APLatestNews.com top Banner

Social Media links
కనీసం మనసు ను ఆత్మను బండ రాయిలాగా మొద్దుబారకుండా, కొంత బూజు దులపడానికి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మనందరికీ వ్యాపకాలు, వ్యాపారాలు, హోదాలు, సంపాదనలు, ఇంకేవేవో వంద ఉండవచ్చు. ఇవి బతకడానికే గాని, ఇవేవీ మానసిక ఆనందం, మానసిక బలం, మనసు ను నిగ్రహించడం ఇవ్వవు నేర్పవు. వీటిని ఎక్కడ నుండి కొనలేము , సంగ్రహించలేము. మనకు మనమే ప్రయత్నం సాధన చేయాలి. అది చేయాలి అంటే, మన మనసు కదలాలి. కోట్లు ఉన్నవారు కూడా, వందల సమస్యలలో కొట్టు మిట్టాడుతున్నారు.

అది ఎలా కదలాలి అంటే, కనీసం ఒక మిత్రుడు సొంతంగా పంపిన ఒక మాట లేదా ఒక ఫోటో కు, కనీస స్పందన ఇచ్చే విధంగా. ఇంతకన్నా ఏమీ చేయలేనప్పుడు, ఇదే తేలికగా ఉంటుంది కదా, కనీసం మనసు ను ఆత్మను బండ రాయిలాగా మొద్దుబారకుండా, కొంత బూజు దులపడానికి.

కానీ మన మనసులో మాటలు బయటకు రావాలి, చిన్న చిన్న మాటల రూపంలో తెలుగులో. అంటే మాతృభాషను గౌరవిస్తూ ఉన్నాము. అంటే కన్నతల్లి ని గౌరవించడం తెలిసే ఉంటుంది. ఓ మాటలో ఓ ఫోటోలో, ఆ ప్రేమ చూపించు మిత్రుడా. కనీసం మన పిల్లల మీదైనా, సంస్కారము మంచి పనులు గురించి, నాలుగు తెలుగు మాటలు రాయి, కాగితము మీద లేదా వాట్సాప్ లో మిత్రులకు.

అయినా రాయడానికి, ఏమీ లేదా? మనల్ని ఇంత వాళ్ళను చేసిన సమాజానికి, సామాజిక బాధ్యత ఉన్నది అని తెలియడం కోసం, మన సొంత పుట్టిన ఊర్లో, జరుగుతున్న ఒక మంచి ని లేదా చెడు గురించి చెప్పు, మిత్రులు కు నాలుగు మాటలు. అదేఅ రాయలేవా, కృతజ్ఞతలు కలిగిన మానవా?

పర్లేదు, కనీసము భగవంతుని మీద రాయి. భగవద్గీత లో ఓ శ్లోకం కు నీ సొంత అర్థం, మంచిగా రాయి. ఇన్ని సౌకర్యాలు ఇచ్చిన భగవంతుని కి కృతజ్ఞతలు తెలియజేయి. కనీసం వేమన లేదా సుమతీ శతకము పద్యం గురించి రాయి. ఇవేమీ కృతజ్ఞతలు మనకు లేకపోతే జ్ఞప్తికి రాకపోతే, మన పిల్లల కు సంస్కారం ఎలా వస్తుంది? మనకు లేని సంస్కారము, వారికి ఎలా నేర్పుతాం. కరోనా అప్పుడు కూడా మారమా?

వారికి అంటే మన పిల్లల కు సంస్కారం లేకపోతే, మనకు మనశ్శాంతి ఎలా వస్తుంది? మరి ఇన్నాళ్లు మన సుదీర్ఘ జీవితంలో, సాధించినది ఏముంది? కోట్లు ఉన్నా కూడా, మానసిక బలహీనత తో ముదుసలి తనం లో పతనం అయి, కన్నీళ్ళు తో ఈ లోకాన్ని విడుస్తూ, మరు జన్మలో పాప ఫలాలను అనుభవించడమే, మన జీవితం లక్ష్యం మన గమ్యం అనుకుందామా? కానే కాదు, మేలుకో మిత్రమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 798 General Articles, 46 Tatvaalu
Dt : 12-Jul-2020, Upd Dt : 12-Jul-2020, Category : General
Views : 128 ( + More Social Media views ), Id : 594 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : mind , soul , dont make like rock , clean them
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content