పాటతో పరమార్ధం- పుష్ప విలాపం- మహిళలకు పువ్వుల కన్నీటి విన్నపం- కరుణశ్రీ జంధ్యాల, ఘంటసాల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,503; 104 తత్వాలు (Tatvaalu) and views 226,434.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Pushpavilapam - flowers Tears plead for women - Karunasree Jandhyala Papaiah Shastri, Ghantasala

పాటతో పరమార్ధం - పుష్ప విలాపం - మహిళలకు పువ్వుల కన్నీటి విన్నపం - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఘంటసాల

గొంతు కురి బిగించి, గుండెలో సూదులు గ్రుచ్చి, కూర్చి, ముచ్చట ముడుల మమ్ము ముడుచుకొందురు, దయలేని వారు, మీ ఆడవారు అంటున్నాయి పూలు. అందమును హత్య చేసెడి హంతకుండ, మైలపడిపోయే నోయి నీ మనుజ జన్మ అంటున్నాయి - ఇవి మా మాటలు కాదు, ఈ పాటలో ఉన్న మిగతా బిరుదులు కూడా వినండి. అర్ధం అయ్యిందా, మనము తెలీకుండానే ఎన్నో పాపాలు చేస్తున్నాము, నల్లులు దోమలు చీమలు బొద్దింకలు, అలాగే పూలను వాటి తల్లి నుంచి విడదీయడం. అందుకే మానసిక ధ్యానం దైవ పూజ ఉండాలి, పాప పరిహారం కోసం.

దయ జాలి కరుణ ఎవరిలో ఎక్కువ ఉన్నాయి అంటే, మగ వారి కన్నా మహిళలో అని గబుక్కున చెబుతారు, పాత సావిత్రి గారి సినిమాలు చూసిన వారు. ఇప్పుడు పెళ్ళి అంటే, కుర్రాళ్ళు భయపడుతున్నారు బావురుమంటున్నారు, ముద్దు మురిపెం తీరిన సంవత్సరం లేదా 20 ఏళ్ళ కైనా ఏ కేసులో, తాను తన వాళ్ళు ఇరుక్కుని, ఏమేమి వదిలించుకోవాలో అని. గతములో కట్నాలకు ఎంత రాచి రంపాన పెట్టారో, ఇప్పుడు వాటి ఫలితాలు మగవారిని వారి తల్లి దండ్రులను వెంటాడుతున్నాయి. ముందు, మంచి గా చెపితే, ఎవరు వినరు కదా?

దానికి మూలం, తల్లి దండ్రులలో నిండుకుపోయిన, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం. తమ ముదుసలి తల్లి దండ్రూల పై ఎటూ జాలి లేదు, అలాగే తమ పిల్లల సంస్కార పెంపకం పై, కూడా జాలి, తీరిక కూడా లేదు. అందరమూ ఎంతో సంపాదించి, అన్ని వస్తువుల రేట్లు కల్తీలు పెంచి, మిగతావారికి ఏదీ దొరకనీయకుండా చేసి, సంఘములో గొప్ప ఆస్తిపరులుగా ఉండాలి అని వీరి తాపత్రయం, అన్ని రోగాలు వ్రుద్ది చెందినదాకా.

సున్నిత మనసు గుణం ప్రధానం అనేది ఎప్పుడో మరచారు. గుణవంతుడు అని తెలిస్తే, చేతకాని వారు అని, పిల్లను కూడా ఇవ్వరు నేడు. అదే ఈడియట్ పొరంబోకు తాగుబోతు తిరుగుబోతు రాతి గుండే కలవారు, కానీ ఆస్తి అధికారం పదవి వీసా ఉంటే చాలు. కాళ్ళపై పడి, వర దానం చేస్తున్నారు.

కానీ చివరలో అనాధాశ్రమమే తమకు కూడా మిగిలేది అని వారికి నేడు అనిపించదు. చుట్టూ కనపడేది గ్రహించరు. తమకు అలా జరగదు అని అనుకుంటారు, అదే ప్రాపంచిక మోహం. దాని నివారణ కోసమే, మన శనివారం నియంత్రణ సాధనలు. అవి 5 ఏళ్ళుగా చదవని వారు, స్పందించని వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి, తమకు తాము తల రాత మార్చుకుంటూ, చివరకు కపటం తో, దేవుడు అన్యాయం చేసారు అంటారు.

మొన్న గుడినుంచి, అమ్మ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటే, ఒక పెద్ద వయస్సు తెలుగు జంట, రోడ్ వెంట నడుస్తూ, 4 రోడ్ల కూడలిలో చెట్టు పువ్వులు తెంప బోయారు, అందులో పెద్దావిడ. తప్పు అలా చేయవద్దు అని చెప్పాను, ఖర్మ కాలి మనకే కనపడతాయి ఇలాంటివి అన్ని, వాళ్ళతో తిట్టించుకోవడానికి. కానీ క్రిష్ణయ్య చెప్పారు, వింటారా లేదా అనవసరం, మంచి చెప్పి చూడు, అంతే, ఫలితం దేవునికి. ఇదేమన్న, మీ సొమ్మా అన్నట్లు గా ఇద్దరు చూసారు.

పాపం పెద్దాయన నోరుముసుకుని ఉన్నారు, ఇంట్లోనే విలువ లేదు, ఇంక రోడ్ మీద భాగస్వామి తో తిట్లు ఎందుకు అని. ఇద్దరికి చెప్పాను, అవి మన చెట్లు కావు, మనం నీళ్ళు పోయలేదు, అందానికి వారు పెట్టుకున్నారు, నిర్దయగా మనం కోయకూడదు ఆ పువ్వులను, మనకు హక్కు లేదు మర్యాద కాదు, ఇది 4 రోడ్ల కూడలి, అందరూ మనల్నే చూస్తున్నారు, లేకి బుద్ది అనుకుంటారు, ఎదురుగా కెమేరాలు మొత్తము రికార్డ్ చేస్తున్నాయి, మీకు ఇంట్లో పిల్లలు జాగ్రత్తలు చెప్పి ఉండాలి బయటకు పంపేటప్పుడు అన్నా.

అంతే, కెమేరాలు అన్న మాటకు భయపడ్డారు, గమ్ము గా వెళ్ళి పోయారు. చెప్పండి, వీళ్ళు, తమ పిల్లలకు సంస్కారం నేర్ప గలరా? తమ ముదుసలి తల్లి తండ్రిని గౌరవముగా చూడ గలరా? ధనం మత్తు, సంస్కారాన్ని అణిచివేస్తుంది, దుర్యోధనుని అహంకారాన్ని అలవాటు చేస్తుంది.

ఇదిగో మన పాటకు కావల్సింది, పువ్వులు కొస్తే, అవి బాధపడతాయా అన్నది ఇంకో కోణం, అదే ఈ పాట. ఆకులు అలములకు ప్రాణం ఉంది, కాని మనం బతకాలి తినాలి కాబట్టి తప్పదు. మరి పూలు? కేవలం తలకోసం, కోరికల కోసమా? అందుకే అవి ఏడుస్తున్నాయి, మొరపెట్టుకుంటున్నాయి. మమ్మల్ని దేవునికి మాత్రం ఉపయోగించండి అంటున్నాయి. లేదా మా బతుకు, మమ్మల్ని బతకనీయమంటున్నాయి.

మీరు మొత్తము పాట విని, పాడి, మనసులో ఇంకా తడి ఉందో లేదో ఒక సారి చూసుకుంటారు కదూ? ఎందంటే, మనసు లేని వారికి, భక్తి ఉండదు. మానసిక బలం ఉండదు. మానసిక నియంత్రణ/ ఆధ్యాత్మిక శక్తి ఉండదు. పూలకోసం తోటలోకి వెళ్ళిన భక్తునితో పూలు ఏమన్నాయి, చివరకు ఏమి చేసారు తను, ఈ పాటలో వినండి, చదవండి.

* * *

మీ పూజ కొసం, పూలు కొసుకొద్దామని ప్రొదున్నె, మా తోట లోకి వెళ్ళాము ప్రభు

ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో, ఉద్యానం కళకళలాడుతుంది. పూలబాలలు తల్లి ఒడిలో, అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి, అప్పుడు …

నేనొక పూలమొక్క కడనిల్చి, చివా.లున కొమ్మ వంచి
గోరానే.డు నంతలోన విరులన్నియు
జాలిగా నోళ్లు విప్పి, మా.. ప్రాణము తీ.తువా... యనుచు బావురుమన్నవి,
క్రుంగిపోతి. మా మానస మందే.దో. తళుకు మన్నది , పుష్పవిలాప కావ్యమై...ఆ

అంతలో, ఒక సన్నజాజి సన్నని గొంతుకతో, మమ్ము చూచి ఇలా అన్నది ప్రభు

ఆయువు గల్గు నా.ల్గు గడియల్, కనిపెంచిన తీగతల్లి, జాతీయత దిద్ది తీర్తుము,
తదీ.య కరమ్ములలో.న, స్వేఛ్ఛ.మై నూయల లూగుచున్, మురియు చుందుము,
ఆయువు దీరినంతనే, హాయిగ కన్ను మూసెదము, ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై…..ఆ

ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డువస్తావు, మేం మీకేం అపకారం చేసాం

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు ;
మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో,
తాళుము, తుంపబోకుము
తల్లికి, బిడ్డకు, వేరు సేతువే..ఏ ఏ !!

ఇంతలో ఒక గులాబి బాల, కోపంతో ముఖమంతా ఎర్రబడి, ఇలా అన్నది ప్రభు…

ఊలు దారాలతో. గొంతు కురి బిగించి
గుండెలో. నుండి, సూదులు గ్రుచ్చి, కూర్చి
ముడుచుకొందురు, ముచ్చట ముడుల మమ్ము..
అకటా.., దయలేని వారు, మీ ఆ.డవా.రు..

పాపం, మీరు దయాదాక్షణ్యాలు గల మానవులు కాబోలు అని..

మా. వెలలే.ని, ముగ్ధ సుకుమార, సుగంధ మరంద మా.ధురీ జీవితమెల్ల,
మీకయి త్యజియించి, కృశించి, నశించిపోయి - మొత్తము 2 సార్లు
మా.. యౌవనమెల్ల కొల్లగొని, ఆ పై చీపురుతో.డ చిమ్మి,
మామ్మవల పారబోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా….

ఓయీ మానవుడా…
బుద్ధ దేవుని భూమిలో పుట్టినా.వు, సహజమగు ప్రేమ నీలోనచచ్చెనే.మి
అందమును హత్య చేసెడి హంతకుం.డ., మైలపడిపోయే నో.యి నీ.. మనుజ జన్మ..ఆ

అని దూషించెడి పూలకన్నియలు కోయలేక, ఒట్టి చేతులతో ఒచ్చిన, మా ఈ హృదయ కుసుమాంజలి, గైకొని,

మా పై మి కరుణశ్రీ రేఖలు ప్రసరింప చేయుము …ప్రభూ..ప్రభూ..

* * *

Pushpavilapam Telugu Original Song By Ghantasala & Jandhyala Gaaru

చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసే హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,503; 104 తత్వాలు (Tatvaalu) and views 226,434
Dt : 11-Jun-2023, Upd Dt : 11-Jun-2023, Category : Songs
Views : 235 ( + More Social Media views ), Id : 1785 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pushpavilapam , flowers , Tears , plead , women , Karunasree , Jandhyala , Papaiah , Shastri , Ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content