Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కొన్ని సార్లు మనకు కొన్ని విచిత్రంగా ఉంటాయి, జరుగుతాయి. పెంపుడు జంతువులు కూడా, మన మాటలు విని, దానికి తగ్గట్టు గా చేస్తాయి. మరి వాటికి భాష ఎలా తెలుస్తుంది? ఎలా అర్ధము అవుతుంది? అంటే, వాటికి భావము అర్ధమవుతుంది, తగినట్లుగా నడచుకొంటాయి. కొన్ని సార్లు మాటలతో బాటు, సంజ్ఞలు చేయడం కూడా ఉపయోగపడుతుంది. అంటే, సహకరించాలి అని ఉద్దేశ్యం ఉంటే, అన్నీ అనుకూలిస్తాయి. అంతేనా?
ఇక మనుష్యుల సంగతికి వస్తే, దివ్యాంగుల తో సమాచార మార్పిడి కూడా, మనసు ఉంటే, చాలా తేలికనే. మనకు ఇష్టం లేకపోతె, మామూలు సాటి తెలుగు వాడు చెప్పేది కూడా, మనకు అర్ధము కాదు, ఎక్కదు.
ఇక అసలు విషయానికి వస్తే, ఇక్కడ, చుట్టూ తెలుగు వారు ఉన్నా కూడా, మన ఊర్లో లాగే అవసరముంటేనే, ఇతరులతో మాట్లాడుతారు కలుస్తారు. మరి మాట్లాడటానికి, ఎవరూ లేకపోతే ఎలా. టీవీ లో తెలుగు ప్రోగ్రాం ఉన్నా, అప్పుడప్పుడు, ఇబ్బంది గా బోర్ గా ఉంటుంది. అందుకే, వారాంతములో బయట చూడటానికి, గుడులకు కూడా వెళతాము.
2 ఏళ్ళ క్రితం మాటలు ఇవి. 5 ఇళ్ళ అవతల, ఒక మలయాళం(కేరళ) కుటుంబం ఉంటారు, ఆ అమ్మాయి కడుపుతో ఉంది. కేరళ వాళ్ళు ఇక్కడ తక్కువ, తెలుగు వాళ్ళతో పోలిస్తే. పాపం ఆ అమ్మాయికి ఏమి తోచక, ఎటు వెళ్ళలో తెలియక, అమ్మ తో వచ్చి మాట్లాడేది. మధ్యాహ్నం 12 నుంచి 1 దాకా.
నేను ఆఫీస్ నుండి అమ్మకు ఫోన్ చేస్తే, తర్వాత చెయ్యి అని, నిమిషములో పెట్టేసేది అమ్మాయి వచ్చింది అని. సాయంత్రం వచ్చాక, అన్ని విషయాలు చేప్పేది. అలా వారానికి, ఒకసారి వచ్చేది అమ్మతో మాట్లాడటానికి.
నాకు అయోమయం గా ఉండేది, ఆమెకు తెలుగు రాదు, అమ్మకు మలయాళం రాదు. మరి ఎలా అర్ధము అవుతున్నాయి, మరి గంట సేపు ఎలా మాట్లాడుతున్నారు విసుగు లేకుండా, వేరు వేరు భాషలలో. వయసు భేదం తో, ముసలి వాళ్ళతో ఎక్కువ సేపు, పని లేకుండా అసలు మాట్లాడరు కుర్రవాళ్ళు..
సరే, మనకెందుకులే, వాళ్ళే విసుగు పుట్టి ఆపేస్తారు అనుకున్నా. ఇద్దరూ ప్రసాదాలు, కాయలు పంచుకునే వారు. మరి మన పండగలకి, ప్రసాదం పెట్టలి గదా.
అలా సంవత్సరం గడిచింది, కానుపు అయ్యింది, పిల్ల వాడు పుట్టాడు. 6 నెలల వరకు, ఇద్దరూ కలసి వచ్చారు, తర్వాత చిన్నగా తగ్గిపోయినది రావడం. వాళ్ళ ఆయన, నేను కలసినపుడు, ఇంగ్లీష్ లో, నిజమేనా అని ఇద్దరము మాట్లాడుకునే వాళ్ళము, ఆడవాళ్ళ భాష మార్పుతో ఇబ్బందులు లేకుండా.
మా అమ్మ అర్ధము చేసుకొని చెప్పినది అంతా నిజమే, ఉదాహరణకు ఇప్పుడు 3 వ నెల, సాయంత్రం హస్పిటల్ కి వెళతారు, వాళ్ళ ఊరు ఇది, ఆయన ఉద్యోగం ఇది ఫలానా ఊళ్ళో , వారం యాత్రకు వెళుతున్నారు ఫలానా ఊరు , . . .
ఇప్పటికీ పిల్లవాడు, అమ్మను నడిచేటప్పుడు చూస్తే, నవ్వుతూ దగ్గరకు వచ్చి మలయాళం లో ఏదో చెపుతాడు, అమ్మ తెలుగు లో ఏదో చెపుతుంది, మరలా కొత్త కధ మొదలు, . . .
ఇంకో వ్యక్తి, అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో పని చేసే అతను అమెరికన్, మంచివాడు. అచ్చం ట్రంప్ లాగా ఉంటాడు, కష్ట జీవి. ఇంట్లో ఏమన్నా సమస్యలు వస్తే, మనము లీజ్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే, సర్వీస్ టికెట్ తయారు చేసి వరుస సంఖ్య లో, వారు మన ఇంటికి అతనిని పంపుతారు. అతను, అటు ఇటూ తిరుగుతూ, మనకు కనపడతాడు రోజూ.
ఒక రోజు ఆయనను పిలిచింది, అతనితో వంటగదిలో సమస్య ను, సరి చేయించింది. ఆఫీస్ నుండి వచ్చాక చెప్పింది, వామ్మో, ఏమని చెప్పావు, అతనికి ఏమి అర్ధము అయ్యింది. టికెట్ లేకుండా ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయా. అలా చెయ్యొద్దు, విసుక్కుంటారు, అర్ధం గాక ఇంకేదో చేసి వెళితే కష్టము అని చెప్పాను.
వాట్సాప్ లో ఆయన బాగుచేసే పనిని, ఫొటో తీసి పంపింది. కాగితం మీద, ఏమి చేస్తున్నాడో తెలుగు లో రాస్తుంది నాకు. ఆఫీస్ మధ్యలో ఫోన్ మాటలు కష్టం కదా.
పెద్దవాళ్ళు, మన మాట వినరు గదా. మరల అతనిని పిలవడం, మిగతా పనులు చేయించడము, మన ప్రసాదాలు కాయలు పండ్లు ఇవ్వడం. గుడి ప్రసాదాలు, స్వీట్లు , బెల్లపు అన్నము, గారెలు పెట్టింది, పానకము పోసింది. వాళ్ళకు ఈ తిండ్లు పడవు, జాగ్రత్త అని అమ్మకు చెప్పి, అతనిని అడిగాను, మా వంటకాలు ఇబ్బంది గా మంటగా లేవా అని?
అతని జవాబు, ఐ యాం వెరీ హపీ, షి ఈజ్ మై సిస్టర్, ఐ కెన్ ఈట్ ఏనీ థింగ్ ఫ్రం హర్ అన్నాడు. అంటే, మా అక్క ఇచ్చింది ఏదైనా ఆనందంగా తింటాను అని అర్ధం. ఓరి నీ దుంపతెగా, అక్క ఎప్పుడు అయ్యింది అని నవ్వుకున్న. అతను కనపడితే, హల్లో బ్రదర్ అంటుంది, అతను హెల్లో మై యంగ్ సిస్టర్ అంటాడు. ఆయనేదో ఇంగ్లీష్ చెపుతాడు, ఈమేదో తెలుగులో చెపుతుంది.
అటు ఇటూ తిరిగేవాళ్ళు అర్ధము గాక జుట్టు పీక్కుంటారు. వాళ్ళ మేనేజరమ్మ కూడా - నేను కారు పెట్టి వస్తుంటే, వాళ్ళు ఇద్దరూ చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు అంది నవ్వుతూ. కాని ఎంతో కొంత, అక్కకు తమ్ముడికి అర్ధము అవుతుంది. అప్పటినుండి ముందు వచ్చి పని చేసి, తర్వాత అతనే సర్వీస్ టికెట్ తయారు చేసుకుంటున్నాడు, మన ఇంట్లో చేసిన రిపేర్ పనులకు.
ఉదాహరణకు, 2 వారాలు సెలవు తో వాళ్ళ కుటుంబముతో యాత్ర పోతున్నాడు. రేపు రాడు. మన ఇంటి ఎదురు, రేపు చిమ్మిస్తాడు అంట బయట చెత్త. ఇలా సాగుతూ ఉంది 5 ఏళ్ళుగా, ప్రస్తుతము తెలుగు అక్క ఇంగ్లీష్ తమ్ముడి విదేశీ భాష మాటలు.
పని వాడు మారినా, ఇబ్బంది లేదు, ఎవరితోనైనా తెలుగు లో నే మాట్లాడి పని చేయించుకుంటుంది. కొత్త పని ఆయన వచ్చాడు, ఆఫ్ఘన్ అనుకుంటా. అతను చిన్న గా అర్ధము చేసుకోవడం మొదలు పెట్టాడు.
పార్క్ లో తిరుగుతూ ఉంటే, ఉత్తర భారతం హిందీ లేదా తమిళం వాళ్ళు వస్తే, వాళ్ళతో కూడా తెలుగులో మాట్లాడుతుంది అమ్మ. ఎప్పటి లాగే వాళ్ళు హిందీ/ తమిళం లో జవాబు చెపుతారు.
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా, మనకు అందరూ చుట్టాలే, దేవుళ్ళే.
ఎదుటివారిది ఏ దేశమైనా, ఏ భాష అయినా, అమ్మ ఉపయోగించేది మాత్రం, తెలుగు భాష అంతే, అర్ధం చేసుకుంటారో లేదో మనకు అనవసరం. కాని అర్ధము చేసుకుంటున్నారు చాలా వరకు. అమెరికా వ్యవస్థ పెద్దవారికి(ముదుసలి) వారికి, చాలా గౌరవము ఇస్తుంది.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,677,212; 102 తత్వాలు (Tatvaalu) and views 207,673 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments