాయి - సమర్ధవంతముగా చేస్తున్నారు

* వైవీ - సమర్ధవంతముగా చేస్తున్నారు. మొన్న పెద్దారెడ్డి, కేతిరెడ్డి సమస్య మరలా రాలేదు.

* సజ్జల - తను మన లాగా ఒక జర్నలిస్ట్, మంచి మనిషి. కానీ, ఈ రాజకీయ నాయకుల తో వేగడం తెలీదు. ఈ తలనొప్పులు అమిత భారం. కొడాలి నాని గొంతును తగ్గించలేక పోతున్నారు. చూడండి, జగనన్న బంధువు బాలినేని కి ప్రకాశం జిల్లా రాజకీయం అప్పగించి, చోద్యం చూస్తున్నారు. నెల్లూర్ వేమిరెడ్డి వలన కూడా ఉపయోగము లేదు.

మంత్రివర్యులు బాలినేని తో చెప్పి, 2 ఏళ్ళుగా జగనన్నకు మేలు చేసే, ప్రకాశం జిల్లా లో సోషల్ మీడియా నడిపించలేని అసమర్ధత, సజ్జల తో పాటు గా, వేమిరెడ్డి, బాలినెని, మాగుంట గార్లకు కూడా దక్కుతుంది. కనీసం, కొత్త కలెక్టర్ తో అయినా, చేయించ గలరో లేదో చూడాలి, జగనన్న కు మంచి.

2 వ కోణం - తెదేపా ను, రోజూ పార్టీ పరము గా, వాడి వేడి మాటలతో ఎదుర్కోవడం, బొమ్మలతో వీడియోలతో కూడా. ముగ్గురులో, తెదేపా వారికి ఎవరంటే ఎక్కువ కోపం?

* సాయి - ప్రతి రోజూ, సమర్ధవంతముగా చేస్తున్నారు. వీరు అంటేనే, తెదేపా లో ప్రతి ఒక్కరికి ఒళ్ళు మంట, ఎక్కువ విమర్శలు వీరి మీదనే. కాబట్టి వీరే నంబర్ 1.

* వైవీ - సైలెంట్ లేదా అతి తక్కువ ఈ విషయములో

* సజ్జల - మొక్కు బడిగా, అప్పుడప్పుడూ, తెదేపా కు కౌంటర్ లు ఇస్తారు, పార్టీ పరము గా, సుతి మెత్తగా.

3 వ కోణం - తమ కు ఉన్న పదవి ని సమర్ధముగా నిర్వహించడం, అంటే, టీటీడీ చైర్మన్, ఎంపీ, మొదలుగునవి.

* సాయి - ఎంపీ గా, సమర్ధవంతముగా చేస్తున్నారు. పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు.

* వైవీ - టీటీడీ లో, సమర్ధవంతముగా చేస్తున్నారు.

* సజ్జల - తెదేపా కు కౌంటర్లు తప్ప, ఇంకేమీ పదవి పనులు ఉన్నాయా?

4 వ కోణం - సోషల్ మీడియా లో రోజూ ఏదో ఒక సమాచారం తమ గురించి, పార్టీ గురించి, ప్రతిపక్షం గురించి

* సాయి - రోజూ ఎదో ఒక చురక ఉంటుంది ప్రతి పక్షాలకు. కాబట్టి వీరే నంబర్ 1.

* వైవీ - టీటీడీ పోస్ట్ లు మాత్రమే ఉంటాయి. ప్రతి పక్షానికి చురకలు ఉండవు. టీటీడీ చైర్మన్ కు ఒక సోషల్ మీడియా, వ్యక్తి గతము గా ఒక సోషల్ మీడియా ఉంటే, బాగుంటుంది పార్టీ సమస్యలు అలాగె ప్రతిపక్ష విమర్శలకు.

* సజ్జల - తెదేపా కు కౌంటర్లు అప్పుడప్పుడు ట్విట్టర్ లో తప్ప, రోజూ ఫేస్బుక్ లో ఏమీ పెట్టడం లేదు. చాలా నీరసం గా ఉంది, ఆ సమాచారం.

* * * విజయ్ సాయి కి, రోజుకు కనీసం 3 సోషల్ పోస్ట్ లు ఉంటాయి. సైరా అనే ఫోటో తో చురకలు తెదేపాకు ఉంటాయి, వెంటనే వారిది ఒక జవాబు ఉంటుంది. తెదేపా సోషల్ మీడియాను రోజూ ఫాల్లో అవుతూ, సూటి విమర్శలు సంధిస్తారు బొమ్మలతో.

* * * వైవీ కి, తక్కువ సోషల్ పోస్ట్ లు, అవీ టీటీడీ వి మాత్రమే. ప్రతిపక్ష చురకలు, ప్రభుత్వానికి ప్రశంసలు, మిగతా రాజకీయ విషయాలు ఏమీ ఉండవు. ఏప్రిల్ నుంచి ఇప్పుడు జూన్ దాకా - 15 లోపు పోస్ట్ లు మాత్రమే ట్విట్టర్ ఫేస్బుక్ ల లో. అంటే టీటీడీ వి కూడా రోజూ ఒకటి లేవు.

* * * సజ్జల గారిది మరీ ఘోరం - వాసి లేకపోయినా రాశి అంటే సంఖ్య అన్నా ఎక్కువ ఉండాలి కదా? మరీ ఘోరముగా, ఏప్రిల్ నుంచి జూన్ దాకా - 20 కన్నా తక్కువ పోస్ట్ లు ట్విట్టర్లో. ఫేస్బుక్ అయితే మరీ ఘోరం, మార్చ్ లో 1 మాత్రమే, ఇప్పటి దాకా ఏమీ లేదు. అంటే, ఆయన అసలు పని చేస్తున్నారా అన్న అనుమానం వస్తుంది కదా? వైసీపీ వెబ్సైట్ లో ఉన్నా కూడా, తన సొంత పేరు మీద ఇక్కడ స్పష్టము గా ఉండాలి. అవే షేర్ చేయవచ్చును కదా.

5 వ కోణం - ఎవరంటే అధినేతకు ఎక్కువ నమ్మకం?

* సాయి - జగనన్న కొత్త రాజధాని వైజాగ్ మీద, పట్టు కేవలం వీరికే ఇచ్చారు. ఇక అన్ని అకౌంట్ల వివరాలు వీరికి మాత్రమే తెలుసు. కాబట్టి వీరే నంబర్ 1.

* వైవీ - టీటీడీ పోస్ట్ చేతిలో పెట్టి, రాయల సీమ వైపు నెట్టేసారు.

* సజ్జల - కోస్తా ఇచ్చినా, ఎలా సరి చూసుకోవాలో తెలీక తికమకలతో నమ్మకం పోగొట్టుకుంటున్నారు.

అని బయట జనము అనుకోవడము. కానీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటారు కదా? మీ అభిప్రాయాలు చెప్పండి మరి, సరి చేద్దాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 13-Jun-2021, Upd Dt : 13-Jun-2021, Category : Politics
Views : 200 ( + More Social Media views ), Id : 1204 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagananna , political , advisors , review , vijaysai , yv , subbareddy , sajjala , vemireddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content