మా భూమి, బండెనక బండి కట్టి పదహరు బండ్లు గట్టి - యాదగిరి, గద్దర్, నర్సింగ్ రావు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,334; 104 తత్వాలు (Tatvaalu) and views 225,144.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గద్దర్ అన్న కు నివాళులు అర్పిస్తూ (74 ఏళ్ళు, ఆగస్ట్ 6 2023), మీరు మాటలలో కాకుండా, పాటలలో రాతలలో మాటలలో ఆనాటి తెలంగాణా లో నిజాం పాలాన అరాచకాలను ప్రజల కష్టాలను 10 మందికి తెలియచెప్తారు కదూ? ఎందుకంటే వారి వారసులకు సలాం కొడుతున్నారు మనలో చాలా మంది తమ అవసరం అవకాశం కోసం.

ఇప్పటికి ఆవేశముగా గతాన్ని తలచుకుని, అందరి నోటిలో వచ్చే విప్లవ గీతం. మీరూ పాడి మన తాతల ముత్తాతల బాధను ఒకసారి తలచుకుందాము.

బండి యాదగిరి రాసిన విప్లవ గీతం, గద్దర్ అన్న నోటి నుండి జాలువారిన నిప్పు కణిక. మా భూమి చిత్రం లో ఒక ఆణిముత్యం ల మెరిసిన పాట.

ఆనాటి నైజాం సర్కారు అరాచకాలను, ఈ పాటలో ప్రతి మాట ఎండగట్టింది. ప్రజల బాధను ఆవేశాన్ని కండ్లకు కట్టినట్లు చూపించింది.

నైజాం పోలీసులు మిలటరీ కలసి, ఎలా పల్లెలను దోచుకున్నారో తెలియచెప్పింది. జాగీరు దారులు, జామీను దారులు నైజాం రజాకార్ల అండ చూసుకుని ఎలా వేధించారో చెప్పింది.

పల్లె వీరులు ఆడపడుచులు, ఎలా ఎదురు తిరిగి రాళ్ళ తో కారం నీళ్ళతో వెంటపడితే, సైన్యం పారిపోయిందో చెప్పింది.

సూర్యాపేట అలాగే నల్లగొండ నుంచి అన్ని వైపులా వచ్చి, హైదరాబాదులో ఉండే మిమ్మల్ని, పక్కన ఉన్న గోల్కొండ ఖిల్లా కింద, సమాధి కడతామని హెచ్చరించింది.

మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి.

మే డే కి సంబంధము లేకపోయినా, నైజాం మీద పోరాడిన ప్రజల ఐఖ్యతా స్పూర్తిగా, విప్లవ గీతాన్ని పాడుకుందాము.

బండెన్క బండి గట్టి, పదహరు బండ్లు గట్టి
యే పల్లే బోతవ్ కొడుకో నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా ||బండెన్క బండి గట్టి||

పోలీసు మిల్ట్రీ రెండు బలవంతులానుకోని
నువు పల్లెలు దోస్తివి కొడుకో, ఓహో పల్లెలు దోస్తివి కొడుకో
అహ పల్లెలు దోస్తివి కొడుకో, నైజాము సర్కరోడా ||బండెన్క బండి గట్టి||

జాగీరుదారులంతా, జామీనుదారులంతా
నీ అండా జేరి కొడుకో, నీ అండా జేరి కొడుకో
నైజాము సర్కరోడా ||బండెన్క బండి గట్టి||

ఈ పురుషులంత గలిపి, ఇల్లాలమంత గలిపి
వడిసేల రాళ్ళు నింపి, వడివడిగ గట్టితేనూ
కారాపు నీళ్ళు దెచ్చి, కండ్లల్ల జల్లితేనూ
నీ మిల్ట్రి పారి పోయే, నీ మిల్ట్రి పారి పోయే
నైజాము సర్కరోడా ||బండెన్క బండి గట్టి||

చుట్టు ముట్టూ సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేదైద్రబాదు, దానిపక్కా గోలుకొండ
గోలుకొండా ఖిల్లకింద గోలుకొండా ఖిల్లకింద
నీ గోరి గడ్తం కొడుకో నైజాము సర్కరోడా

మా భూమి, బండెనక బండి కట్టి - గద్దర్, బి.నర్సింగ్ రావు
MAA BHOOMI, Bandenaka Bandi Katti padharu bandlu katti - Gaddar, B.Narsing Rao  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,334; 104 తత్వాలు (Tatvaalu) and views 225,144
Dt : 01-May-2022, Upd Dt : 01-May-2022, Category : Songs
Views : 1035 ( + More Social Media views ), Id : 1374 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : maabhoomi , telangana , bandenaka , bandi , gaddar , narsingrao , yadagiri , mayday
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content