అల్లూరి సీతారామరాజు - తెలుగు వీరలేవరా దీక్షబూని, రగిలింది విప్లవాగ్ని, కల మురళీ - కృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1766 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,265; 94 తత్వాలు (Tatvaalu) and views 184,787.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

డేరింగ్ డాషింగ్ హీరో నటశేఖర సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, జన్మ దిన శుభాకాంక్షలు, మే 31. ఆయన 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందముగా జీవించాలి.

అందరూ, కేవలం మాటలతో విషెస్ చెపితే, మనము 2 అల్లూరి విప్లవ దేశభక్తి గేయాలతో, ఆనాడు తెల్లదొరల పాలనలో మనవారు పడ్డ కష్టాలు ఎదురు తిరిగిన విధానాన్ని తలచుకుంటూ, ఆయనపై మనకున్న గౌరవాన్ని తెలియపరుద్దాం.

ఆయనకున్న ధైర్య సాహసాలు ముక్కుసూటి తనం, మహేష్ బాబు కు కూడా రాలేదు.

ఆయన నిజం గా ఆ బిరుదులకు తగిన వ్యక్తి, చాలా మందికి తెలీదు ఆయన గొప్పతనం. అది సినిమాలో తెరపై హీరో గొప్పతనం కాదు, నిజ జీవితం లో కూడా, ఆయన సూపర్ స్టార్. ఆయన నటనా విశ్వరూపం డైలాగ్ డెలివరి అల్లూరి సీతా రామరాజు సినిమాలో చూడాలి. ఆ మన్య వీరుడు ఎలా ఉంటాడో ఆయన ఆవేశం దేశభక్తి, కళ్ళకు కట్టినట్లు చూపారు.

చాలా మంది, సినిమా పరిశ్రమ మీద బతికారు, వెనకేసుకున్నారు. కానీ ఆ పరిశ్రమనే బతికించి, ఎంత ఖర్చు కైనా వెనకాడక, కొత్త టెక్నాలజీ లు ముందుగా, మొదటిసారిగా మనకు పరిచయం చేసింది, కేవలం కృష్ణ గారు మాత్రమే. ఈ విషయం లో ఎంటీయార్, ఏయెన్నార్ కూడా, పోటీలో ఉండరు.

తన ఆలోచనలకు ఆవేశానికి ఆత్మాభిమానానికి తగ్గ, విజయ నిర్మల 2 వ భార్య గా దొరకడము తో, సినీ విలాకాశము లోకి దూసుకుపోతూ, జంటగా ఎన్నో అద్భుతాలను స్రుష్టించారు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

చాలా మంచి వ్యక్తి, ఎవరినీ పల్లెత్తు మాట అనరు. మ్రుదు స్వభావి. ఒకానొక సమయములో, ఎంటీయార్ కూడా సినిమాలు లేకుండా ఇబ్బందులలో ఉంటే, కృష్ణ గారే, దేవుడి చేసిన మనుషులు అన్న సినిమాలో అవకాశం ఇచ్చి, చేయూత నిచ్చారు అని అంటారు.

ఎంటీయార్, రాజకీయాలలో కి వచ్చాక, ఆయనకు వ్యతిరేకము గా, నేరుగా అలాంటి రూపాన్నే మాటలనే సినిమాలో పెట్టి, ఆయన ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ, మండలాధీశుడు లాంటి సినిమాలు తీసిన ఏకైక ధైర్యశాలి, కృష్ణ.

అభిమానుల ఆరాధ్య దైవం, నిజాయితికి నిలువెత్తు నిదర్శనం, సాహసి, నిగర్వి, ఏటికి ఎదురీదిన ధీరుడు, వెలకట్టలేని వజ్రం, తెలుగు సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ, మహమహులనుకుని విర్రవీగిన దురహంకారులను మట్టికరిపించిన, అలుపెరుగని యోధుడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొనగాడు, తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డ, హీరోగా డైరెక్టర్ గా నిర్మాతగా ఎడిటర్ గా, పద్మాలయ స్టూడియో అధినేతగా, తెలుగు సినిమా కళామతల్లికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు.

పంచె కడితే అచ్చ తెలుగు రైతు, పిస్టల్ పడితే స్వచ్ఛమైన జేమ్స్ బాండ్, టోపీ పెట్టి గుర్రం ఎక్కితే కౌబాయ్, తెలుగు తెర మీద మొదటి యాక్షన్ హీరో, మొదటి కౌబాయ్ హీరో, మొదటి జేమ్స్ బాండ్, మొదటి 70 mm మూవీ, మొదటి కలర్ మూవీ తీసింది, మొదటి సినిమా స్కోప్ తీసింది, మొదటి డాల్పి సౌండ్ సిస్టం తీసుకొచ్చింది, మొదటి భారీ బడ్జెట్ మూవీ తీసింది కృష్ణ గారు.

తెలుగు లో మొదట సంగీతం లో వైవిద్యం బప్పీలహరిని తీసుకొచ్చి చూపింది, సినిమా కార్మికులకు మొదట నాన్ వెజ్ తో భోజనం పెట్టించింది కృష్ణ గారు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎక్సపెరిమెంట్స్, మొదటిగా చేసిన ఉత్తమ వ్యక్తి కృష్ణ గారు.

1) ఓహోఓ..ఓఓహో ఓఓహో ఒఓఓహో ఓఓహో ఓఓహోఓఓ ఓఓ

తెలుగు వీరలేవరా..ఆఆ ..ఆఆ, దీక్షబూని సాగరా..ఆ ఆ ..ఆ ఆ
తెలుగు వీరలేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా 2 లైన్లు 2 సార్లు
ఆ ఆ ఆఆ ఆ.. ఓ ఓ ఓఓ ఓ..

ఒహోఓఓ దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా ఆ ఆ ఆ..
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా ఆ ఆ ఆ.. - 2 లైన్లు 2 సార్లు
నిదుర వద్దు బెదర వద్దు 2 నింగి నీకు హద్దురా 2
ఆ ఆ ఆఆ ఆ ఆ.. ఓ ఓ ఓఓ ఓ ఓ..

ఓ ఓ ఓ ఓ.. ఎవడువాడు ఎచటివాడు
ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు, ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండబలం కబళించే దుండగీడు, కబలించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, దోచుకునే దొంగవాడు
ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు
తగిన శాస్థి చెయ్యరా 2 తరిమి తరిమి కొట్టరా 2

తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వెచ్చ కోరి తిరుగుబాటు చేయరా ఆ ఆ ఆ ఆఆ.. ఓ ఓ ఓఓ ఓ..

ఈ దేశం ఈ రాజ్యం 2 నాదే అని చాటించి 2
ప్రతి మనిషి తొడలు కొట్టి
శృంఖలాలు పగలగొట్టి 2
చురకత్తులు పదును పట్టి
తుది సమరం మొదలుపెట్టి 2
సింహాలై గర్జ్జించాలీ.. 2 సంహారం సాగించాలీ..2
వందేమాతరంం వందేమాతరం 2

ఓ ఓ ఓ ఓ స్వాతంత్ర్య వీరుడా, స్వరాజ్య భానుడా
అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా - 2 లైన్లు 2 సార్లు
అందుకో మా పూజలందుకో రాజా 2
అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా

ఓఓఓ తెల్లవాడి గుండెల్లొ నిదురించిన వాడా
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా - 2 లైన్లు 2 సార్లు
త్యాగాలె వరిస్తాం కష్టాలె భరిస్తాం 2
నిశ్చయముగ నిర్భయముగ నీవెంటనె నడుస్తాం 2
నీ వెంటనె నడుస్తాం

Lyrics: Telugu veera levara.. -Alluri Seetharama…
Ghantasa, V.Ramakrishna

2) రగిలింది విప్లవాగ్ని ఈరోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు సీతారామరాజు 2

తనువులోన అణువణువున, తరతరాల పోరా..టం
తన రూపే దాల్చింది, ఝాన్సీరాణి కరవా.లం
జలియన్ వాలా బాగున, జరిగిన మారణ కాం.డ
తలచి ఎగురవేశాడు, తిరుగుబాటు జెండా.. తిరుగుబాటు జెండా.. ||రగిలింది||

కన్నెగంటి హనుమంతు, వెన్నులోని బాకూ
కత్తి గట్టి సాగమంది, కడ విజయం వరకూ
ఎలుగెత్తెను ఆ కంఠం, మన దే రాజ్యం..
జపియించెను ఆ వదనం, వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం||రగిలింది||

వందేమాతరం అంటూ నినదించిన బంగాళం
స్వరాజ్యమ్ము జన్మహక్కు అని చాటిన మహరాష్ట్రం
హింసకు ప్రతి హింస అన్న, వీరభూమి పాంచాలం
అన్నిటికి నెలవాయేను ఆంధ్ర వీర హ్రుదయం
రామరాజు హ్రుదయం

3) కల-మురళీ-రవ-రంజిత-కూజిత-కోకిల-మంజుల-మంజురుతే
మిళిత-మిళింద-మనోహర-గుంభిత-రంజిత-శైలనికుంజ-గతే |
మ్రుగగణభూత-మహాశబరీగణ-రింఖణ-సంభృత-కేళిభ్రుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 15 ‖

ధనుజ సుసంగర రక్షణ సంగపరిస్ఫుర దంగనటత్కటకే
కనక-విషంగ-పృషత్క-నిషంగ-రటద్భట-భ్రుంగ-హటాచటకే |
హత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహు రంగ-వలత్కటకే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 7 ‖

Alluri Sitaramaraj - Telugu Veeralevara Deekshabuni, Ragilindi Viplavagni, Kala Murali - Krishna

----------------

*నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అంటూ, ఇన్నాళ్ళు మన హ్రుదయాల్లో స్థిరంగా నిలచిన మంచి మనిషి, మనల్ని వీడి నీలా ఆకాశంలో, ద్రువ తారగా వెళ్ళిన, మన మాయదారి మల్లిగాడు* 11/15/2022

వర్గ పక్షపాతం లేని నిగర్వి, సాహసి, స్తితప్రజ్ఞుడు, సమతావాది ఆయన. సినిమాలే తన ప్రాణం గా జీవించిన ఆ మహా మనిషి గురించి, గతములో నే కధనం రాసాము.

తెలుగు చలనచిత్ర రంగ, ఇంకో స్తంభం కూలింది. కృష్ణ గారు శివైక్యం చెందారు. సూపర్ స్టార్ బిరుదు అ ఒక్కరికే సొంతం, నిజం గా మంచి మనిషి, ధైర్యవంతుడు, గుణవంతుడు. శ్రద్ధాంజలి, సద్గతి ప్రాప్తిరస్తు.

బాల్యం లో తెలుగు సినిమా ల లో అగ్ర నటులు - 1 ఎన్టీఆర్ 2 అక్కినేని 3 కృష్ణ 4 శోభన్ బాబు. 5. కృష్ణం రాజు 6. కాంతారావు 7. ఎస్వీ రంగారావు.

వెండితెర సాహసానికి ఊపిరి ఆగిపోయింది. తూటాల్లా డైలాగ్స్ పేల్చిన కంఠం మూగపోయింది. ఒక ఏడాదిలో, 18 సినిమాలలో నటించారు. 340 పైగా సినిమాలు. కొన్ని ఏళ్ళలో ప్రతి ఏడాది, కనీసం 10 సినిమాలు.

మహా మహులకి సవాల్ విసిరి లెజెండ్ గా ఎదిగిన డేరింగ్ & డాషింగ్ గుండె ఆగింది. కులం వర్గం వాసన లేని మహామనిషి. చివరిదాకా ఒకే పార్టీ లో ఉన్నారు, రాజకీయముగా.

ఎన్టీఆర్ సిఎం గా ఉన్న సమయములో, ఆయనకే వ్యతిరేకంగా, ఆయన లాంటి మనిషి ని కధానాయకుడుగా పెట్టి, అల్లుడు మరియు ఇతర నాయకుల అరాచకాలను, తూర్పారబట్టే సినిమాలు తీసిన, ధైర్యం ఆయనకే సొంతం. సాహసమే నా ఊపిరి సినిమా.

ఈ రోజు తో ఒక శకం ముగిసింది. కానీ తన లాంటి ఇంకో మనిషిని, కనీసం తన లాగా నటించే మనిషిని, అంటే మహేష్ బాబుని, మనకు ఇచ్చి వెళ్ళారు తన వారసునిగా అని, అభిమానులు శోకసముద్రములో కూడా, కొంత ఊరట చెందుతున్నారు.

కృష్ణ గారి లాంటి త్రికరణ శుద్ది సాహసనటుడు ఇంకొకరు లేరు, బహుశా రారు, చాలా మందికి ఆయన గొప్పతనము తెలీదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,265; 94 తత్వాలు (Tatvaalu) and views 184,787
Dt : 31-May-2022, Upd Dt : 15-Nov-2022, Category : Songs
Views : 629 ( + More Social Media views ), Id : 1409 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : alluri , sitaramaraju , telugu , veera , levara , deeksha , ragilindi , viplavagni , kala , murali , ghattamaneni , krishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content