Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం. ఉమ, రాము దంపతులు, వారికి ఒక పిల్లాడు. పేరుకు కుటుంబమే గాని, ఏ రోజూ కలసి ఉండరు ఒక చోట. భర్త విదేశం లో పని చేస్తుంటే, భార్య, అక్కడ ఇక్కడ ఊరూరు తిరుగుతుంటుంది. పిల్లాడు ఎక్కడో చదువుతుంటాడు, 2 లేదా 6 నెలలకో తల్లి, వెళ్ళి కలుస్తుంటుంది వీలును బట్టి.
ఇద్దరికీ మాట నిలకడ ఉండదు. ఇంట్లో పనులు కష్టం, ఇంట్లో వాళ్ళకి పని కొచ్చేవి కష్టం. బజారు పనులకు, ఇతరుల పని చేయటములో ముందు ఉంటారు కలసికట్టుగా. భర్త గడుసు చేష్టలకు, భార్య చిలక పలుకులకు, వాళ్ళు ఉన్న అన్ని ఊర్లల్లో కూడా, పేరు ప్రఖ్యాతులు గడించారు. ఏ ప్రాంతము లో ఉన్నా, వారి పరిమళాలు వెదజల్లుతునే ఉంటారు.
గోడ మీద పిల్లి(గోపి) లాంటి భర్త తో లేదా వారి వైపు వాళ్ళతో, అలాగ ఉంటే గాని సాగదు అంటుంది, ముందు జాగ్రత్త ఉన్న ఇల్లాలు. అవతలి వాళ్ళు అలాంటి వాళ్ళే నని, ఊరి జనాల ఉవాచ. భర్త, నిజమైన గోపి లాగనే, భార్యా పిల్లాడు లేకపొతే నే మనశ్శాంతి అని, విదేశం లో వాళ్ళతో వీళ్ళతో హయిగా తిరుగుళ్ళు , ఆనందముగా ఒక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఉమా తల్లి దండ్రుల నుంచి లాక్కోవాల్సింది లాక్కుని, మిమ్మల్ని చూడటము మా వాల్లా కాదూ అని ఎప్పుడో తేల్చేసారు. అత్తవైపు కూడా అంతే ఉంటుందేమో. అయినా, పుట్టింటికి వెళ్ళి ముసలి తల్లి తో చాకిరి చేయించుకోవాలని తెగ ఉబలాటము. ఒకసారి అక్కతో కలసి అన్నకు చెప్పకుండానే, ఇంటిలో 4 రొజులు తిష్ట వేసింది. రాము, గోపీ కదా, మొహమాటము లేకుండా, అది తప్పు అని చెప్పకుండా, కావాలంటే నువ్వే వెళ్ళు అనకుండా, తనూ వచ్చి ఉన్నాడు.
గౌరవము గా అన్నకు చెప్పి వస్తే, తప్పు లేదు, కాని దొంగ చాటుగా రావడమే తప్పు. మరలా పుట్టిల్లు అని చెప్పడం ఇంకో తప్పు. ఎందుకంటే తల్లినే చూడమని చెప్పేసారు గదా.
అన్న, ఇంటికి ఫోన్ చేసి, మాట్లడదాము ఫొన్ దగ్గరకి రమ్మంటే, దంపతులు ఇద్దరు కిందకు పోయి దాంకున్నారు. జంకు బిడియం సిగ్గు లేకుండా, లేరు బయటకు వెళ్ళారు అని చెప్పించారు. ఇరువురు అంత నిజాయితీ పరులు. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు:
భార్య: ఏవండి, పుట్టింటి నుంచి లాక్కున్న స్థలము, అమ్ముతుంటే వద్దని వారించలేదు ఎందుకని? అన్నిటి కాడ గొడవ పడతాము, ఈ విషయం లో, ఎందుకని తల్లి ఉన్న వరకైనా, నటిద్దాము అని చెప్పలేదు.
భర్త : వచ్చే డబ్బు దగ్గర, మనము ఎప్పుడైనా గొడవ పడ్డామా? మన ఇద్దరకూ, డబ్బే ముఖ్యము బంధము కన్నా, అని తెలీదా? జోక్ లు వేస్తున్నావు అన్నాడు.
భార్య : ఊరికే అడిగాలే, నాకు తెలీదా. ఇప్పుడు డబ్బుకు కక్కుర్తి పడని వారు ఎవరున్నారు. పాత నల్ల తెలుగు సినిమాలోనే ఇవన్నీ ఎప్పుడో చూయించారు.
భార్య: ఏవండి, మీ నిజాయితీ నచ్చింది. మా అమ్మను విదేశం తీసుకు రాలేదు, అలాగే మీ తల్లి దండ్రులనూ ఇక్కడకు తాలేదు. ఎంతో మిగిలిందో మనకు. పిల్లాడి నే మన దగ్గర పెట్టుకో లేదు, సీట్ రాలేదు లేదా డబ్బు ఎక్కువ అని. వీళ్ళు అవసరమా మన నెత్తిన.
భర్త : నేను కూడా మాటంటే మాటే, నువ్వు లేకపొయినా సర్దుకోవటము లేదూ నేనూ. డబ్బులు మిగులుతాయి అని, మన కన్న ఒక్కగా నొక్క పిల్లడి నే, ఆంధ్రాలో భోజనం పెట్టే బడిలో వేసి, హయిగా మన ఇద్దరము తిరగటం లేదా?
పిల్లాడిని ఒంటరిగా వదిలామే గాని, నేను విదేశం వదిలానా? అలాగే నువ్వు అంతే గదా? మన ఈడు జోడు కరెక్టే. ఇంక నా తల్లి దండ్రులను విదేశం తాకపోతే ఎవరు అడుగుతారు. అడిగితే, వీసా ఇవ్వరు అంటే పిచ్చొళ్ళు నమ్మేస్తారు. మీ అన్న కి, తల్లిని విదేశం లో, దగ్గర పెట్టుకోమని చెప్పా గాని, నేను నా తల్లి దండ్రులను 2 నెలలకు కూడా ఇక్కడకు తీసుకు రాను. వాళ్ళు రారు, అని కూడా చెప్తాను.
భార్య : నిజమండి, మనము ఒంటరిగా పెళ్ళి అయిన బ్రమ్మచారులు గా, హయిగా పది మంది లో తిరగాలి మెడలో 4 దండలు వేసుకొని. మన తల్లి, మన పిల్లాడు ఎట్లా పోయినా పర్లేదు.
సరే గాని, ఆల్రేడి చాలా బాధలు ఉన్నాయి ఒంట్లో, నాకు పెద్ద రోగము వచ్చి మంచము ఎక్కితే, పిల్లాడు నువ్వు వచ్చి దగ్గర ఉండి, నన్ను బాగా చూసుకుంటారా?
భర్త : అదేమిటి, ఇప్పుడే గదా అనుకుంది. కన్న బిడ్డ కోసమే విదేశం వదలి రాలేదు, నీ కోసము పిల్లాడు లేదా నేను ఎలా వస్తాము. మా సౌఖ్యము, సౌకర్యాలు, డబ్బు ముఖ్యము గదా.
భార్య : నిజం చెప్పారు, రేపు మీకు జరిగినా అంతే గదా?
భర్త : అవును, అందులో అనుమానము ఏముంది. మన ఇద్దరిదీ ఒకటే మాట, ఒకటే బాట.
ఇంకో మాట, మన పిల్లడిని కూడా, కొంత కాలము, మీ పుట్టింట్లో ఉంచాము గదా, మరి మీ చుట్టాలు మీ అమ్మను చూడలేదని ఉయ్యరా?
భార్య : భలే వారే, మీ తల్లి దండ్రులను వదిలేసారని, మిమ్మల్ని మీ చుట్టాలు ఊశారా? అంతే మా వాళ్ళు కూడా, అంది నవ్వుతూ.
భార్య : మా అన్న ఉద్యోగం లేకుండా అమ్మను చూస్తున్నారంటా, పుట్టింటి పొలము ఎవరో కబ్జా చేసారంట, మనకు ఏమి రానప్పుడు, మనకెందుకు. తగలాటకం.
భర్త : అవును, వంద శాతం నిజం. అమ్ముకోటానికో, సంతకాలకో, మనకేదైనా వస్తుందంటే మీ అక్కోళ్ళతో మాట్లాడదాము. ఇప్పుడు వాళ్ళు పలకరు, స్వార్ద పరులు అని దూరంగ ఉందాము. క్రుతజ్ఞత అనేది మనకు ఎటూ లేదూ, మనల్ని అడిగే మంచి చుట్టాలు స్నేహితులూ ఎటూ లేరు. అందరం అవకాశవాదులమే.
భార్య : మరి మన పిల్లాడు మనల్ని బాగా చూసుకుంటాడు గదూ, ఇంత కష్టపడి పెంచాము, చదివించాము. పుట్టింటోళ్ళ ఇల్లు ఉండబట్టి కదా, చదువుకు ఇంత పెట్ట గలిగింది. మా పుట్టింటోళ్ళను కూడా దూరం చేశాము పిల్లాడికి, మంచి మాటలు వినకూడదని.
భర్త : అవును, అందులో కూడా అనుమానము ఏముంది. మన తల్లి దండ్రులకు ఎంత విలువ ఇచ్చామో, స్పష్టము గా చూసాడు. 5 వ తరగతి నుంచే మనము విడిగా దూరంగా ఉంచుతూ ఉన్నాము. నువ్వన్నా 6 నెలలకు కలిసావు, నేను తండ్రి ప్రేమ ఫోన్ లో చాలు అనుకున్నా.
విదేశం నుంచి దేశానికి రావడము 4 గంటలే అయినా, ఖర్చు ఎందుకని రాలేదు. కనీసము వారాని కైనా రావచ్చు కానీ రాలేదు మధ్యలో. ఎందుకంటే బిడ్డలు అంటే అంత ప్రేమ నాకు. ఉత్తమ తల్లి దండ్రుల పురస్కారం మనకే ఇస్తారు.
ఇంక మనకు అన్ని మంచి రొజులే, మనల్ని మన తల్లి దండ్రుల కన్నా మించి చూస్తాడు. దేవుడు ఉన్నాడు, అని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు ఇద్దరు.
మనకేమీ ఇబ్బంది లేదు. నీ కేమైనా జరిగితే, నువ్వు బయట 10 ఇళ్ళకు పోయి ఫంక్షన్ లో పెత్తనము చేసి వచ్చావు చూడూ, వాళ్ళు వచ్చి నీకు చేస్తారు. నాకు ఏమైనా జరిగితే, మా ఆఫీస్ వాళ్ళు లేదా నేను తిరిగిన స్నేహితులు వచ్చి, మనతో ఉండి, సహయం చేస్తారు ,మంచము లో ఉంటే, అని నవ్వుకున్నారు.
అలా ఇద్దరు, అమరికలు లేకుండా స్పష్టము గా, విడి విడిగా, దూరపు భార్యా భర్తలుగా, జీవితాన్ని ఆనందముగా గడుపుతున్నారు. నటించి మోసము చేసే కన్నా, నిజాయితీగా వాస్తవాన్ని ఒప్పుకునే వాళ్ళు నిజమైన మనుషులని, ఎవరో పెద్దాయన చెప్పాడు. ఆదర్శ దంపతులు, తమ ఆనందమే ఇతరుల ఆనందము గా భావిస్తారు.
కలికాలము లో ఇంత నిజాయితీ గా ఉండటము ఎక్కడైనా చూస్తామా? కాలమే జవాబు చెపుతుంది.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1015 General Articles, 46 Tatvaalu Dt : 28-Jan-2019, Upd Dt : 10-Apr-2019, Category : General
Views : 941
( + More Social Media views ), Id : 43 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags :
best couple nice talk Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments