దేవదాసు - పల్లెకు పోదాం పారును, ఓ దేవదా ఓ పార్వతీ - అక్కినేని సావిత్రి - ప్రేమికుల ఆనందం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,828; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ రోజుల్లో ప్రేమ కధలు సినిమాలు గా ఎన్నో వస్తున్నాయి. ఎక్కడ మొదలు అవుతాయో, ఎలా ముగిసిపోతాయో కూడా తెలీదు. ప్రేమ కి కోరికకు కూడా తేడా తెలియదు.

ప్రేమికుల ఆనందం, ప్రియుని ఆవేదన/ వేదాంతం, ప్రియురాలి ఆవేదన/ వేదాంతం అని 3 భాగాలుగా చెప్పుకుందాం.

ఎందుకంటే తల్లి దండ్రులు గారాబంగా పెంచి, బాధ్యతలు కష్ట సుఖాలు నేర్పక పొయేసరికి, ఏది మంచో ఏది చెడో తెలీక, ఉదయం ప్రేమ అంటున్నారు, సాయంత్రం పెళ్ళి అంటున్నారు, నెలకో సంవత్సరానికో బాయ్ బాయ్ అంటూ, విడిపోవు వేడుకలు జరుపుకుంటున్నారు. మధ్యలో కష్టాలు కన్నీళ్ళు భరించలేక పోతే ఉరి అంటున్నారు.

ఇక ప్రేమ కధల సినిమాల సంగీతం వాయిద్యాలు మోత ఎక్కువ, పాటల గాత్రం తక్కువ. అసభ్య పదాలు, ద్వందార్ధాలు. మాట్లాడితే పెద్ద నగరాలు, విదేశాలలో డాన్సులు, మధ్యతరగతి నాయికా నాయికలకు అంత దురాశ ఎందుకో, అదేమంటే జనాలకు అలాగే కావాలి అంటారు. ఆ మోతలు చెవులలో వైర్లు పెట్టుకుని, చెముడు తెచ్చుకుంటూ, ప్రమాదాలకు గురయ్యే యువత/ ఉద్యోగులు ఉన్నారు.

చూడండి, ఈ సినిమా, ఆస్తులు అంతస్థులు పదవులు కాదు, కేవలం ఇద్దరు గుణ గణాలు ను బట్టి ప్రేమ, అదీ చిన్న వయసు నుంచే అభిమానం ఆప్యాయత నమ్మకం తో మొదలు అవుతుంది, ఎటువంటి దురుద్దేశాలు లేకుండా. ఒకరి అలవాట్లు మంచి చెడు ఒకరికి తెలుసు.

భగ్నప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొదటిది అని చెప్పుకోవచ్చు. భగ్న హృదయుడి పాత్ర పై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు.

1971 లో విడుదలైన (ప్రేమనగర్), 1981 లో విడుదలైన (ప్రేమాభిషేకం) లో కూడా భగ్నహృదయుడిగా అక్కినేనే నటించటం, ఆ పాత్రలు మరల దేవాదాసుని గుర్తు చేయటం.

యావత్ భారతదేశంలో భగ్నహృదయులైన వారిని సరదాకి దేవదాసుగా వ్యవహరిస్తుంటారు.

పాటలు సహజం గా మన ఊళ్ళో, మన పార్క్ తోటలో, మామూలు ఇద్దరు వ్యక్తులు అనుకునే చిన్న చిన్న పదాలతో, గాత్రం ముఖ్యము గా, వాయిద్యాలు చిన్న గా పక్కగా ఉంటూ, ఎంత విన సొంపుగా ఉంటాయో.

చిన్నప్పటి స్నేహితురాలిని, కలవడానికి ఇంటికి వెళుతూ, తను ఎంత మారి ఉంటుందో, ఎలా పలకరిస్తుందో అని, ఆ యువకుడి ఆలోచనలు, పాట రూపముగా ఎంత బాగా మలచారో.

ప్రేమికుల హీరో అక్కినేని, అందాల నటి సావిత్రి ఆ రోజుల్లో ఎంత సహజముగా నటించారో, వీడియోలో చూడండి.

అలాగే ఇంకో పాటలో, ఇంత కాలం తర్వాత మొదటిసారి చూసుకున్న, ఆ ఇద్దరూ, ఎంత మారిపోయావో అంటూ ఒకరి నొకరు, ముద్దు ముద్దుగా వెటకారాలు చేసుకుంటూ ప్రేమ ను చూపించు కుంటూ పాడారో.

ప్రతి కధకు, మోహం కు ముందు, అంతా ఆనందము గా ఉంటుంది. కానీ తర్వాత పరిస్థితులు తారుమారై, అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకోటి గా, అంతా విషాదమునకు చేరుతుంది. అది ఇంకో సారి చూద్దాము, బాధ భాగములో.

ఇప్పుడు మాత్రం ఆనందము గా, ఈ పాటలు పాడుతూ, మీ పాత రోజులు గురుతుకు తెచ్చుకోండి. అలాగే ఇప్పటి పిల్లలకు, బాధ్యతలు కష్ట సుఖాలు నేర్పండి. మన నిర్లక్ష్యం బద్దకమే, వారి భవిష్యత్ పతనమునకు పునాది.

మనము గాయకులము కాదు, పాడుతుంది కేవలం శ్వాస ప్రక్రియకోసం సుమా. ఇప్పటికి ఓ 120 పాటలు/ పద్యాలు/ శ్లోకాలు/ మంత్రాలు పాడే ప్రయత్నం చేసాము.

1)
పల్లెకు పోదాం పారును చూద్దాం ఛలో ఛలో 2
అల్లరి చేద్దాం ఛలో ఛలో - 2 లైన్లు మొత్తము
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము 2 ||పల్లెకు పోదాం||

ఆటాపాటలందు కవ్వించు, కొంటే కోణంగి . . 2
మనసేమో మక్కువేమో 2
నగవేమో వగేమో, కనులార చూద్దము ||పల్లెకు పోదాం||

నన్ను చూడగానే, చిననాటి చనువు చూపేనో . . 2
నా దరికి దూకునో 2
తానలిగి పోవునో, ఏమౌనో చూద్దము ||పల్లెకు పోదాం||

Palleku Podam Parunu Chuddam, Lyrics: Samudrala Sr., Singer: Ghantasala

2) ఓ... దేవదా, ఓ.. పార్వతీ
చదువు ఇదేనా, మనవాసి వదిలేసి, అసలు దొరల్లే.. సూటు బూటా - మొత్తం 2 సార్లు
ఓ.. దేవద

పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కడము పట్టుబడిందే ..2
పసికూన, సిసలైన జా.ణ, అయ్యిందే.., బాగు బాగు 2
ఓ.. పార్వతీ

ఉన్న తీరు మారినా, ఊరు మారినా, తమరు ఎన్నటికీ పసివారేనోయ్ 2
అలనాటి కలలన్నీ వెలుగు, లయ్యేనా, నిజమయ్యేనా 2
ఓ.. పార్వతీ

నా ఎదుటే. నీ. బడాయి, జీవితమే. ఓ. లడాయి 2
లడాయిలా సరే మనకు, జిలాయిలోయ్ జిలాయిలోయ్ 2
ఆ నాడు ఈ నాడు, ఒకటే మాటా, ఉడుకూ మోతా 2
ఓ.. పిరికి పార్వతీ, ఓ.. దుడుకు దేవద

O Devada, Singers: Ghantasala, Jikki, Lyrics: Samudrala Sr.

Devadasu (1953), Music: Ghantasala, ANR, Savitri
దేవదాసు అక్కినేని సావిత్రి
Devadasu - palleku Podam Parunu, O Devada O Parvati - Akkineni Savitri - Anandam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,828; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249
Dt : 12-Jun-2022, Upd Dt : 12-Jun-2022, Category : Songs
Views : 915 ( + More Social Media views ), Id : 1424 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devadasu , palleku , podam , parunu , devada , o-parvati , akkineni , savitri , happy , anr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content