Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఈ వారంలోనే, నూతన సంవత్సర రాత్రి పండుగ వేడుకలో, అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరములో, ఇరు తెలుగు సినిమా హీరోల అభిమానులు దానికి ముసుగు లింక్ ఉన్న తెలుగు పార్టీల నాయకులు అనుచరులు, సిగ్గు లజ్జ ఇంగితజ్ఞానం సంస్కారం విశ్వసనీయత క్రుతజ్ఞత విడిచి, పరాయి నేలకు ఎందుకు వచ్చాము తల్లి దండ్రులు ఎందుకు పంపారు అన్న సంగతి వదలి, అహంకార మదముతో అన్నదమ్ముల వలే ఉండలేక, ఊగిపోతూ తిట్టుకుంటూ నెట్టుకుంటూ తన్నుకుంటుంటే, ఊరక వచ్చిన ధన అరిషడ్వర్గాల మత్తులో ఒళ్ళు తెలియక ఉంటే, ఆ గోల గందరగోళం ఆపడానికి, పోలీసులు వచ్చి, తగవులు ఆపి, ఏవరినో అరెస్ట్ చేసారు అంట.
బెయిల్ పై విడిపించడానికి పెద్దలు బయలు దేరారు అంట, తమ పార్టీ అవసరాలకు వీరి అండ కావాలి కాబట్టి. అది ఆ అభిమానులకు ఆ పార్టీలకు ఆ నాయకులకు మచ్చ. ప్రాపంచిక బ్రమలకు ఉదాహరణ.
వీరికి మరియు వీరి తల్లి దండ్రులకు కూడా, ఈ పాట పంపి, దాని అర్ధం నేర్పిస్తే, ఇకనైనా బుద్దిగా, తెలుగు జాతి ని ఇతర దేశాల్లో అవమానించకుండా, ఉంటారు అని ఆశ. వయస్సు ఎంత పెరిగినా, చదువు ఎంత చదివినా, ఎంత పెద్ద వ్యాపారం ఉద్యోగం ఉన్నా, బుద్ది జ్ఞానం సంస్కారం పెరగకపోతే, తల్లి దండ్రులు చిన్నప్పుడు సంస్కారం నేర్పకపోతే, ఇలాంటివి ఇంకా పెచ్చు పెరిగి, విదేశాల్లో కూడా, తప్పుడు వారి జాబితాలో మనమే ముందు నిలవవచ్చు.
ఇప్పటికే విదేశాల్లో కూడా, సొంత ముదుసలి అమ్మా నాన్నను మంచి వైద్యం సౌకర్యాలతో ఇంట్లో ఉంచుకోవడం చేతకాకపోయినా మనస్కరించకపోయినా, పిల్లలకు తెలుగు రాయడం సంస్కారం నేర్పడం చేయకపోగా, ఎవరికోసమో దేనికోసమో పిచ్చికేకలు వేస్తూ గుడ్డలు చించుకుంటూ, కార్లు హెలికాప్టర్ లో జెండాలు ఊపుతూ, మైకములో తిరుగుతూ ఉన్నది మనకు తెలుసు. ఇకనైనా జాగ్రత్తలో ఉంటే మంచిది అని పెద్దల భావన.
విదేశాల్లో చదువుకునే కొత్తగా ఉద్యోగాలు చేసే పిల్లలకు చెప్పాలి, పిజ్జ బర్గరు కోక్ బిర్యాని బీరు ట్రిప్ లకు ఇతర సౌకర్యాలకు, ఆత్మను వ్యక్తిత్వాన్ని అమ్ముకోవద్దు, బానిసలు గా బతకవద్దు అని, నాయకులు సినిమాల పిచ్చి వదిలి, సంస్కారం గా జీవించమని.
కుక్క తోక వంకరే ఎక్కడ ఉన్నా, శునకాన్ని సిమ్హాసనం మీద కూర్చోబెట్టినా దాని లక్షణాలు విడువదు అన్న ఉదాహరణ గా మిగిలామా? ఏ దేశమేగినా ఎందుకాలిడినా, మన తక్కువ బుద్దులు మానుకోకపోతే ఎలా అని, అందరి ఎదురు ప్రదర్శనలు ఎందుకు అని, విజ్ఞులు బాధపడుతున్నారు.
కులములోన తేడాలున్నా, గుణము దానికన్నా మిన్న. నిజము తెలిసి, నీతి పధానా, సాగండి, అన్ని వేళలందు మీరు, అన్నదమ్ములల్లే మెలగి, కలసి మెలిసీ ఉండాలండీ, నిండుగా, అని ఎంత బాగా చెప్పారు ఈ పాటలో.
మంచిదారి, వెలుగుదారి వీడక నడచీ, తెలుగువారి తేజము నిలిపి, బ్రతుకు లోన ముందుకు వచ్చీ, భరతమాత దీవించేనూ, చల్లగా. మరి ఇకనైనా, మన ఊళ్ళో అయినా విదేశం లో అయినా, నీతి నిజాయితీ సంస్కారంతో ఉండి, భరత దేశానికి, తెలుగు ఆత్మ గౌరవానికి, మర్యాద నిలుపుదామా?
చిరంజీవి పిల్లల్లారా.., చిన్నారి పాపల్లారా.
చింతలేక జీవించండీ, హా.యిగా. ఆ ఆ 2
కులములోన తేడాలున్నా., గుణము దానికన్నా మిన్న.
నిజము తెలిసి, నీతి పధా.నా, సాగుడీ.. - 2 సార్లు మొత్తము
అన్ని వేళలందు మీరు, అన్నదమ్ములల్లే మెలగి
సిరులే పొంగే జీవంలోన,
కలసి మెలిసీ ఉండాలండీ, నిండుగా. ఆ ఆ 2 ||చిరంజీవి పిల్లల్లారా||
మహామహులు చూ.పినట్టి, మంచిబాట మీ.రు పట్టి.
మనసులో.న, మంచిని పెంచి, మించుడీ.. - 2 సార్లు మొత్తము
వెలుగుదారి వీడక నడచీ, తెలుగువారి తేజము నిలిపి
బ్రతుకు లోన ముందుకువచ్చీ
భరతమాత దీవించే.నూ, చల్లగా. ఆ ఆ 2 ||చిరంజీవి పిల్లల్లారా||
Nithya Kalyanam Paccha Thoranam - Chiranjeevi Pillallaaraa - Chalam, Krishna Kumari, ramakrishna, dallas, texas, newyear
--ఆరుద్ర,ఎస్.జానకి, పెండ్యాల నాగేశ్వర రావు,నిత్య కళ్యాణం పచ్చ తోరణం 1960
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,288,707; 90 తత్వాలు (Tatvaalu) and views 176,144 Dt : 05-Jan-2023, Upd Dt : 05-Jan-2023, Category : Songs
Views : 181
( + More Social Media views ), Id : 1690 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
nithya ,
kalyanam ,
paccha ,
thoranam ,
chiranjeevi ,
pillallaaraa ,
chalam ,
krishna ,
kumari ,
ramakrishna ,
dallas ,
texas ,
newyear Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments